- Home
- Feature
- Snakebite: పాము కాటుకి పల్లెటూర్లలో ఇచ్చే చెక్కలు, మూలికల మందులు నిజంగా పనిచేస్తాయా.. అసలు నిజం ఇదే
Snakebite: పాము కాటుకి పల్లెటూర్లలో ఇచ్చే చెక్కలు, మూలికల మందులు నిజంగా పనిచేస్తాయా.. అసలు నిజం ఇదే
పల్లెటూర్లలో పాము కాటుకి విరుగుడుగా కొన్ని రకాల మూలకలు, చెక్కల మందులు ఇస్తుంటారు. ఇవి పనిచేస్తాయి అని కొందరు బలంగా నమ్ముతారు కూడా. నిజంగానే అవి పాము విషానికి విరుగుడుగా పనిచేస్తాయా ? మనిషిని కాపాడతాయా ?

పాముకాటుకు చెక్కల మందులు
ఎవరైనా వ్యక్తి పాము కాటుకి గురైతే పల్లెటూర్లలో చెక్కల మందులు( మూలికలు లేదా చెట్టు బెరడుతో చేసిన మందులు) ఇస్తుంటారు. ఆ మందులు విషానికి విరుగుడుగా పనిచేసి మనిషిని రక్షిస్తాయి అని నమ్మేవాళ్ళు. ఇది నిజమా అంటే వైద్యశాస్త్రం ప్రకారం ఏమాత్రం నిజం కాదు. చెక్కల మందులు విషపూరితమైన పాము కాటుకి విరుగుడుగా పనిచేయవు.
అసలు నిజం ఇదే
కానీ పల్లెల్లో జనాలు చెక్కల మందుల్ని నమ్మడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. మన దేశంలో ఉండే పాముల్లో 70 శాతం విషపూరితమైనవి కావు. దీనితో విషం లేని పాములు కరచినప్పుడు కొద్దిపాటి మాట, చిన్న వాపు ఉండేవి. చెక్కల మందుల్లో కొంత వరకు ఔషధ గుణాలు ఉండొచ్చు. దాని వల్ల మంట నుంచి ఉపసనం కలిగేది. విషం లేని పాము కాబట్టి మనిషికి ఏమయ్యేది కాదు. దీనితో చెక్కల మందు పనిచేసింది అని జనాలు నమ్మేవారు.
నాటు వైద్యుల చుట్టూ తిరగొద్దు
కొన్నిసార్లు విషపూరితమైన పాము కరచినప్పటికీ విషాన్ని శరీరంలోకి వదలవు. దీనిని డ్రై బైట్ అంటారు. అప్పుడు కూడా చెక్కల మందుల వల్లే మనిషి బతికాడని భావించేవారు. పాము కాటుకి గురైనప్పుడు ఎలాంటి ఆలస్యం చేసుకుండా వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాలి. విషపూరితమైన పాము కరిచినప్పుడు మొదటి 1 నుండి 2 గంటలు చాలా కీలకం. చెక్కల మందు కోసం నాటువైద్యుల చుట్టూ తిరగడం వల్ల సమయం మించిపోయి, విషం రక్తంలోకి, నాడీ వ్యవస్థలోకి పూర్తిగా వ్యాపించి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
అసలు టెక్నిక్ ఇదే
పాములు పట్టేవాళ్లు (Snake catchers) ప్రత్యేకమైన మూలికలు, వేర్లు చేతిలో పట్టుకుని లేదా నోట్లో వేసుకుని పాములను పడతారని, ఆ వాసనకు పాములు కరవకుండా లొంగిపోతాయని మన దగ్గర ఒక బలమైన నమ్మకం ఉంది. కానీ శాస్త్రీయంగా ఇది అస్సలు నిజం కాదు. పాములు పట్టేవాళ్లు మూలికల వల్ల పాములను పట్టడం లేదు — వారి అనుభవం, నైపుణ్యం, కొన్ని చీకటి నిజాల వల్లే అవి వారికి లొంగినట్లు కనిపిస్తాయి.
పాముల దృష్టిని మళ్లించడం వల్లే..
అనుభవజ్ఞులైన స్నేక్ క్యాచర్లకు పాము కదలికలు బాగా తెలుసు. పాము ఎంత దూరం వరకు ఎగిరి కరవగలదు (Strike distance), దాని దృష్టిని ఎలా మళ్లించాలి అనే టెక్నిక్లను వారు ప్రాక్టీస్ ద్వారా నేర్చుకుంటారు. ఒక చేతితో పాము దృష్టిని మళ్లించి, మరో చేతితో దాని తల వెనుక భాగాన్ని పట్టుకుంటారు. అంతేకాని మూలికల వల్ల పాములు లొంగవు.













