Pattudala Twitter Review: పట్టుదల మూవీ ట్విట్టర్ రివ్యూ. అజిత్ అదరగొట్టాడు కాని..?
Vidaamuyarchi Review: సౌత్ స్టార్ హీరో అజిత్ కుమార్, త్రిష కాంబినేషన్ లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ విడాముయర్చి. పట్టుదల పేరుతో తెలుగులో రిలీజ్ అవుతున్న ఈసినిమా ప్రీమియర్ షోలు ముందుగానే సందడిచేయగా.. ఈసీనిమా గురించి ఆడియన్స్ ఏమనుకుంటున్నారంటే..?
- FB
- TW
- Linkdin
Follow Us
)
vidaamuyarchi
అజిత్, త్రిష కాంబినేషన్ లో లైకాప్రొడక్షన్స్ బ్యానర్ పై మగీజ్ తిరుమేని డైరెక్ట్ చేసిన సినిమా విడాముయార్చి. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో.. భారి యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈసినిమా తెరెక్కింది. హాలీవుడ్ రైటర్ జోనాథన్ మోస్టో బ్రేక్ డౌన్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో అజిత్ , త్రిషతో పాటుగా అర్జున్ సర్జా, రెజీనా కసండ్రా, ఆరవ్, రమ్య సుబ్రమణ్యం తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Vidaamuyarchi Teaser
ఈసినిమా కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మరీముఖ్యంగా అజిత్, అర్జున్, త్రిష పెర్పామెన్స్ లు ఇరగదీశారంటూ ట్వీట్ చేస్తున్నారు జనాలు. అంతే కాదు ఫస్ట్ హాఫ్ స్టోరీ ఎక్కడాబోర్ కొట్టించకుండా బాగుందంటున్నారు. హీరోయిన్ మిస్సింగ్ సీన్ నుంచి కథ మలుపులు తిరగడం ఆకట్టుకుందంటున్నారు. డైలాగ్స్ కాని, స్టోరీ కాని పర్పెక్ట్ గా అజిత్ కు సెట్ అయ్యిందంటున్నారు.
Vidaamuyarchi
ఇక మరికొంత మంది నెటిజన్లు మ్యూజిక్ విషయంలో ట్వీట్ చేస్తున్నారు. అనిరథ్ నిజంగా మ్యాజిక్ చేశాడంటున్నారు. గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కు జైలర్ కోసం ఎంత ఎలివేషన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడో.. అంతకు మించి అజిత్ కోసం కూడా అటువంటి అద్భుతం చేశాడు అనిరుధ్. దాంతో మ్యూజిక్ కాని ఆర్ఆర్ కాని అద్భుతం అంటున్నారు.
Vidaamuyarchi
దాదాపు రెండేళ్ళ తరువాత అజిత్ తన ఫ్యాన్స్ ముందుకు మంచి సినిమాతో వచ్చాడు. అది కూడా పద్మభూషణ్ ప్రకటించిన తరువాత రిలీజ్ అయిన సినిమా కావడంతో.. ఈసినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. దాదాపు 1000 కి పైగా స్క్రీన్ లలో ఈసినిమా రిలీజ్ అయ్యింది. ఇక ఈమూవీలో అజిత్, త్రిష కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది అంటున్నారు ట్విట్టర్ జనాలు.
vidaamuyarchi
ఇక ఈసినిమా ఫస్ట్ హాఫ్ అంతా ప్రేమ కథతో నింపేసిన దర్శకుడు.. సినిమా సెకండ్ హాఫ్ ను కంప్లీట్ గాయాక్షన్ సీక్వెన్స్ లతో హడావిడిచేశారు. ఫస్ట్ హాఫ్ ప్రేమ కథ గిలిగింతలు పెట్టేలా ఉందని... సెకండ్ హాఫ్ యాక్షన్ అదరిపోయింది అంటు ట్వీట్ చేస్తున్నారు సినిమా చూసిన ఆడియన్స్ అంతే కాదు అజిత్ వర్సెస్ అర్జున్ సీన్స్ గూస్ బాంబ్స్ తెప్పించాయన్నారు. మరీముఖ్యంగా ట్రైన్ ఫైట్ అదిరిపోయిందంటున్నారు ఆడియన్స్.
Ajith Kumar starrer Vidaamuyarchi film
ఈసినిమా తమిళనాడులో మాత్రం భారీ ఓపెనింగ్స్ దిశగా వెళ్తుంది అని అర్ధం అయ్యింది. మరి తెలుగులో పట్టుదల సినిమా ఎంత వరకూ ప్రభావం చూపిస్తుంది అనేది చూడాలి. ఈసినిమా తమిళనాడులో కూడా ఎం తవరకూ వసూలు చేయగలదో కాస్త వెయిట్ చేస్తు తెలుస్తుంది. ఓవర్ ఆల్ గా మూవీ అన్ని రకాల ప్రేక్షకులను అరించగలదా లేదా చూడాలి.