MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Lepakshi : ప్రపంచంలో ఎక్కడా కనిపించని వింత ఆలయం.. బ్రిటిషర్లనే ఆశ్చర్యపరిచిన టెంపుల్

Lepakshi : ప్రపంచంలో ఎక్కడా కనిపించని వింత ఆలయం.. బ్రిటిషర్లనే ఆశ్చర్యపరిచిన టెంపుల్

Lepakshi: ఆలయంలో వందలాది రాతి స్తంభాలు.. వాటిలో ఒకటి మాత్రం నేలను తాకకుండానే నిలబడింది. ఆంధ్రప్రదేశ్‌లోని లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో ఉన్న ఈ వింత నిర్మాణం వెనుక రహస్యమేంటి? బ్రిటిష్ ఇంజినీర్ కూడా దీన్ని కదిలించలేకపోయారా?

2 Min read
Author : Nandini Arava
Published : Oct 20 2026, 05:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
స్తంభం ఇలా ఎలా నిలబడింది?
Image Credit : gemini ai

స్తంభం ఇలా ఎలా నిలబడింది?

ఆంధ్రప్రదేశ్‌లోని ఓ పురాతన ఆలయం అక్కడి శిల్పకళా వైభవంతో పాటు ఓ ప్రత్యేక నిర్మాణం కారణంగా పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆలయంలోని ఓ రాతి స్తంభం అడుగు భాగం నేలను పూర్తిగా తాకకుండా కనిపించడం సందర్శకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆ స్తంభం కింద నుంచి పల్చని వస్త్రాన్ని దూర్చి మరోవైపు నుంచి బయటకు తీయవచ్చు. ఇంత బరువైన రాతి స్తంభం ఇలా ఎలా నిలబడింది? వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయంలో ఇలాంటి ప్రత్యేకత ఉండటానికి కారణమేంటి? ఈ విశేషం అనంతపురం ప్రాంతంలోని చారిత్రక లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో కనిపిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
500 ఏళ్ల నాటి ఆలయంలో ఈ వింత నిర్మాణం!
Image Credit : gemini ai

500 ఏళ్ల నాటి ఆలయంలో ఈ వింత నిర్మాణం!

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న లేపాక్షి గ్రామం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ప్రాంతం. ఇక్కడి వీరభద్రస్వామి ఆలయం విజయనగర సామ్రాజ్య కాలంనాటి అద్భుత శిల్పకళకు నిదర్శనం. 16వ శతాబ్దంలో ఈ ఆలయ సముదాయం విశేషంగా అభివృద్ధి చెందింది. ఆలయంలోని శిల్పాలు, పైకప్పుపై చిత్రాలు, రాతి నిర్మాణాలు ఆనాటి కళాకారుల నైపుణ్యాన్ని చాటిచెబుతాయి.

ఈ ఆలయంలోని మండపంలో సుమారు 70 రాతి స్తంభాలు ఉన్నాయి. వీటిలో ప్రత్యేకంగా కనిపించేది ఈ వేలాడే స్తంభమే. మిగతా స్తంభాలు నేలపై ఆనుకుని ఉండగా, ఈ స్తంభం అడుగు భాగం మాత్రం పూర్తిగా నేలను తాకదు. స్తంభం కింద కనిపించే ఖాళీలోంచి కాగితం లేదా వస్త్రాన్ని ఒకవైపు నుంచి మరోవైపుకు దూర్చవచ్చు. ఈ ప్రత్యేకతే దీన్ని చూడటానికి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు.

అసలు విషయం ఏంటంటే...స్తంభం కొంత పక్కకు జరిగి ఉండటంతో ఒకవైపు నేలను తాకుతూ, మరోవైపు ఖాళీగా ఉంటుంది.

33
బ్రిటిష్ ఇంజినీర్ కథలో నిజమెంత?
Image Credit : gemini ai

బ్రిటిష్ ఇంజినీర్ కథలో నిజమెంత?

ఈ స్తంభం గురించి మరో ఆసక్తికరమైన కథ కూడా ప్రచారంలో ఉంది. బ్రిటిష్ పాలన కాలంలో ఓ ఇంజినీర్ దీని రహస్యాన్ని తెలుసుకునేందుకు స్తంభాన్ని కదిలించడానికి ప్రయత్నించాడని, దాంతో ఆలయ నిర్మాణంపై ప్రభావం పడటంతో ప్రయత్నాన్ని విరమించుకున్నాడని చెబుతుంటారు.

వేలాడే స్తంభమే కాదు.. లేపాక్షిలో చూడాల్సినవి ఇంకా ఎన్నో!

లేపాక్షి ఆలయానికి వెళ్లేవారు ఈ ఒక్క స్తంభాన్ని చూడటం మాత్రమే కాదు. ఆలయ పైకప్పుపై కనిపించే పురాతన చిత్రాలు, రాతిపై చెక్కిన దేవతామూర్తులు, అద్భుతమైన మండపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆలయానికి సమీపంలో ఉన్న భారీ ఏకశిలా నంది విగ్రహం కూడా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. విజయనగర కాలపు శిల్పకళను దగ్గరగా చూడాలనుకునేవారికి, పురాతన నిర్మాణాల వెనుక ఉన్న నైపుణ్యాన్ని తెలుసుకోవాలనుకునేవారికి లేపాక్షి ఓ మంచి గమ్యస్థానం. ముఖ్యంగా చరిత్ర, ఆర్కిటెక్చర్, మిస్టరీ ప్రదేశాలపై ఆసక్తి ఉన్నవారు తప్పక చూడదగిన ప్రాంతాల్లో ఇది ఒకటి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Smallest War: కేవలం 38 నిమిషాల్లోనే ముగిసిన యుద్ధం.. ఏఏ దేశాల మధ్యే జరిగిందో తెలుసా?
Recommended image2
River Water: న‌దుల్లో నీరు ఎందుకు తియ్య‌గా ఉంటాయో తెలుసా.?
Recommended image3
Train: రైలులో ప్రయాణిస్తున్నప్పుడు చైన్ లాగితే ఏం జరుగుతుంది? చైన్ ఎవరు లాగారో ఎలా తెలుస్తుంది?
Related Stories
Recommended image1
viral content : ఈ 5 సీక్రెట్ ఫార్ములాలు వాడితే చాలు..మీ వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతాయి
Recommended image2
Sadhguru : భూమిపై ఇక 60 పంటలు పండుతాయి.. మట్టిసారంపై సద్గురు ఆందోళన, ప్రపంచానికి వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved