MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • DMart Shopping: డీమార్ట్ లో రూ.5,000 బిల్లు రూ. 3000 కి తగ్గాలంటే ఈ చిన్న పని చేయండి!

DMart Shopping: డీమార్ట్ లో రూ.5,000 బిల్లు రూ. 3000 కి తగ్గాలంటే ఈ చిన్న పని చేయండి!

DMart Shopping: నెలవారీ సరుకుల కోసం డీమార్ట్‌కు వెళ్తే జేబుకు చిల్లు పడుతోందా? ఒకేసారి బిల్లు రూ.5,000 దాటుతోందా? అయితే ఇకపై టెన్షన్ వద్దు. కొన్ని సింపుల్ ట్రిక్స్‌తో అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తూనే షాపింగ్ ఖర్చును తగ్గించుకోవచ్చు. ఎలాగో చూద్దాం.

3 Min read
Author : Kavitha G
Published : Oct 16 2026, 02:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
డీమార్ట్ షాపింగ్ టిప్స్
Image Credit : Asianet News

డీమార్ట్ షాపింగ్ టిప్స్

పెరుగుతున్న ధరలతో నెలవారీ ఖర్చులను మేనేజ్ చేయడం మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద సవాలుగా మారింది. బియ్యం, పప్పులు, వంట నూనె, సబ్బులు, డిటర్జెంట్లు లాంటి నిత్యావసరాలు కొనడానికే వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. ముఖ్యంగా నెలకు రూ.5,000 సరుకుల కోసం కేటాయించే కుటుంబాలు, ఆ బడ్జెట్ ని ఎలా తగ్గించుకోవాలో ఆలోచిస్తుంటాయి. అయితే దీనికి పక్కా ప్లానింగ్‌తో చేసే షాపింగ్ బాగా హెల్ప్ అవుతుంది. డీమార్ట్‌లో వస్తువులు కొనేటప్పుడు కొన్ని సింపుల్ ట్రిక్స్ పాటిస్తే అనవసరపు ఖర్చులను ఈజీగా తగ్గించుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
షాపుకు వెళ్లే ముందే బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం
Image Credit : Gemini AI

షాపుకు వెళ్లే ముందే బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం

డీమార్ట్‌కు వెళ్లే ముందే ఇంట్లో ఏయే వస్తువులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. బియ్యం, పప్పులు, నూనె, చక్కెర, మసాలా దినుసులు లాంటి వాటిని విడివిడిగా లిస్ట్ రాసుకోండి. వాటిలో ఏవి అయిపోయాయి, ఏవి ఇంకా కొన్ని రోజులు వస్తాయో కూడా నోట్ చేసుకోండి. రూ.5,000 మొత్తాన్ని ఒకే రకమైన వస్తువుల కోసం ఖర్చు చేయకుండా, నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు, ఇంటి వస్తువులు అని విడదీసి ప్లాన్ చేసుకోండి. రూ.3,000 సరుకులకు, రూ.1,000 కూరగాయలు, పండ్లు, రూ.500 ఇంటి వస్తువులకు, మిగిలిన రూ.500 అనుకోని ఖర్చులకు కేటాయించవచ్చు. ఇది కేవలం ఒక మోడల్ బడ్జెట్ మాత్రమే; మీ ఇంట్లోని సభ్యుల సంఖ్యను బట్టి ఈ మొత్తాన్ని మార్చుకోవచ్చు.

38
తక్కువ ధర అని కాదు, కేజీ ధర ఎంతో చూడటం
Image Credit : gemini ai

తక్కువ ధర అని కాదు, కేజీ ధర ఎంతో చూడటం

డీమార్ట్‌లో ఒకే వస్తువు వేర్వేరు సైజుల్లో దొరుకుతుంది. చిన్న ప్యాకెట్ ధర తక్కువగా అనిపించినా, పెద్ద ప్యాకెట్‌తో పోల్చినప్పుడు కిలో లేదా లీటరు ధర ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి, వస్తువు మొత్తం ధరను మాత్రమే చూసి నిర్ణయం తీసుకోకండి. 500 గ్రాముల పప్పు రూ.60 అయితే, కిలో ధర రూ.120 అవుతుంది. అదే పప్పు కిలో ప్యాకెట్ రూ.110 ఉంటే, పెద్ద ప్యాకెట్ కొనడం వల్ల రూ.10 ఆదా చేయొచ్చు. అయితే ఆ వస్తువును ఇంట్లో రెగ్యులర్‌గా వాడుతున్నారా, ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుందా అనేది కూడా గమనించాలి. అవసరం లేని వస్తువును ఎక్కువ మొత్తంలో కొనడం పొదుపు అనిపించుకోదు.

48
బ్రాండ్ పేరు చూసి గుడ్డిగా కొనకూడదు
Image Credit : DMart

బ్రాండ్ పేరు చూసి గుడ్డిగా కొనకూడదు

కొన్ని వస్తువుల విషయంలో పాపులర్ బ్రాండ్లకు, తక్కువ ధరకు దొరికే ప్రత్యామ్నాయ వస్తువులకు మధ్య తేడా ఉండొచ్చు. పప్పులు, ఉప్పు, చక్కెర, క్లీనింగ్ వస్తువుల విషయంలో బరువు, నాణ్యత, తయారీ వివరాలు, ధరను పోల్చి చూసుకోండి. అలా అని అన్ని వస్తువుల్లోనూ చౌకగా వచ్చేదే బెస్ట్ అనుకోవడం కరెక్ట్ కాదు. ఆహార పదార్థాల నాణ్యత, తయారీ తేదీ, ఎక్స్‌పైరీ డేట్ లాంటివి గమనించిన తర్వాతే కొనాలి. ఒకే పరిమాణంలో ఉన్న రెండు వస్తువులను పోల్చి చూడటం వల్ల సరైన నిర్ణయం తీసుకోవచ్చు.

58
ఆఫర్లు చూసి అవసరం లేనివి కొనకూడదు
Image Credit : Gemini AI

ఆఫర్లు చూసి అవసరం లేనివి కొనకూడదు

ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఎక్కువ వస్తువులు కలిపి కొంటే డిస్కౌంట్ లాంటి ఆఫర్లు ఆకర్షణీయంగా అనిపించవచ్చు. కానీ ఇంట్లో ఇప్పటికే సరిపడా ఉన్న వస్తువును కేవలం ఆఫర్ కోసం కొంటే, డబ్బులు అనవసరంగా ఖర్చైపోతాయి. ఆఫర్ నిజంగా ఉపయోగపడుతుందా లేదా అని తెలుసుకోవడానికి, రెగ్యులర్ ధరను, ఆఫర్ ధరను పోల్చి చూడండి. కొనాల్సిన వస్తువులకు మాత్రమే ఆఫర్లను వాడుకోండి.

68
నెలవారీ, వారపు సరుకులను విడదీయడం
Image Credit : Gemini AI

నెలవారీ, వారపు సరుకులను విడదీయడం

బియ్యం, పప్పులు, నూనె, సబ్బులు లాంటి వస్తువులను అవసరాన్ని బట్టి నెలకు ఒకసారి కొనుక్కోవచ్చు. కానీ కూరగాయలు, పండ్లు, పాలు లాంటి త్వరగా పాడయ్యే వస్తువులను వారానికోసారి లేదా అవసరమైనప్పుడు మాత్రమే కొనడం మంచిది. దీనివల్ల ఎక్కువగా కొని వృథా చేసే పరిస్థితి తగ్గుతుంది. ఇంట్లో వాడే వస్తువుల పరిమాణాన్ని ఒక నెల పాటు గమనిస్తే చాలు, వచ్చే నెల అవసరాలను కచ్చితంగా అంచనా వేయొచ్చు. ఏ వస్తువు ఎన్ని రోజులు వస్తుందో ఒక చిన్న నోట్‌బుక్‌లో రాసుకోవడం కూడా బాగా హెల్ప్ అవుతుంది.

78
నిజంగా రూ.2,000 వరకు ఆదా చేయొచ్చా?
Image Credit : Asianet News

నిజంగా రూ.2,000 వరకు ఆదా చేయొచ్చా?

నెలకు రూ.5,000 ఖర్చు చేసే కుటుంబం రూ.2,000 ఆదా చేయడం అంటే 40 శాతం ఖర్చు తగ్గించుకోవడమే. ఇది అన్ని కుటుంబాలకు సాధ్యమవుతుందని కచ్చితంగా చెప్పలేం. ఇప్పటికే ఖర్చులు కంట్రోల్‌లో ఉంటే, ఇంత పెద్ద మొత్తంలో ఆదా చేయడం కష్టమే. అయినా సరే, అనవసరపు కొనుగోళ్లు, ఆహారం వృథా చేయడం, ధరలు పోల్చకుండా కొనడం లాంటివి తగ్గిస్తే చాలా డబ్బు మిగులుతుంది.

88
ఇది మర్చిపోవద్దు!
Image Credit : Gemini AI

ఇది మర్చిపోవద్దు!

డీమార్ట్‌లో షాపింగ్ చేసినంత మాత్రాన డబ్బులు ఆదా అయిపోవు. ఏం కొనాలి, ఎంత కొనాలి, ఎక్కడ ధరను పోల్చి చూడాలి అనేది తెలుసుకోవడమే ముఖ్యం. నెలవారీ లిస్ట్ రాసుకోవడం, ఒక యూనిట్ ధరను లెక్కించడం, ఆఫర్లను చెక్ చేయడం, అనవసరపు కొనుగోళ్లను ఆపడం లాంటివి క్రమం తప్పకుండా పాటిస్తే మధ్యతరగతి కుటుంబాలు తమ సరుకుల ఖర్చును కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా నెలనెలా చేసే చిన్న చిన్న పొదుపులను కలిపితే, ఏడాది చివరకు పెద్ద పొదుపుగా మారవచ్చు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 
2nd ODI • NZ vs IND 2026
Live
NZNZ
134
INDIND
(19.2 ov)82/4
IND need 53 runs in 166 balls
Schedule ›
1st T10 • ABDT10
UABUAB
Sat, 7 Nov, 2026
YASLYASL
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Beer Capital: ప్రపంచపు బీర్ రాజధాని ఇది.. ఇక్కడ బీర్ అంటే ఒక ఎమోషన్..!
Recommended image2
Saree Designs: దీపావళి పండగ వేళ మీ అందాన్ని పెంచే చీరల కలెక్షన్
Recommended image3
Salt Capital: మన దేశపు ఉప్పు రాజధాని.. దేశంలో మొత్తం ఉప్పు ఇక్కడే తయారౌతుంది..!
Related Stories
Recommended image1
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఈ 5 తప్పులు చేస్తే ఎంత సంపాదించినా పేదరికం తప్పదు!
Recommended image2
Psychology: సైకాలజీ ప్రకారం ఒక వ్యక్తి నిజంగా ఎలాంటివాడో చెప్పే 5 సందర్భాలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved