కమెడియన్ బబ్లూ గుర్తున్నాడా.? అతను ఏమయ్యాడు, ఇప్పుడేం చేస్తున్నాడు తెలుసా..?
Comedian Babloo: కమెడియన్ బబ్లూ.. చాలామందికి ఈ పేరు వినగానే చిత్రం సినిమా గుర్తుకు వస్తుంది. ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న బబ్లూ...సడెన్ గా ఎందుకు మాయమయ్యాడు. ఇప్పుడేం చేస్తున్నాడు..? ఎక్కడుంటున్నాడు..?

Comedian Babloo: ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.. స్టార్ గా వెలుగు వెలిగిన వారు సినిమాలు లేక ఇబ్బందిపడే పరిస్థితి రావచ్చు.. స్క్రీన్ మీద గొప్పగా కనిపించి..వరుస ఆఫర్లు సాధించిన వారు.. అసలు కనిపించకుండా పోవచ్చు. అలా మాయమైన స్టార్స్ చాలామంది ఉన్నారు. ఇండస్ట్రీలో చాలా మంది ఇప్పుడు కనిపించకుండా మాయం అయ్యారు.
హీరోలు, హీరోయిన్స్ మాత్రమే కాదు కామెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా ఎంతో మంది ఇండస్ట్రీకి దూరం అయ్యారు. సుధాకర్ లాంటి వారి పరిస్తితి అందరికి తెలిసిందే. కాని కొంతమంది మాత్రం అసలు కనిపించకుండా పోయినవారు ఉన్నారు. వారిలో కమెడియన్ బబ్లూ ఒకరు.
Also Read: నాగ చైతన్య-శోభిత పెళ్ళిపై ఫస్ట్ టైమ్ సమంత షాకింగ్ కామెంట్స్
ఇండస్ట్రీ నుంచి దూరంగా ఉంటూ కొంత మంది తమ వ్యాపారాలు చేసుకుంటున్నారు. రోలర్ రఘు ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు.మరి బబ్లూ ఏమయ్యాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు. ఈ ప్రశ్న చాలామందిలో ఉంది. తెలుగులో మంచి కమెడియన్‌గా వరుస సినిమాల్లో నటించి అలరించిన బబ్లూ.. అటు వెండితెరపై.. ఇటు బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి..కమెడియన్ గా స్థిరపడ్డాడు బబ్లూ. వరుసగా సినిమాలు చేస్తున్న టైమ్ లోనే ఈ కమెడియన్ సడె న్ గామాయం య్యాడు.ఇంతకీ బబ్లూ ఏమయ్యాడు.
Also Read: Vidaamuyarchi Twitter Review: విడాముయర్చి ట్విట్టర్ రివ్యూ. అజిత్ అదరగొట్టాడు కాని..?
జంధ్యల బుల్లితెరపై డైరెక్ట్ చేసిన పోపుల పెట్ట లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు ఈ కుర్ర కమెడియన్. అందులో అతని పాత్ర పేరు బబ్లూ. అదే అతని స్క్రీన్ నేమ్ గా స్థిరపడిపోయింది. నిజానికి బబ్లూ అసలు పేరు సదానంద్. ఆతరువాత చిత్రంసినిమాతో కమెడియన్ గా.. తన ప్రస్థానం మొదలు పెట్టి.. హీరోల గ్యాంగ్ లో మెయిన్ కమెడియన్ గా ఎన్నో పాత్రల్లో నటించాడు. తాను సడెన్ గా సినిమాల్లోంచి మాయం అవ్వడానికిగల కారణాలు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు బబ్లూ.
Also Read:Abbas Re entry: 10 ఏళ్ల గ్యాప్ తరువాత అబ్బాస్ మళ్ళీ వచ్చేస్తున్నాడు, ఏసినిమాతోనో తెలుసా..?
రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు వస్తున్న టైమ్ లో .. తన ఇంట్లో జరిగిన వరుస విషాదాలు.. వరుస మరణాలు తనను క్రుంగదీశాయి అన్నారు బబ్లూ. దాంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి..కొన్నేళ్ళపాటు అసలు బయటకే రాలేదట.
ఈటైమ్ లోనే వరుసగా సినిమా ఆఫర్లు రావడం.. తాను చేయలేకపోవడంతో.. చిన్నగా ఆ అవకాశాలు కూడా ఆగిపోయాయి అన్నారు బబ్లూ. ఇప్పుడు తాను ఏపాత్రలు చేయడానికైనా రెడీగా ఉన్నట్టు వెల్లడించాడు బబ్లూ. తనకు అవకాశం ఇస్తే మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి సిద్దంగా ఉన్నట్టు ఇంటర్వ్యూలో వెల్లడించాడు కమెడియన్ బబ్లూ.
Also Read:అప్పుడు 100 రూపాయల కోసం తిప్పలు, ఇప్పుడు నిమిషానికి 50 లక్షలు వసూలు చేస్తోన్న హీరోయిన్ ఎవరు..?