MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Amla Capital: ఇండియాలో ఉసిరికాయ రాజధానిగా ఏ జిల్లాను పిలుస్తారో తెలుసా?

Amla Capital: ఇండియాలో ఉసిరికాయ రాజధానిగా ఏ జిల్లాను పిలుస్తారో తెలుసా?

Amla Capital: ఉసిరికాయ అంటే పచ్చడి. ఈ అక్టోబర్ నుంచే పంట స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ఉసిరికాయ ఓ ప్రాంతానికి ప్రత్యేక అడ్డాగా మారింది. వేల ఎకరాల్లో తోటలు, ప్రాసెసింగ్ యూనిట్లతో ‘ఆమ్లా క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా ప్రసిద్ధి చెందిన ఆ ప్రాంతం ఎక్కడుందో తెలుసా?

2 Min read
Author : Nandini Arava
Published : Oct 01 2026, 06:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఉసిరికాయ రాజధాని ఎక్కడుంది?
Image Credit : gemini ai

ఉసిరికాయ రాజధాని ఎక్కడుంది?

చలికాలం వచ్చిందంటే మార్కెట్లలో ఉసిరికాయలు కనిపిస్తాయి. పూజలకు వాడతారు. అలాగే ఆరోగ్యానికి చాలా మంచిదని విరివిగా తింటూ ఉంటారు. ఈ మధ్య ఉసిరికి మరీ డిమాండ్ పెరిగింది. కరోనా తర్వాత ఆరోగ్యం మీద దృష్టి పెరగడంతో ఉసిరిని ఎక్కువగా తీసుకుంటున్నారు. పచ్చిగా తినడం నుంచి పచ్చడి, మురబ్బా, జ్యూస్, పొడి వరకు ఉసిరితో ఎన్నో రకాల తయారు చేస్తుంటారు. అయితే దేశంలో ఓ ప్రాంతానికి మాత్రం ఉసిరితో ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. వేల ఎకరాల్లో విస్తరించిన ఉసిరి తోటలు, దాని ఆధారంగా నడుస్తున్న ప్రాసెసింగ్ పరిశ్రమలతో ఆ ప్రాంతం ‘ఆమ్లా క్యాపిటల్‌’గా ప్రసిద్ధి చెందింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆమ్లా క్యాపిటల్‌గా ప్రతాప్‌గఢ్
Image Credit : gemini ai

ఆమ్లా క్యాపిటల్‌గా ప్రతాప్‌గఢ్

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌ను సాధారణంగా ‘ఆమ్లా క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు. అక్కడ ఉసిరి సాగు భారీ స్థాయిలో జరుగుతుంది. జిల్లా అధికారిక వెబ్‌సైట్ కూడా ప్రతాప్‌గఢ్‌ను ‘ది సిటీ ఆఫ్ ఆన్లా’గా పేర్కొంటోంది. అంతేకాదు..ఉసిరి ఈ జిల్లాకు కేంద్ర ప్రభుత్వ ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్’ (ODOP) కింద ఎంపికైన ప్రధాన ఉత్పత్తి ఇది.

ఉత్తరప్రదేశ్ దేశంలోనే అత్యధిక ఉసిరి ఉత్పత్తి చేసే రాష్ట్రంగా పేరు పొందింది. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ఉసిరిలో సుమారు 60 శాతం వరకు ఉత్తరప్రదేశ్ నుంచే వస్తుంది. ఆ రాష్ట్రంలోనూ ప్రతాప్‌గఢ్ ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా ఉంది. జిల్లాలో సుమారు 20 వేల హెక్టార్లలో ఉసిరి తోటలు విస్తరించి ఉన్నాయి.

35
ఉసిరి నుంచి ఎన్నో ఉత్పత్తులు
Image Credit : stockPhoto

ఉసిరి నుంచి ఎన్నో ఉత్పత్తులు

ప్రతాప్‌గఢ్‌లో పండిన ఉసిరికాయలను అలానే మార్కెట్ కు చేర్చకుండా వాటిని వివిధ రకాల ఉత్పత్తులుగా మార్చి విక్రయిస్తున్నారు. ఉసిరి క్యాండీ, మురబ్బా, జ్యూస్, పచ్చడి, పొడి, లడ్డూ వంటి పదార్థాలను తయారు చేస్తున్నారు. దీంతో ఉసిరిని పంటగా విక్రయించడంతో పాటు.. ప్రాసెసింగ్ ద్వారా అదనపు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ముఖ్యంగా ODOP కార్యక్రమం ద్వారా ఉసిరి ఆధారిత ఉత్పత్తుల ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్‌పై మరింత దృష్టి పెరిగింది.

45
ప్రతాప్‌గఢ్ ఉసిరికి GI గుర్తింపు
Image Credit : our own

ప్రతాప్‌గఢ్ ఉసిరికి GI గుర్తింపు

ప్రతాప్‌గఢ్ ఉసిరికి మరో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. 2023 మార్చిలో దీనికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) రిజిస్ట్రేషన్ లభించింది. ప్రతాప్‌గఢ్ ఉసిరి సాధారణంగా ఆకుపచ్చ-పసుపు రంగులో ఉండటంతో పాటు ప్రత్యేకమైన పులుపు, వగరు రుచిని కలిగి ఉంటుందని ODOP పోర్టల్ పేర్కొంది. GI గుర్తింపు వల్ల స్థానికంగా పండించే ఉసిరికి మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు లభించింది.

55
100కు పైగా ప్రాసెసింగ్ యూనిట్లు
Image Credit : social media

100కు పైగా ప్రాసెసింగ్ యూనిట్లు

2026 సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రతాప్‌గఢ్ ఉసిరి పరిశ్రమ గురించి ప్రస్తావించారు. ODOP పథకం ద్వారా ఉసిరి ఆధారిత వ్యాపారాలకు లభిస్తున్న అవకాశాలను ఆయన వివరించారు. ఉసిరి క్యాండీ, ప్రిజర్వ్స్, జ్యూస్, పచ్చడి, డైజెస్టివ్ పౌడర్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాల గురించి కూడా ప్రస్తావించారు. జిల్లాలో సుమారు 100 ఉసిరి ప్రాసెసింగ్ యూనిట్లు పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఒకప్పుడు సీజన్‌లో మాత్రమే ఎక్కువగా కనిపించే ఉసిరికాయ.. ఇప్పుడు క్యాండీ, జ్యూస్, మురబ్బా, పొడి వంటి రూపాల్లో ఏడాది పొడవునా వినియోగదారులకు చేరుతోంది. పంటను ప్రాసెస్ చేసి విలువ పెంచడం వల్ల స్థానిక రైతులు, మహిళా సంఘాలు, చిన్న వ్యాపారాలకు కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Railway: ఈ దేశాల్లో ఒక్క రైలు క‌నిపించ‌దు.. అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?
Recommended image2
Success Story: ఉద్యోగం కాదని వ్యవసాయంలోకి MBA గ్రాడ్యుయేట్..బీడుభూమిని సాగు చేస్తూ లక్షల్లో ఆదాయం
Recommended image3
వ‌ర్షాకాలంలో క‌నిపించే ఈ పురుగులు ఏంటో తెలుసా? వీటిని తాకితే ఏమ‌వుతుంది.?
Related Stories
Recommended image1
River : ప్రపంచంలో అతిపెద్ద నదీ ద్వీపం.. ఎక్కడుందో తెలుసా?
Recommended image2
Success Story: ఉద్యోగం కాదని వ్యవసాయంలోకి MBA గ్రాడ్యుయేట్..బీడుభూమిని సాగు చేస్తూ లక్షల్లో ఆదాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved