MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Abbas Re entry: 10 ఏళ్ల గ్యాప్ తరువాత అబ్బాస్ మళ్ళీ వచ్చేస్తున్నాడు, ఏసినిమాతోనో తెలుసా..?

Abbas Re entry: 10 ఏళ్ల గ్యాప్ తరువాత అబ్బాస్ మళ్ళీ వచ్చేస్తున్నాడు, ఏసినిమాతోనో తెలుసా..?

Abbas Re entry After 10 Years : దాదాపు  10 ఏళ్ళు అవుతుంది అబ్బాస్ ఫిల్మ్ ఇండస్ట్రీని వదిలేసి. అబ్బాస్ ఎక్కడున్నాడు అని అంతా వెతుక్కుంటున్న టైమ్ లో రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు ఒకప్పటి లవర్ బ్యాయ్. అబ్బాస్ ఏ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడోతెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 05 2025, 02:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
'ప్రేమ దేశం'తో హీరోగా ఎంట్రీ

'ప్రేమ దేశం'తో హీరోగా ఎంట్రీ

దర్శకుడు క‌తిర్ తెర‌కెక్కించిన 'ప్రేమ దేశం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అబ్బాస్.ఈ సినిమాలో మ‌రో హీరోగా వినీత్ న‌టించ‌గా, బాలీవుడ్ న‌టి టబు హీరోయిన్‌గా న‌టించింది. కాలేజీలో చ‌దువుకునే ఇద్ద‌రు స్నేహితులు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు.

ఆ అమ్మాయి ఎవ‌రిని ప్రేమిస్తుంది, ఎవ‌రితో జంట క‌డ‌తారు అనేది ఊహించ‌లేని క‌థాంశంతో ఈ సినిమా ఉంటుంది. అప్పట్లో యూత్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించింది సినిమా. అంతే కాదు ఏఆర్ రెహమాన్ పాటలు యువత పిచ్చెక్కిపోుయారు. ఈ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు, వ‌సూళ్ల‌ను కూడా బాగానే రాబ‌ట్టింది.

Also Read: వేల కోట్లకు వారసుడు, ఇంట్లో నుంచి పారిపోయి హీరోగా మారిన నటుడు ఎవరో తెలుసా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సినిమాల్లో బిజీగా

సినిమాల్లో బిజీగా

ఈ సినిమాలో ఏఆర్ రెహ‌మాన్ సంగీతం, పాట‌లన్నీ సూప‌ర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా విజ‌యం త‌ర్వాత విఐపి, ప్రియా ఓ ప్రియా, పూచూడ‌వా, సఖి, నరసింహ,  ఆశైతంబి, పూవేలి వంటి అనేక సినిమాల్లో న‌టించారు. లవర్ బాయ్ ఇమేజ్ ను తెచ్చుకున్నారు అబ్బాస్. 

Also Read:  హీరోయిన్ రెజీనా కి ముద్దు పెట్టిన అనిరుధ్ ? వైరల్ అవుతున్న ఫోటో

35
సోలో హీరోగా స‌క్సెస్ కాలేదు

సోలో హీరోగా స‌క్సెస్ కాలేదు

త‌మిళంతో పాటు క‌న్న‌డ‌, తెలుగు, మ‌ల‌యాళం, హిందీ వంటి భాష‌ల్లో దాదాపు 40కి పైగా సినిమాల్లో న‌టించారు అబ్బాస్. చాలా అందగాడు. అమ్మాయిల ఫాలోయింగ్ బాగా ఉంది.  అందం, ప్ర‌తిభ ఉన్నా, సోలో హీరోగా మాత్రం  విజ‌య‌వంత‌మైన సినిమాలు ఇవ్వ‌లేక‌పోయారు. ర‌జ‌నీకాంత్‌తో నరసింహా, క‌మ‌ల్ హాస‌న్‌తో వ‌సూల్‌రాజా ఎంబీబీఎస్, హేరాం, ప‌మ్మ‌ల్ కే స‌మ్మ‌తం వంటి సినిమాల్లో కూడా న‌టించారు.

Also Read:మాజీ ప్రధాని మనవరాలు, స్టార్ హీరోకు రెండో భార్య, రాజవంశానికి చెందిన హీరోయిన్ ఎవరో తెలుసా?

45
కుటుంబంతో విదేశాల్లో

కుటుంబంతో విదేశాల్లో

ఒకానొక స‌మ‌యంలో ఆయ‌న న‌టించిన త‌మిళ సినిమాలు వ‌రుస‌గా ఫ్లాప్ అవ్వ‌డంతో ఆయ‌న‌కు సినిమా అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. మ‌నోవేద‌న‌కు గురైన అబ్బాస్ ఇక సినిమాలే వ‌ద్ద‌నుకుని త‌న భార్య, పిల్ల‌ల‌తో విదేశాల్లో స్థిర‌ప‌డ్డారు.

సినిమా ప‌రిశ్ర‌మ నుంచి విదేశాల‌కు వెళ్లిన త‌ర్వాత త‌న కుటుంబాన్ని పోషించుకోవ‌డానికి హోట‌ల్, పెట్రోల్ బంక్, పంక్చ‌ర్ షాపుల్లో కూడా ప‌నిచేశాన‌ని చెప్పారు. ఇటీవ‌ల ఈ విష‌యం గురించి అబ్బాస్ చెప్ప‌డంతో అభిమానులు షాక్ అయ్యారు.

Also Read:అప్పుడు 100 రూపాయల కోసం తిప్పలు, ఇప్పుడు నిమిషానికి 50 లక్షలు వసూలు చేస్తోన్న హీరోయిన్ ఎవరు..?

 

55
వెబ్ సిరీస్‌తో రీఎంట్రీ

వెబ్ సిరీస్‌తో రీఎంట్రీ

దాదాపు 10 ఏళ్ల త‌ర్వాత అబ్బాస్ రీఎంట్రీ ఇస్తున్న వెబ్ సిరీస్ గురించిన స‌మాచారం బ‌య‌ట‌కొచ్చింది. పుష్క‌ర్ గాయ‌త్రి నిర్మాణంలో ద‌ర్శ‌కుడు స‌ర్కుణం తెర‌కెక్కిస్తున్న వెబ్ సిరీస్ 'ఎగ్జామ్'లో అబ్బాస్ న‌టిస్తున్నార‌ట‌. ఆయ‌న‌తో పాటు తుషార విజ‌యం, అదితి బాల‌న్ కూడా న‌టిస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Mrunal Thakur: అన్నంలో ఐస్‌క్రీమ్.. హీరోయిన్ వింత అలవాటు వెనుక పెద్ద ఏంటో తెలుసా?
Recommended image2
Jr NTR: 70 ఏళ్ల హీరో కోసం రాసుకున్న కథతో.. ఎన్టీఆర్ యమదొంగ చేసిన రాజమౌళి.. విజయేంద్ర ప్రసాద్ ఏమన్నాడంటే?
Recommended image3
Jana Nayagan: 5 నెలలుగా రిలీజ్ కాని విజయ్ సినిమా.. అసలు కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved