MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అలిగిన బాలయ్య, ఆగిపోయిన అఖండా 2 షూటింగ్, నిజమెంత?

అలిగిన బాలయ్య, ఆగిపోయిన అఖండా 2 షూటింగ్, నిజమెంత?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 షూటింగ్ ఆగిపోయిందని టాలీవుడ్ లో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంలో నిజం ఎంత? బాలయ్య బోయపాటి మధ్య మనస్పర్ధలు వచ్చాయా? బాలయ్య అలిగారంటూ వస్తున్న వార్తలు నిజమేనా? అసలేం జరుగుతుంది? 

Mahesh Jujjuri | Published : Apr 11 2025, 11:28 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Asianet Image

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న భారీ  బడ్జెట్ మూవీ  అఖండ 2. బాలయ్యకు సాలిడ్ సక్సెస్ అందించిన అఖండ మూవీకి రీమేక్ గా ఈసినిమా రూపొందుతోంది. బాలయ్య హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఈ మూవీ రాబోతోంది. వీరిద్దరి కాంబోకు మంచి డిమాండ్ ఉంది. వీరు కలిసి చేసిన  సినిమాలన్నీ దాదాపుగా సెన్సేషనల్ హిట్ అయ్యాయి. అలా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది అఖండ. అంతకు మందు వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందిపడిన బాలయ్యకు అఖండ సినిమాతో భారీ సక్సెస్ వరించింది.

Also Read: 1000 కోట్లు ఇచ్చిన ప్రభాస్ ఆ పని మాత్రం చేయనంటున్నాడు, హాట్సాఫ్ చెబుతున్న ఫ్యాన్స్

24
AKHANDA 2

AKHANDA 2

 ఈసినిమా తరువాత వచ్చిన సినిమాలన్నీ వరుసగా హిట్ అయ్యాయి. దాంతో మరోసారి అఖండ సీక్వెల్ తో అదరగోట్టాలని ప్లాన్ చేశారు బాలయ్య , బోయపాటి. అఖండ సెట్ చేసిన  రికార్డులను మించి  సెట్ చేయాలని అనుకుంటున్నారట టీమ్.  ఇక ఇపుడు పార్ట్ 2 షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతుంది. ఈక్రమంలో ఈసినిమాకు సబంధించి ఇంట్రెస్టింగ్ రూమర్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

34
Boyapati Srinu

Boyapati Srinu

అఖండ2 సినిమా షూటింగ్ ఆగిపోయిందని, బాలయ్య అలిగి షూటింగ్ నుంచి వెళ్ళిపోయారని, బాలయ్యకి, బోయపాటికి పడట్లేదు అని షూటింగ్ అంత మంచిగ జరగట్లేదు అంటూ కొన్ని రూమర్స్ టాలీవుడ్ లో షికారు చేస్తున్నాయి. దాంతో బాలయ్య ఫ్యాన్స్ లో కాస్త టెన్షన్ మొదలయ్యింది.
 

44
Asianet Image

 అసలు ఏం జరుగుతుంది అని వాకబు చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. మూవీ టీమ్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం షూటింగ్  అనుకున్నట్టే  సజావుగా జరుగుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకు  థమన్ అదిరిపోయే ట్యూన్ లు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను రెడీ చేస్తున్నాడు. అఖండ సినిమాకు థమన్ వాయింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అఖండ2కు అంతకు మించిన సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయట. ఇక  ఈసినిమాను  14 రీల్స్ బ్యానర్ పై  భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
నందమూరి బాలకృష్ణ
తెలుగు సినిమా
 
Recommended Stories
Top Stories