- Home
- Entertainment
- అప్పుడు 100 రూపాయల కోసం తిప్పలు, ఇప్పుడు నిమిషానికి 50 లక్షలు వసూలు చేస్తోన్న హీరోయిన్ ఎవరు..?
అప్పుడు 100 రూపాయల కోసం తిప్పలు, ఇప్పుడు నిమిషానికి 50 లక్షలు వసూలు చేస్తోన్న హీరోయిన్ ఎవరు..?
కెరీర్ బిగినింగ్ లో 100 రూపాయలకోసం ఇబ్బంది పడింది ఓ హీరోయిన్... ప్రస్తుతం నిమిషానికి 50 లక్షలు వసూలు చేస్తుందట. ఇంతకీ ఎవరా బ్యూటీ..? ఎలా సాధించింది.

nora fatehi
ఫిల్మ్ ఇండస్ట్రీలో కలబడి నిలవడటం అంతే అంత ఈజీకాదు. అందులోనే హీరోయిన్లు ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలంటే చాలా కష్టం. చాలా మంది టాలెంట్ ఉన్న అమ్మాయిలు ట్రై చేస్తూంటే.. అందులో టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉన్నవారు మాత్రమే ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అలాంటి వారిలో ఓ లక్కీ స్టార్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం.
Alao Read: మాజీ ప్రధాని మనవరాలు, స్టార్ హీరోకు రెండో భార్య, రాజవంశానికి చెందిన హీరోయిన్
ఈ బ్యూటీ కెరీర్ బిగినింగ్ లో ఎన్నో ఇబ్బందులు పడింది. 100 రూపాయలు రావడమే ఎక్కువ అనుకునే రోజుల నుంచి ఒక్క సాంగ్ చేస్తే చాలు 2కోట్లు వసూలు చేసే స్థాయికి ఎదిగింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ బ్యూటీ. నోరాఫతేహి. అవును బాలీవుడ్ లో గ్లామర్ క్వీన్ గా ఉన్న ఆమె.. సౌత్ లో కూడా తన స్పెషల్ పెర్ఫామెన్స్ లతో అదరగొట్టింది.
Alao Read: నోరు జారిన పూజా హెగ్డే, తెలుగు బ్లాక్ బస్టర్ ను తమిళ సినిమా అనేసిందేంటి?
వరుస అవకాశాలు సాధిస్తూ వచ్చిన ఈబ్యూటీ..కెరీర్ బిగినింగ్ లో ఎన్నోఇబ్బందలు ఫేస్ చేసింది. అవకాశాలు లేక.. అవకాశం వచ్చినా.. సరైన రెమ్యునరేషన్ లేకపోయినా.. టైమ్ కోసం ఎదురు చూసింది. తన టైమ్ రాగానే రచ్చ చేసింది బ్యూటీ. వచ్చిన అవకాశాలను కరెక్ట్ గా యూస్ చేసుకోవడంతో పాటు. సౌత్ లో కూడా తన ప్రభావం చూపించింది నోరా.
Alao Read: 3 సినిమాలు, ఒక్కో సినిమాకు 100 కోట్లు కొల్లగొట్టిన ప్రభాస్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
Nora Fatehi
మరీ ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ కు ఆమె పెట్టింది పేరు. ఆ పాటలే నోరాకు కోట్లు కురిపిస్తున్నాయి. తెలుగులో ఆమె టెంపర్, బాహుబలి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది. తినడానికి ఫుడ్ కూడా సరిగ్గా లేక గుడ్డు, బ్రెడ్ తో సరిపుచ్చుకున్న రోజుల నుంచి లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేసే వరకూ.. తన కృషి వల్లే ఇది సాధ్యం అయ్యింది. ఇలా అంచంచలుగా ఎదుగుతూ వస్తోంది ఈ బ్యూటీ.
Alao Read: వేల కోట్లకు వారసుడు, ఇంట్లో నుంచి పారిపోయి హీరోగా మారిన నటుడు ఎవరో తెలుసా..?
ప్రస్తుతం నోరా ఫతేహీ సాంగ్స్ కు అటు నార్త్ లో.. ఇటు సౌత్ లో కూడా భారీ డిమాండ్ ఉంది. ఆమె 4 నిమిషాల పాటకు దాదాపు 2 కోట్ల వరకూ ఛార్జ్ చేస్తోందట. ఈరకంగా చూసుకుంటే నిమిషానికి 50 లక్షలు తీసుకుంటుందని టాక్. అంతే కాదు కెరీర్ బిగినింగ్ లో 100రూపాయల కోసం ఇబ్బందిపడిన ఈబ్యూటీ.. ప్రస్తుతం 60 కోట్లకు పైగా ఆస్తులు కూడా కూడబెట్టినట్టు సమాచారం.
ఇంట్లోనుంచి పారిపోయి వచ్చి.. ఇండస్ట్రీలో ఈ రేంజ్ లో ఎదగడం అంటే మాటలు కాదు. ఈ స్టార్ డమ్ వెనుక నోరా కష్టం మాత్రమే ఉంది. ఆమె పట్టుదల ఆమెను ఇంత వరకూ తీసుకువచ్చింది. ప్రస్తుతం నార్త్ తో పాటు సౌత్ లో కూడా ఆమెకు డిమాండ్ పెరిగేలా చేసింది.