- Home
- Entertainment
- Bigg Boss 10: నీతూకు చుక్కలు చూపించిన నరేష్.. ఆమె గేమ్ మొత్తం నాశనం, అమన్ పై త్రిగుణ్ ఎమోషనల్ రివేంజ్
Bigg Boss 10: నీతూకు చుక్కలు చూపించిన నరేష్.. ఆమె గేమ్ మొత్తం నాశనం, అమన్ పై త్రిగుణ్ ఎమోషనల్ రివేంజ్
Bigg Boss Telugu 10: అమన్ పై త్రిగుణ్ ఎమోషనల్ రివేంజ్ తీర్చుకున్నాడు. తన గేమ్ కి అడ్డువచ్చిన నీతూకు నరేష్ చుక్కలు చూపించాడు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు 10
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో భాగంగా 60వ రోజు రివెంజ్ అండ్ రివార్డ్ ప్రక్రియ కొనసాగింది. బాస్కెట్ టాస్క్ రసవత్తరంగా సాగింది. ఈ టాస్క్ లో దేబ్జానీ, నరేష్, త్రిగుణ్, రామ్ ప్రసాద్, శివ కుమార్ పోటీ పడ్డారు. దేబ్జానీ బలంగా పోరాడింది. కానీ చివరికి త్రిగుణ్, శివకుమార్ పై చేయి సాధించారు.
అమన్ పై త్రిగుణ్ రివేంజ్
ఇద్దరి మధ్య గేమ్ టై అయింది. దీంతో టై బ్రేకర్ గేమ్ నిర్వహించగా ఆ గేమ్ లో త్రిగుణ్ విజయం సాధించారు. దీనితో త్రిగుణ్ కి వచ్చే వారం వాళ్ళ ఫ్యామిలీని మీట్ అయ్యే అవకాశం దక్కింది. తన ఫోటో చించాడు అంటూ నిందలు వేస్తున్న అమన్ పై త్రిగుణ్ రివేంజ్ తీర్చుకున్నాడు. దీనితో అమన్ వాళ్ళ ఫ్యామిలీని మీట్ అయ్యే అవకాశం కోల్పోయాడు. త్రిగుణ మాట్లాడుతూ మీ ఇంట్లో ఒక ముద్ద తిన్నాను. నేను నీ ఫోటో చించుతాను అని ఎలా అనుకుంటావ్ అంటూ త్రిగుణ్ ఎమోషనల్ అయ్యాడు.
దేబ్జానీ విజయం
ఆ తర్వాత నరేష్, దేబ్జానీ, నీతూ మధ్య గేమ్ జరిగింది. ఈ గేమ్ లో ముందుగా నరేష్ పైచేయి సాధించినట్లు కనిపించాడు. కానీ కలర్స్ ని కరెక్ట్ గా అరేంజ్ చేయడంలో కన్ఫ్యూజ్ అయ్యాడు. కానీ నీతూ ఫిజికల్ గేమ్ ఆడి నరేష్ గేమ్ ని పాడు చేసే ప్రయత్నం చేసింది. నరేష్ కోపం కట్టలు తెంచుకుంది. దీనితో ఆమె గేమ్ మొత్తాన్ని నరేష్ నాశనం చేశాడు. దీనితో ఇద్దరూ నష్టపోయారు. దేబ్జానీ విజయం సాధించింది.





