MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • తెలంగాణలో 6 అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రాలు, తప్పకుండా సందర్శించాల్సిన ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు ఇవే!

తెలంగాణలో 6 అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రాలు, తప్పకుండా సందర్శించాల్సిన ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు ఇవే!

భారతదేశంలో ఆధ్యాత్మిక సంస్కృతికి, చారిత్రక కట్టడాలకు తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న ప్రతి గుడి వెనుక వందల సంవత్సరాల చరిత్ర, అద్భుతమైన శిల్పకళ దాగి ఉన్నాయి. కచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రాలు ఇవే

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 23 2026, 03:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
యాదాద్రి లక్ష్మీనృసింహ స్వామి క్షేత్రం
Image Credit : X/airnews_hyd

యాదాద్రి లక్ష్మీనృసింహ స్వామి క్షేత్రం

యాదాద్రి అనగానే మనకు భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధ దివ్యక్షేత్రం యాదగిరి గుట్ట గుర్తుకు వస్తుంది. స్వయంభూ శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కొలువుదీరిన ఈ పుణ్యక్షేత్రం ఇటీవలి కాలంలో అద్భుతమైన శిల్పకళతో అద్భుత శైలిలో పునర్నిర్మించబడింది. నల్లరాతి శిల్పాలతో నిర్మించిన ఈ దేవాలయం సౌందర్యం చూసేందుకు రెండు కళ్ళు చాలవు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం
Image Credit : X/kishanreddybjp

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం

గోదావరి నదీ తీరంలో వెలిసిన భద్రాచలం శ్రీరాముని క్షేత్రం తెలుగు ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. రామభక్తుడైన కంచర్ల గోపన్న (భక్త రామదాసు) నిర్మించిన ఈ చారిత్రక ఆలయం వైభవం వర్ణనాతీతం. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్షేత్రానికి అనుబంధంగా పర్ణశాల, పాపికొండలు ఇలా చాలా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.

34
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం
Image Credit : Asianet News

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం శైవ క్షేత్రాలలో అత్యంత ప్రాముఖ్యమైనది. ఇక్కడ హరిహర క్షేత్రంగా భక్తులు కొలుస్తారు. భక్తులు తమ కోర్కెలు నెరవేరాలని కోరుకుంటూ ఇక్కడ జరిగే కోడె మొక్కులను చెల్లించడం ఇక్కడి ప్రధాన విశేషం.

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం

అక్షరాభ్యాసాలకు ప్రసిద్ధి చెందిన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం నిర్మల్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున వెలిసింది. చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

44
జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం (అలంపూర్)
Image Credit : Asianet News

జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం (అలంపూర్)

జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌లో ఉన్న ఈ ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. తుంగభద్ర, కృష్ణా నధులు సంగమించే ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ చారిత్రక ఆలయం చాళుక్యుల కాలం నాటి అద్భుతమైన శిల్పకళకు ప్రతీకగా నిలుస్తుంది.

రామప్ప దేవాలయం (పాలంపేట)

ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ ప్రఖ్యాత యునెస్కో (UNESCO) గుర్తింపు పొందిన ఈ దేవాలయం కాకతీయుల అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. ఇక్కడ నీటిలో తేలే ఇటుకలతో నిర్మించిన నిర్మాణాలు ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేస్తాయి.

ఈ చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రాలే కాకుండా తెలంగాణలో రామగిరి ఖిల్లా, కొమురవెల్లి మల్లన్న ఆలయం, కురవి వీరభద్ర స్వామి ఆలయం, వరంగల్ భద్రకాళీ ఆలయం, మొదలైన ఎన్నో దివ్య ప్రదేశాలు మన సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. వీకెండ్స్‌లో లేదా సెలవులలో సందర్శన మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. కుటుంబంతో కలిసి ఈ అద్భుత క్షేత్రాలను సందర్శించి తరించండి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వైరల్ న్యూస్
 
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
2nd TEST • SA vs AUS
Result
SASA
425/9
AUSAUS
99 & 295
SA beat AUS by 31 runs
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
02:00 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Paralakhemundi Railway Station: బ్రిటిషర్లు కాదు, ఇండియన్ రైల్వే కాదు...రాజు నిర్మించిన రైల్వేస్టేషన్, ఎక్కడుందో తెలుసా?
Recommended image2
IRCTC : కేవలం రూ.5670 చాలు.. హైదరాబాద్ నుండి అన్నవరం, ద్రాక్షారామం, అంతర్వేది, రాజమండ్రి చుట్టివచ్చేలా టూర్ ప్యాకేజ్
Recommended image3
Smart Toothbrush: వామ్మో బ్రష్ ధర రూ.47 వేలా? నోట్లో ఏం జరుగుతుందో లైవ్‌గా చూడొచ్చు
Related Stories
Recommended image1
America: ఇండియన్స్‌ను అమెరికాలో స్థానికులు ఎలా చూస్తారు? రియాలిటీ ఏంటంటే?
Recommended image2
Rajinikanth Sun Pictures: రజినీకాంత్ - సన్ పిక్చర్స్ కాంబోలో హిట్స్, ప్లాప్స్ ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved