MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Feature
  • Psychology: సైకాలజీ ప్రకారం మన గురించి మనం తప్పుగా అంచనా వేసుకునే 5 సందర్భాలు ఇవే!

Psychology: సైకాలజీ ప్రకారం మన గురించి మనం తప్పుగా అంచనా వేసుకునే 5 సందర్భాలు ఇవే!

Psychology: మన గురించి మనకంటే బాగా ఎవరికీ తెలుసు అనుకోవడం సహజమే. కానీ మనల్ని మనం అర్థం చేసుకోవడం అంత సులభమైన విషయమేమి కాదు అంటున్నారు సైకాలజీ నిపుణులు. వారి ప్రకారం.. మన గురించి మనమే తప్పుగా అంచనా వేసుకునే 5 ముఖ్యమైన సందర్భాలు ఏంటో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Aug 17 2026, 02:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మన గురించి మనం తప్పుగా అంచనా వేసుకునే సందర్భాలు
Image Credit : AI

మన గురించి మనం తప్పుగా అంచనా వేసుకునే సందర్భాలు

మనం సహజంగానే మన గురించి మనకు పూర్తిగా తెలుసని అనుకుంటాం. కానీ సైకాలజీ ప్రకారం మన వ్యక్తిత్వం, సామర్థ్యాలు, బలహీనతలు, భావోద్వేగాలు, నిర్ణయాల గురించి మనం వేసే అంచనాలు ఎప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉండవు. మన గత అనుభవాలు, ఇతరుల అభిప్రాయాలు, భావోద్వేగాలు, జ్ఞాపకాలు, అలాగే మనలో పనిచేసే కొన్ని కాగ్నిటివ్ బయాస్ మన సెల్ఫ్ ఇమేజ్ ని ప్రభావితం చేస్తాయి. అప్పుడు మన గురించి మనం తప్పుగా అంచనా వేసుకునే అవకాశం ఉంది. అలాంటి 5 సందర్భాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఒక్క తప్పును బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం
Image Credit : AI

ఒక్క తప్పును బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం

ఒక పరీక్షలో ఫేయిల్ అయినా, ఉద్యోగంలో పొరపాటు జరిగినా, సంబంధంలో సమస్య వచ్చినా కొంతమంది వెంటనే “నేను ఫెయిల్యూర్”, “నాలో టాలెంట్ లేదు”, “నేను మంచి వ్యక్తిని కాదు” అనుకుంటారు. కానీ ఒక సంఘటన మన మొత్తం వ్యక్తిత్వాన్ని చూపించదు. మన గురించి మన మెదడులో ఏర్పడిన నమ్మకాలు తర్వాత మనం చూసే సమాచారాన్ని కూడా ప్రభావితం చేయగలవు. అందుకే ఒక తప్పును ఆధారంగా చేసుకుని మన సామర్థ్యాలపై తీర్పు ఇచ్చుకోవడం మంచిదికాదు.

Related Articles

Related image1
Psychology: సైకాలజీ ప్రకారం ఏ పని చేయాలి అనిపించకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
Related image2
Parenting: మగపిల్లలతో ప్రతి తండ్రి కచ్చితంగా చెప్పాల్సిన 5 మాటలు ఇవే..!
36
అతిగా అంచనా వేయడం
Image Credit : AI

అతిగా అంచనా వేయడం

మన సామర్థ్యాలను అంచనా వేసేటప్పుడు మనం ఎప్పుడూ పూర్తిగా నిష్పక్షపాతంగా ఉండలేము. కొన్ని సందర్భాల్లో తక్కువ నైపుణ్యం ఉన్న వ్యక్తి తన సామర్థ్యాన్ని ఎక్కువగా అంచనా వేసుకోవచ్చు. మరోవైపు, కొందరు తమ సామర్థ్యాలను అవసరానికి మించి తక్కువగా అంచనా వేసుకోవచ్చు. అందుకే వాస్తవ పనితీరు ఆధారంగా మనల్ని మనం అంచనా వేసుకోవడం మంచిది.

46
పూర్తిగా తెలుసని అనుకోవడం
Image Credit : AI

పూర్తిగా తెలుసని అనుకోవడం

ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది నేను పూర్తిగా ఆలోచించి తీసుకున్నాను అని మనం అనుకోవచ్చు. కానీ మన నిర్ణయాల వెనుక ఉన్న అన్ని కారణాలు మనకు పూర్తిగా తెలియకపోవచ్చు. “నాకు ఇది నచ్చదు” అని చెప్పడం చాలా సులభం. కానీ దాని వెనుక భయం, గత అనుభవం, సామాజిక ఒత్తిడి లేదా విఫలమవుతామనే ఆందోళన ఉండవచ్చు. కాబట్టి మన నిర్ణయాలను ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకోవడం ముఖ్యం.

56
ఇతరుల అభిప్రాయం మనకు తెలుసని అనుకోవడం
Image Credit : ChatGPT

ఇతరుల అభిప్రాయం మనకు తెలుసని అనుకోవడం

మనం చేసిన ఒక చిన్న తప్పును ఇతరులు కూడా రోజంతా గుర్తుపెట్టుకుంటారని, మన రూపం లేదా మాటల గురించి అందరూ మనలాగే ఎక్కువగా ఆలోచిస్తున్నారని అనుకోవడం సాధారణం. వాస్తవానికి మనం మనపై చూపించే శ్రద్ధను ఇతరులు కూడా మనపై చూపిస్తున్నారనుకోవడం కరెక్ట్ కాదు. ఎవరో ఒక్కరు చెప్పిన మాటను, అందరూ నన్ను ఇలాగే చూస్తున్నారు అనే పెద్ద నిర్ణయంగా మార్చకూడదు.

66
మన గురించి మనం చెప్పేది నిజమనుకోవడం
Image Credit : AI

మన గురించి మనం చెప్పేది నిజమనుకోవడం

నేను చాలా షై, నాకు కోపం ఎక్కువ, నేను ఒత్తిడిని తట్టుకోలేను.. వంటి సెల్ఫ్ లేబుల్స్ కాలక్రమేణా మన ఐడెంటిటీలో భాగంగా అనిపించవచ్చు. కానీ ఈ సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది మన అనుభవాలు, పాత్రలు, ప్రవర్తన, పరిసరాల ప్రభావంతో మారుతూ ఉంటుంది. అందుకే పాత అనుభవాల ఆధారంగా మన ప్రస్తుత సామర్థ్యాలను పూర్తిగా నిర్ణయించుకోవడం సరైంది కాదు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Snakes : పాములు పదేపదే నాలుక ఎందుకు బయటపెడతాయి? రెండుగా చీలిన నాలుకలో ఇంత విషయం దాగుందా..!
Recommended image3
Top 5 Nude Beach : ఈ బీచ్ లకు వెళ్లాలంటే ఒంటిపై నూలుపోగు కూడా ఉండకూడదు
Related Stories
Recommended image1
Psychology: సైకాలజీ ప్రకారం ఏ పని చేయాలి అనిపించకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
Recommended image2
Parenting: మగపిల్లలతో ప్రతి తండ్రి కచ్చితంగా చెప్పాల్సిన 5 మాటలు ఇవే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved