47 ఏళ్ల విజయ్ సేతుపతి తో 53 ఏళ్ళ హీరోయిన్ జంటగా సినిమా? ఎవరా నటి?
అవ్వడానికి తమిళ హీరో అయినా.. సౌత్ అంతటా మంచి పేరు తెచ్చుకున్నాడు విజయ్ సేతుపతి. తెలుగులో కూడా విజయ్ కు మంచి క్రేజ్ ఉంది. ప్రయోగాత్మక సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రస్ గా ఉన్నాడు. ఇక తాజాగా మరో సాహసం చేయబోతున్నాడట విజయ్. తనకంటే పెద్ద వయసున్న హీరోయిన్‌తో కలిసి నటిస్తున్నాడని టాక్. ఇంతకీ ఎవరా హీరోయిన్?
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు తమకంటే 20 , 30 ఏళ్ల కంటే చిన్న హీరోయిన్లతో కూడా నటించడానికి ఇష్టపడుతుంటారు. మనవరాలు వయస్సున్న హీరోయిన్లతో నటించిన హీరోలు కూడా లేకపోలేదు. కాని ఓ నటుడు మాత్రం తనకంటే ఆరేళ్లు పెద్దదయిన హీరోయిన్ తో నటించడానికి ఒప్పుకున్నారని టాక్ నడుస్తోంది. ఇంతకీ ఆయన మరెవరో కాదో విజయ్ సేతుపతి.
Also Read: RRR కంటే ముందు రామ్ చరణ్ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
విజయ్ సేతుపతి రిజెక్ట్ మూవీ
విజయ్ సేతుపతి ఆలోచన విధానం బాగుంటుంది. మంచి మనసుతో పాటు తను చేసే పనిలో విలువలు చూపిస్తాడు. ఉప్పెన సినిమాలో తన కూతురిగా నటించిన కృతి శెట్టి.. ఆతరువాత విజయ్ సేతుపతికి హీరోయిన్ గా నటించాల్సి వచ్చిందట. అందుకోసం ఆమె సరే అని చెప్పినా.. విజయ్ మాత్రం నో అన్నారట. కూతురిగా నటించిన వారికి జోడీగా తాను నటించలేనని చెప్పడంతో ఆయనపై ఇండస్ట్రీలో గౌరవం మరింతగా పెరిగింది.
Also Read: నయనతారకు త్రిష స్ట్రాంగ్ వార్నింగ్, సోషల్ మీడియాలో ఫైర్ అయిన నటి, ఎందుకంటే?
విజయ్ సేతుపతి న్యూ పెయిర్:
విజయ్ సేతుపతి తనకంటే 6 ఏళ్లు పెద్ద హీరోయిన్‌తో నటిస్తున్నాడని సమాచారం. కమర్షియల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతితో సినిమా తీయనున్నట్లు ప్రకటించారు. ఇది పాన్-ఇండియా చిత్రంగా రూపొందనుంది.ఈ సినిమాను పూరి జగన్నాథ్ , చార్మి కౌర్ కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
Also Read: 400 సినిమాలు, 3 పెళ్లిళ్లు, 6 గురు పిల్లలు, 100 కోట్ల ఆస్తి ఉన్న స్టార్ నటుడు ఎవరో తెలుసా?
విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమాలో టబు
ఈ సినిమాలో విజయ్ సేతుపతి మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో టబు హీరోయిన్‌గా నటించనున్నారు. టబు కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసింది. చాలా సంవత్సరాల తర్వాత ఆమె తెలుగులో నటిస్తోంది.
ఈ సినిమా షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానుంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇలా విజయ్ సేతుపతి తనకంటే వయస్సులో పెద్ద హీరోయిన్ తో కలిసి నటించడానికి ఒప్పుకున్నాడు. అందరు హీరోలకంటే తాను డిఫరెంట్ అని నిరూపించుకున్నాడు.
Also Read: అలిగిన బాలయ్య, ఆగిపోయిన అఖండా 2 షూటింగ్, నిజమెంత?