MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాగ్ అశ్విన్ పై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారా,కారణం?

నాగ్ అశ్విన్ పై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారా,కారణం?

 జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే.

4 Min read
Surya Prakash
Published : Jun 30 2024, 06:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
nag ashwin

nag ashwin

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ యుద్దం మొదలవుతుందో తెలియదు. వాటికి ప్రత్యేకమైన కారణాలంటూ కూడా ఉండవు. ఏదో చిన్న ఇష్యూని పట్టుకుని దాన్ని పెద్దది చేసి ట్విట్టర్ లో పోస్ట్ లు, కామెంట్ లు వర్షం కురిపిస్తూంటారు. గత రెండు రోజులుగా కల్కి చిత్రం పై ప్రశంశలు వర్షం కురిపిస్తున్న ట్విట్టర్ లో ఓ వర్గం నాగ్ అశ్విన్ ని టార్గెట్ చేయటం మొదలెట్టారు. అందుకు కారణం చిరంజీవి ట్వీట్ కు నాగ్ అశ్విన్ రిప్లై అంటే ఆశ్చర్యం వేస్తుంది.  వివరాల్లోకి వెళ్తే...
 

212
nag ashwin

nag ashwin

ప్రభాస్ (Prabhas), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), కమల్ హాసన్, దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగు విమర్శకులు, బాలీవుడ్  ఫిల్మ్ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్  లు ఈ సినిమాని ఓ రేంజిలో మెచ్చుకుంటున్నారు.  ఇప్పటికే ఈ మూవీని చూసిన పలువురు సెలబ్రిటీలు స్పందించారు. ఈ మూవీ భార‌త సినిమాను మ‌రో మెట్టు ఎక్కించిందంటూ ప్రశంసిస్తున్నారు. 

312
kalki 2898 ad t

kalki 2898 ad t


అలాగే బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ప్రకారం ‘కల్కి 2898 ఏడీ’ తొలిరోజు హిందీలో 27.5 కోట్లు వసూలు చేయగా, వరల్డ్ వైడ్ గా రూ.190 కోట్లు వసూలు చేసింది. భారతదేశంలో మొత్తం రూ .95 కోట్లు వసూలు చేసిందిఇక రెండో రోజు కూడా భారీ వసూళ్లను రాబట్టింది కల్కి.

412
kalki 2898 ad

kalki 2898 ad


 రెండవ రోజు కలెక్షన్ విషయానికొస్తే.. రూ.54 కోట్లు కలెక్ట్ చేసినట్లు సెక్నిక్ రిపోర్ట్ తెలిపింది. తెలుగులో రూ.25.65 కోట్లు, హిందీలో రూ.22.5 కోట్లు వసూలు చేసింది. ‘కల్కి 2898 ఏడీ’ డే 2 ఇండియాలో మొత్తం రూ.149.3 కోట్లు వసూలు చేసింది. ఇందులో అత్యధికంగా తెలుగు వెర్షన్ రూ.91.45 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత హిందీలో 45 కోట్లు రాబట్టింది.

512


కల్కి ఫస్ట్ డే కలెక్షన్స్ కేజీఎఫ్, బాహుబలి1,సాహో, జవాన్ తో సహా పలు పెద్ద సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. ఈ చిత్రం రెండు రోజుల్లో ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ 250 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇదే జోరు కొనసాగితే ఈ సినిమా ‘పఠాన్’, ‘జవాన్’, ‘జైలర్’, బాహుబలి వంటి చిత్రాల రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అనిపిస్తోంది. ఇది టీమ్ కు విపరీతమైన ఆనందాన్ని కలిగిస్తోంది.

612


ఈ సినిమా గురించి చిరు ట్వీట్‌ చేశారు. 'కల్కి గురించి  అన్ని చోట్ల చక్కని స్పందన వినిపిస్తోంది. నాగ్‌ అశ్విను మైథాలజీ, సైంటిఫిక్‌ జానర్‌ కథను ప్రభాస్‌, అమితాబ్‌, కమల్‌హాసన్, దీపికా వంటి భారీ క్యాస్టింగ్‌తో అద్భుతంగా తెరకెక్కించారు. నా అభిమాన నిర్మాతలు అశ్వినీదత్, ప్రియాంక, స్వప్నాలకు అభినందనలు. ప్యాషన్, కరేజ్‌తో టీమంతా సాధించిన సక్సెస్‌ ఇది. మన సినిమాలు భారతీయ జెండాను మరింత ఎత్తున రెపరెపలాడేలా చేస్తున్నాయి’’ అని అన్నారు.

712

చిరంజీవి చేసిన ట్వీట్ కు రిప్లైగా నాగ్ అశ్విన్ సింపుల్ గా రెస్పాండ్  అయ్యారు.  “Thank you so much, sir looking forward to you seeing it :)) ..అంటే థాంక్యూ సార్..మీరు కూడా సినిమా చూస్తారని ఎదురుచూస్తున్నాను అన్నారు. మామూలుగా చూస్తే ఇందులో వివాదం ఏమి లేదు. కానీ కొందరికి కనపడింది. అందుకు కారణం రజనీకాంత్ ట్వీట్ కు నాగ్ అశ్విన్ ఇచ్చిన రిప్లై.

812


ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడీ మూవీపై సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌శంస‌లు కురిపించాడు. క‌ల్కి మూవీ ఎపిక్ అంటూ ర‌జ‌నీకాంత్ ట్వీట్ చేశాడు. క‌ల్కి మూవీని చూశాన‌ని, అద్భుతంగా ఉంద‌ని ర‌జ‌నీకాంత్ అన్నాడు. క‌ల్కితో ఇండియ‌న్ సినిమాను నాగ్ అశ్విన్ డిఫ‌రెంట్ లెవెల్‌కు తీసుకెళ్లాడ‌ని త‌న ట్వీట్‌లో ర‌జ‌నీకాంత్ పేర్కొన్నాడు. క‌ల్కి పార్ట్ 2 కోసం తాను వెయిటింగ్ అని ఈ ట్వీట్‌లో తెలిపాడు.

912


ఈ సినిమాలో క‌మ‌ల్‌హాస‌న్‌, అమితాబ్‌బ‌చ్చ‌న్‌తో పాటు ప్ర‌భాస్‌, దీపికా ప‌దుకోణ్ అస‌మాన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచార‌ని ర‌జ‌నీకాంత్ అన్నాడు. నిర్మాత అశ్వ‌నీద‌త్‌తో పాటు ఎంట‌ర్‌టైన‌ర్ క‌ల్కి టీమ్‌కు కంగ్రాట్స్ అంటూ ర‌జ‌నీకాంత్ చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ర‌జ‌నీకాంత్ ఫ్యాన్స్‌తో పాటు ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఈ ట్వీట్‌ను తెగ షేర్ చేస్తున్నారు.

1012
Director Nag Ashwin

Director Nag Ashwin


ఇక రజనీకాంత్ చేసిన ట్వీట్ ని కోట్ చేస్తూ ..Sir... speechless ....blessed....from our whole team అంటూ ఓ మెసెజ్ పోస్ట్ చేసారు. ఇక్కడే చాలా మంది మెగాభిమానులకు కాలింది. చిరంజీవి ట్వీట్ చేస్తే సింపులుగా ...మీరు సినిమా చూస్తారని ఎదురుచూస్తానని రిప్లై ఇచ్చారు. అదే రజనీకాంత్ ట్వీట్ అయితే ప్రయారిటీ ఎక్కువ ఇచ్చారు అనేది వారి అభియోగం. రజనీ,చిరంజీవి ఇద్దరూ సమానమైన స్దాయి వారే కదా ...ఇద్దరికి ఒకేరకరమైన ప్రయారిటీ ఇవ్వాలి కదా అంటూ కామెంట్స్ మొదలెట్టారు. అయితే నాగ్ అశ్విన్ ప్రస్తుతం తన సినిమా రిలీజ్ అయ్యి ఆ కలెక్షన్స్ ,ప్రమోషన్స్, ప్రశంసల ఫోన్స్ హడావిడిలో ఉంటారు. ఆ టైమ్ లో అప్పటికప్పుడు రెస్పాండ్ అయ్యే విధానాన్ని పట్టించుకోవటం మాత్రం పద్దతి కాదు. 

1112
Nag Ashwin, Kamalhaasan

Nag Ashwin, Kamalhaasan

రాజమౌళి సినిమా గురించి ట్వీట్‌లో రివ్యూ ఇచ్చారు. 'కల్కి' మూవీలో కొత్త ప్రపంచం నిర్మాణాన్ని ఇష్టపడ్డా. అద్బుతమైన సెట్టింగ్‌లతో ఇది నన్ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. డార్లింగ్‌ తన టైమింగ్‌, టాలెంట్‌తో  చంపేశాడు. అమితాబ్‌ జీ, కమల్‌ సర్‌, దీపిక నుంచి ఫుల్‌ సపోర్ట్‌ దొరికింది. అయితే సినిమా చివరి 30 నిమిషాలు నన్ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. తమ ప్లాన్‌ను అమలు చేయడంలో వందశాతం ప్రయత్నం సక్సెస్‌ సాధించారు. నాగి, అలాగే మొత్తం వైజయంతి టీమ్‌కు అభినందనలు’ అంటూ పోస్ట్‌ చేశారు.  

1212


 
ప్రభాస్‌ పెద్దమ్మ శ్యామలా దేవి ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. 1000 రెబల్‌ స్టార్‌లను కలిపితే అది ప్రభాసః అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఐమాక్స్‌లో సినిమాను వీక్షించిన ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సినిమాని ఆదరించిన పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌, ఇతర హీరోల ఫ్యాన్స, మా  కుటుంబ అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ చిత్రంలో ఫైట్లు మరో స్థ్థాయిలో ఉన్నాయి. వాటి గురించి చెప్పేందుకు మాటల్లేవ్‌’’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
నాగ్ అశ్విన్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved