America: ఇండియన్స్‌ను అమెరికాలో స్థానికులు ఎలా చూస్తారు? రియాలిటీ ఏంటంటే?
America: అమెరికాలో లక్షల్లో ఇండియన్స్ ఉన్నారుజ మనవాళ్లు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా మన ఇండియన్స్ పోటీ చేశారు. సాధారణంగా అక్కడ సెటిల్ అయిన ఇండియన్స్ తో అమెరికన్స్ ఎలా ఉంటారు?

అమెరికా అంటే క్రేజ్ ఎక్కువ..
ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ఉపాధి అవకాశాలు, మంచి ఎడ్యుకేషన్, కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ విదేశాలకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా మన దేశం నుంచి, అదికూడా తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. అయితే, విదేశాలకు వెళ్లాలని కలలు కనే ప్రతి ఒక్కరి మనసులోనూ, అలాగే ఇప్పటికే అక్కడ నివసిస్తున్న వారి బంధువుల మదిలోనూ ఒక సాధారణ ప్రశ్న మెదులుతూనే ఉంటుంది. అదేమిటంటే.. అమెరికాలో స్థానికులు మన ఇండియన్స్‌ను ఎలా చూస్తారు?
ఇండియన్స్ ను ఎలా చూస్తారు?
అమెరికాలో మన పట్ల వారి ప్రవర్తన, ఆలోచనా విధానం ఎలా ఉంటుంది? ఇండియన్స్‌ను ఎలా చూస్తారు? అనే సందేహాలు సర్వసాధారణంగా ఉంటూనే ఉంటాయి. ఈ కీలకమైన అంశంపై అమెరికాలో ఉంటున్న ఓ తెలుగు యూట్యూబర్ సోషల్ మీడియాలో రకరకాల వీడియోల ద్వారా వివరిస్తున్నారు. తాజాగా ఈ విషయానికి సబంధించి ఆసక్తికరమైన వీడియో నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇండియన్స్ పై అభిమానం..
అమెరికా గడ్డపై నివసించే ప్రవాస భారతీయులు (NRI's) దైనందిన జీవితంలో ఎదుర్కొనే అనుభవాలు, అక్కడి సామాజిక వాతావరణం, అమెరికన్స్ ఎలా స్పందిస్తారన్న విషయంపై ఆమె వివరించారు. సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతుంటాయి. అమెరికాలో ఇండియాన్స్ ను చాలా చులకనగా చూస్తారన్న పేరు ఉంది. అయితే ఈ విధంగా కొన్ని చోట్ల మాత్రమే జరుగుతందట. అది కూడా ఏదైనా ఇబ్బందిరపరిస్థితులు ఉన్నా. మనవాళ్లలో కొంత మంది అల్లరి చిల్లరిగా చేసినా.. రియాక్షన్ వేరే విధంగా ఉంటుంది.
అన్నిరంగాల్లో రాణిస్తున్నారు..
కానీ ఎక్కువ శాతం మన ఇండియాన్స్ పై అమెరికాలో జనాలు చాలా ప్రేమగా ఉంటారట. సాధారణంగా విదేశాల్లో భారతీయుల పట్ల గౌరవం గతంతో పోలిస్తే ఇప్పుడు ఎంతో మెరుగుపడింది. అక్కడి ప్రముఖ కంపెనీల్లో, ముఖ్యంగా టెక్నాలజీ, వైద్యం, పరిశోధన ,మేనేజ్‌మెంట్ రంగాల్లో ఇండియన్స్ అగ్రస్థానాలలో ఉండటం వల్ల స్థానికుల నుంచి మనవాళ్లకు ఎంతో ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. ఒకప్పుడు కేవలం చదువుకోసమే అమెరికాకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ప్రతి రంగంలోనూ భారతీయులు నాయకత్వ స్థానాల్లో రాణిస్తుండటంతో అమెరికన్లలో కూడా స్పష్టమైన మార్పు వచ్చింది.
అమెరికాలో ఇండియన్ పండుగలు..
అంతే కాదు అమెరికన్లు మన పండుగలను కూడా గౌరవిస్తుంటారు. హిందూ పండుగలు జరుపుకోవడానికి పర్మీషన్లు ఇవ్వడంతో పాటు.. ఎటువంటి ఇబ్బందులు జరగకుండా పోలీసులత భద్రత కూడా ఇస్తుంటారు. అయితే, భిన్న సంస్కృతుల సమ్మేళనం ఉన్న ఆ దేశంలో కొన్నిసార్లు చిన్నచిన్న సాంస్కృతిక సవాళ్లు, సర్దుబాటు ధోరణులు అవసరమవుతుంటాయి. లాంగ్వేజ్ లో కానీ, లైఫ్ స్టైల్ లో కానీ.. చాలా తేడాలు ఉంటాయి. వాటి వల్ల కొత్తగా వెళ్లిన వారికి కొన్ని ఇబ్బందులు ఎదురుకావడం సహజమే.







