- Home
- Feature
- Cheap Things Men do: అబ్బాయిలూ.. ఇలాంటి పనులు చేశారంటే అమ్మాయిల ముందు చీప్ అయిపోతారు జాగ్రత్త
Cheap Things Men do: అబ్బాయిలూ.. ఇలాంటి పనులు చేశారంటే అమ్మాయిల ముందు చీప్ అయిపోతారు జాగ్రత్త
Cheap Things Men do: పురుషులు మహిళల ముందు చేసే తప్పులు: తప్పుడు మాటలు, తప్పుడు ప్రవర్తన, క్రమశిక్షణ లేకపోవడం వ్యక్తి ఇమేజ్‌ను పాడు చేయడమే కాకుండా సామాజిక గౌరవాన్ని కూడా దూరం చేస్తాయని ఆయన నమ్మారు. మరి మహిళల ముందు అస్సలు చేయకూడని తప్పులు ఏంటి?

మగవారు చేయకూడని తప్పులు ఏంటి?
సాధారణంగా పురుషులు ఎల్లప్పుడూ మహిళలను మెప్పించడానికి ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. తమ మనసుకు నచ్చిన అమ్మాయిని ఆకర్షించేందుకు, ఆమె తనను గుర్తించేలా చేసుకునేందుకు ఏదైనా కొత్తగా చేయాలనుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిల ముందు తాము గొప్పగా కనిపించడానికి కొన్ని పనులు చేస్తూ ఉంటారు. కానీ తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులు అమ్మాయిలకు చాలా చీప్ గా కనిపిస్తాయి. అలాంటి అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడరు.
మగవారు తమకు నచ్చిన అమ్మాయిని ఇంప్రెస్ చేసేందుకు తమ సంపదను ప్రదర్శించడం వంటివి చేస్తారు. తమ డబ్బును ప్రదర్శించే వారి వ్యక్తిత్వం చాలా లేకిగా ఉంటుందనే భావన అమ్మాయిల్లో ఉంటుంది. అలాగే తమ సహజ ప్రవర్తనను మార్చుకుని అబ్బాయిలు కనిపించడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో తెలిసి లేదా తెలియక కొన్ని తప్పులు చేస్తారు. అది వారికి మంచి పేరు తీసుకురావడానికి బదులుగా ఉన్న పేరును కూడా పాడు చేస్తుంది.
చాణక్యుడు చెప్పిన ప్రకారం మహిళల పట్ల గౌరవం, హుందాతనం, చక్కటి ప్రవర్తన ఉన్న మగవారే వారికి నచ్చుతారు . తప్పుడు మాటలు, చీప్ ప్రవర్తన, క్రమశిక్షణ లేని ప్రవర్తన వల్ల మగవారి ఇమేజ్ మరింతగా చెడిపోతుంది. ఇవి వారిపై గౌరవం తగ్గేలా చేస్తాయి. మగవారు మహిళల ముందు అస్సలు చేయకూడని తప్పులు ఏమిటో చాణక్యుడు చెప్పాడు.
డబ్బు, హోదా ప్రదర్శన
చాలా మంది మగవారు తమ మనసుకు నచ్చిన మహిళను ఇంప్రెస్ చేసేందుకు తమ దగ్గరున్న డబ్బును, హోదాను ప్రదర్శిస్తారు. మహిళలతో మాట్లాడుతూ తమ శక్తిని, సంపదను చూపించేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఇలా మహిళల ముందు తమ బలం, సంపద లేదా హోదాను ప్రదర్శించే వారిని బుద్ధిలేని వారిగా వర్ణించాడు చాణక్యుడు. ఇలాంటి ప్రవర్తన ఒక వ్యక్తికి గౌరవం కంటే అవమానాల్నే ఇస్తుందని చెప్పాడు. నిజానికి ఒక వ్యక్తికి వినయమే అసలైన ఆభరణం అని చాణక్యుడు చెప్పాడు.
అసభ్యకర్ పదాలు వాడడం
చాణక్యుడు చెప్పిన ప్రకారం వాడే భాష కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. తమ మనసుకు నచ్చిన మహిళలతో డబుల్ మీనింగ్ జోకులు, అసభ్యకరమైన పదాలు వాడితే.. ఆ పురుషులను ఎవరూ ఇష్టపడరు. సరికదా దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అంతే కాదు అలాంటి వ్యక్తితో పరిచయం కూడా చాలా చీప్ పనిగా భావిస్తారు. అలాంటి వారిని ఫ్రెండ్ గా చెప్పుకునేందుకు కూడా సిగ్గుపడతారు.
కోపం కూడా పెద్ద శత్రువుగానే చెబుతున్నాడు చాణక్యుడు. చాలా మంది పురుషులు తెలిసి లేదా తెలియక మహిళల ముందు తమ కోపాన్ని ప్రదర్శిస్తారు, అరుస్తారు. అలా ప్రవర్తించడం మగతనంగా భావిస్తారు. కానీ ఈ ప్రవర్తన వారి బలహీనతను, ప్రవర్తనా లోపాన్ని చూపిస్తుంది. ఇలాంటి వారు ఎవరికీ నచ్చరు.
ఎక్కడపడితే అక్కడ చూడొద్దు
చాలా మంది మగవారు తాము చాలా ఓపెన్ అని చెప్పేందుకు తమ వ్యక్తిగత జీవితం గురించి పూసగుచ్చినట్టు చెప్పేస్తారు. కానీ చాణక్యుడు దీనిని బుద్ధిలేని పనిగా వర్ణించాడు. ప్రతి వ్యక్తికి అన్నీ చెప్పడం మంచిది కాదని చాణక్య నీతి చెబుతుంది. ముఖ్యంగా మీ బలహీనతలు, డబ్బు విషయాలు వంటివి మహిళలతో పంచుకోవడం చాలా సమస్యలకు కారణమవుతుంది. ఇలాంటి వారిని మహిళలు ఒప్పుకునే అవకాశం కూడ తక్కువే.
చాణక్యుడి ప్రకారం, ఒక వ్యక్తి రూపురేఖలు, ప్రవర్తన రెండూ ఆ వ్యక్తి గుణాన్ని చెబుతాయి. ఒక మహిళతో మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఆమె కళ్లలోకే చూస్తూ మాట్లాడాలి. అంతే తప్ప శరీరాన్ని చూడడం, తప్పుగా చూడడం అసభ్యకరమైన హావభావాలు ఇవ్వడం వంటివి చేయకూడదు. ఇది మహిళల పట్ల ఉన్న అగౌరవ వైఖరిని చెబుతుంది. ఇలాంటి వ్యక్తిని చూస్తూ అమ్మాయిలు అసహ్యించుకుంటారు కానీ ప్రేమించరు.

