MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Viral Song: ఇదేం పాట‌రా బాబు.. 11 కోట్ల వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ పాట‌లో ఇంత అర్థ‌ముందా

Viral Song: ఇదేం పాట‌రా బాబు.. 11 కోట్ల వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ పాట‌లో ఇంత అర్థ‌ముందా

Viral Song: ప్ర‌స్తుతం ఫోక్ సాంగ్స్‌కు ఆద‌ర‌ణ పెరుగుతోంది. సినిమా పాట‌ల కంటే ఎక్కువ‌గా వ్యూస్ వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోక్ సాంగ్స్ రీల్స్ దుమ్మురేపుతున్నాయి. యూట్యూబ్‌లో ట్రెండ్ సెట్ చేసిన అలాంటి ఓ పాట గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 03 2026, 03:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మంగ్లీ పాటకు అపూర్వ‌ స్పందన
Image Credit : Mangli Official/Youtube

మంగ్లీ పాటకు అపూర్వ‌ స్పందన

తెలంగాణ జానపద గానానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మంగ్లీ మరోసారి యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. ఆమె పాడిన ‘బాయిలోనే బల్లి పలికే’ పాట ఇప్పుడు 118,390,718 వ్యూస్ దాటింది. 11 కోట్లకు పైగా వ్యూస్‌ సాధించడం చిన్న విషయం కాదు. విడుదలైన కొద్ది రోజుల్లోనే లక్షల నుంచి కోట్ల వ్యూస్ దిశగా పరిగెత్తిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో అగ్రస్థానంలో నిలిచింది. యూట్యూబ్‌లో ప్ర‌స్తుతం టాప్ 15 టాప్ మ్యూజిక్ వీడియోగా నిలిచిందీ పాట‌. పల్లె వాసన, ఉత్సాహభరితమైన బీట్‌తో ఈ పాట అన్ని వయసుల వారిని ఆకట్టుకుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ పాటను హమ్ చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రీల్స్‌లో రచ్చ…
Image Credit : @MangliOfficial

రీల్స్‌లో రచ్చ…

ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్‌లు, ఫేస్‌బుక్ రీల్స్… ఎక్కడ చూసినా ‘బాయిలోనే బల్లి పలికే’ మ్యూజిక్ వినిపిస్తోంది.ఈ పాట‌తో వేలాది రీల్స్ క్రియేట్ అయ్యాయి. ఫుల్ సాంగ్ విడుదలైన తర్వాత ఈ ట్రెండ్ మరింత వేగం అందుకుంది. వివాహాలు, సాంస్కృతిక వేడుకలు, స్కూల్ ఫంక్షన్లు… ప్రతిచోటా ఈ పాటతో డ్యాన్స్ ప్రదర్శనలు కనిపిస్తున్నాయి. ఈ డిజిటల్ క్రేజ్ యూట్యూబ్ వ్యూస్ పెరగడానికి ప్రధాన కారణమైంది.

35
ఈ పాట రాసింది పోలీస్ కానిస్టేబుల్
Image Credit : @MangliOfficial

ఈ పాట రాసింది పోలీస్ కానిస్టేబుల్

ఈ జానపద గీతానికి సాహిత్యం అందించిన వ్యక్తి జగిత్యాల జిల్లాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ కమల్ ఇస్లావత్‌. కళాప్రపంచంపై ఆసక్తితో 2003 నుంచే ఫోక్ పాటలు రాస్తూ వస్తున్న ఆయన ఇప్పటివరకు 80కి పైగా గీతాలు రచించారు. వెయ్యికి పైగా కళా ప్రదర్శనలు ఇచ్చి ప్రజల్లో చైతన్యం కలిగించారు. ఈ పాటకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ఉత్సాహభరితమైన బీట్‌తో గ్రామీణ వాతావరణాన్ని అద్భుతంగా ప్రతిబింబించారు. మంగ్లీతో పాటు ప్రముఖ జానపద గాయని నాగవ్వ కూడా స్వరం కలిపారు. ఈ కాంబినేషన్ పాటకు మరింత ఉత్సాహం తీసుకొచ్చింది. వీడియోను దాము రెడ్డి తెరకెక్కించారు. పల్లె అందాలు, జాతర వాతావరణం, రంగురంగుల దుస్తులు వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

45
ఈ పాట అర్థం ఏంటో తెలుసా.?
Image Credit : Mangli Official/Youtube

ఈ పాట అర్థం ఏంటో తెలుసా.?

ఈ పాట అసలు సారాంశం ప్రేమ, ఆటపాట, గ్రామీణ సంబురాల చుట్టూ తిరుగుతుంది. ఇద్దరు ప్రేమికులు సంకోచాలు వదిలి ఒకటవ్వాలని కోరుకునే భావన ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. సరదా మాటలు, ఆటపాటల మధ్య ప్రేమ వ్యక్తీకరణ ఈ చ‌ర‌ణాల్లో వినిపిస్తోంది. పెళ్లికి సిద్ధ‌మైన ఓ యువ‌తి త‌న‌కు కాబోయే వాడి గురించి చెప్పే భావాన్ని ఈ పాట‌లో చ‌క్క‌గా వివ‌రించారు. గ్రామీణ పదజాలం, స్థానిక భాషా శైలి పాటకు నిజమైన జానపద రంగు తీసుకొచ్చాయి. అందుకే ఇది పల్లెల్లో మాత్రమే కాదు, పట్టణాల్లో కూడా విపరీత ఆదరణ పొందుతోంది.

55
జానపదాలకు పెరుగుతోన్న క్రేజ్
Image Credit : Mangli Official/Youtube

జానపదాలకు పెరుగుతోన్న క్రేజ్

సినిమా పాటలతో పాటు తెలుగు ప్రేక్షకులు జానపద గీతాలను కూడా సమానంగా ఆదరిస్తున్నారు. ఇటీవల అనేక ఫోక్ సాంగ్స్ వైరల్ కావడం దీనికి ఉదాహరణ. సోషల్ మీడియాలో జానపద కళాకారులకు కొత్త అవకాశాలు అందిస్తున్నాయి. ఇప్పుడు ‘బాయిలోనే బల్లి పలికే’తో మరో మైలురాయి చేరుకుంది. 11 కోట్లకు పైగా వ్యూస్ సాధించడం ఈ జానపద తరంగానికి నిదర్శనం.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వినోదం
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Box Office Clash: బాక్సాఫీస్ వద్ద సర్దార్ 2కు షాకిచ్చిన చిన్న సినిమా... వసూళ్లలో సూరిదే పైచేయి!
Recommended image2
AK 47 Teaser Review: ఫ్యామిలీ ఇమేజ్‌ని పక్కన పెట్టిన వెంకటేష్‌, ఎందుకంటే?.. ఆదర్శ కుటుంబ టీజర్‌ ఎలా ఉందంటే?
Recommended image3
Tollywood Senior Heroes: దసరా నుంచి సంక్రాంతి వరకు, క్యూ కట్టిన సీనియర్ హీరోలు..300 కోట్లు కొట్టే బొమ్మ ఏది ?
Related Stories
Recommended image1
Mamidi Konala Meena: యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న మ‌రో ఫోక్ సాంగ్‌.. పాట వింటే కాలు క‌ద‌పాల్సిందే
Recommended image2
Viral Video: ధైర్య‌మా, మొండిత‌న‌మా.? వీడియో చూస్తే గుండె జారాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved