MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • SIP Investment: సిప్‌లో నెలకు 5 వేలు ఇన్వెస్ట్ చేసి కోటి రూపాయలకు పైగా సంపాదించండి ఇలా

SIP Investment: సిప్‌లో నెలకు 5 వేలు ఇన్వెస్ట్ చేసి కోటి రూపాయలకు పైగా సంపాదించండి ఇలా

SIP Investment: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ఒక మంచి మార్గం. ఇందులో ప్రతి నెలా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేయడం ద్వారా భారీగా లాభాలు పొందవచ్చు.

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 12 2026, 10:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
సిప్ చేయడం వల్ల లాభాలు
Image Credit : Getty

సిప్ చేయడం వల్ల లాభాలు

మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ ఒక భాగం. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) చాలా ఉత్తమ మార్గం. ఇందులో ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతీ నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసినా చాలు. ఈ పద్ధతి వల్ల 'రూపీ కాస్ట్ యావరేజింగ్', 'కాంపౌండింగ్' (చక్రవడ్డీ) లాంటి ప్రయోజనాలు ఇన్వెస్టర్లకు అందుతాయి. అందుకే దీర్ఘకాలంలో డబ్బును ఎక్కువగా పొందాలనుకుంటే సిప్ చేయాలి. ప్రతీ నెలా రూ.5,000 సిప్ చేయండి చాలు. ఏడాదికి సంవత్సరానికి 12% రాబడి వచ్చే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పదేళ్లు సిప్ చేస్తే
Image Credit : Getty

పదేళ్లు సిప్ చేస్తే

మీరు నెలకు రూ.5,000 చొప్పున పదేళ్ల పాటూ సిప్ లో పెట్టుబడి పెట్టారనుకుందాం. మీరు 10 ఏళ్లపాటు ప్రతీ నెలా రూ.5,000 ఇన్వెస్ట్ చేస్తే మీరు మొత్తం పెట్టిన పెట్టుబడి రూ.6,00,000 అవుతుంది. ఏడాదికి 12 శాతం మేర లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పదేళ్ల తరువాత మీ డబ్బు రూ.11,61,696 అవుతుంది.

అదే ఇరవై ఏళ్లకు లెక్కకడితే.. పెట్టుబడి కాలాన్ని పెంచినప్పుడు 'కాంపౌండింగ్' ప్రభావంతో డబ్బు వేగంగా పెరుగుతుంది. 20 ఏళ్లలో మీరు పెట్టిన పెట్టుబడి రూ.12,00,000 అవుతుంది. అదే సంభావ్య రాబడి రూ.37,95,740 అవుతుంది. ఇక మీరు పెట్టిన పెట్టుబడి, రాబడి కలిపితే మొత్తం విలువ: రూ.49,95,740. మీరు పెట్టిన నాలుగు రెట్లు లాభం పొందుతారు. అదే 30 ఏళ్ల పాటూ సిప్ కొనసాగించినా లేక నెలకు రూ. 10,000 చొప్పున సిప్ చేసినా కోటి రూపాయలకు పైగా సంపదను పొందుతారు.

Related Articles

Related image1
AC Remote: ఏసీ రిమోట్ తెల్లగా ఉంటే.. టీవీ రిమోట్ నల్లగా ఉంటుంది, ఎందుకో తెలుసా?
Related image2
పంచభక్ష్య పరమాన్నాలు అంటే ఏమిటి? వాటిలో ఎలాంటి ఆహారాలు ఉంటాయి?
33
చక్రవడ్డీతో లాభాలు
Image Credit : ChatGPT

చక్రవడ్డీతో లాభాలు

కాంపౌండింగ్ లేదా చక్రవడ్డీకి శక్తి ఎక్కువ. పెట్టుబడిని ఎక్కువ కాలం కొనసాగించడం వల్ల మీ డబ్బు ఎంతలా పెరుగుతుందో అర్థమవుతుంది. 10 ఏళ్లలో రూ.6 లక్షల పెట్టుబడి సుమారు రూ.11.62 లక్షలు అయ్యింది. అదే 20 ఏళ్లకు వచ్చేసరికి, పెట్టుబడి రెట్టింపు (రూ.12 లక్షలు) అయినా, మొత్తం నిధి దాదాపు రూ.50 లక్షలకు చేరింది. ఇందులో ఎక్కువ భాగం రాబడి నుంచే వచ్చింది. ఇక 30 ఏళ్లలో అయితే అసలు మ్యాజిక్ కనిపిస్తుంది. రూ.18 లక్షల పెట్టుబడి ఏకంగా రూ.1.76 కోట్లకు పైగా పెరిగింది. ఇందులో రాబడే రూ.1.58 కోట్లకు పైగా ఉంది. అందుకే ఆర్థిక నిపుణులు చిన్న వయసులోనే సిప్ మొదలుపెట్టి, దీర్ఘకాలం కొనసాగించాలని సలహా ఇస్తారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Loan : ఇండియాలో గోల్డ్ లోన్స్ అత్యధికంగా తీసుకునే రాష్ట్రమేది? ఏపీ, తెలంగాణ స్థానమెంత?
Recommended image2
Gold Price Hike: బ్రేకుల్లేకుండా పసిడి ధరలకు రెక్కలు..అమెరికా-ఇరాన్ ఎఫెక్ట్ తో పైపైకి
Recommended image3
Petrol Price: మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి? హోర్ముజ్ వివాదంతో ఊహించని షాక్
Related Stories
Recommended image1
AC Remote: ఏసీ రిమోట్ తెల్లగా ఉంటే.. టీవీ రిమోట్ నల్లగా ఉంటుంది, ఎందుకో తెలుసా?
Recommended image2
పంచభక్ష్య పరమాన్నాలు అంటే ఏమిటి? వాటిలో ఎలాంటి ఆహారాలు ఉంటాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved