MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్ మంచి మనసు, కష్టాల్లో ఉన్న సీనియర్ ఆర్టిస్ట్ ను ఆదుకున్న బన్ని..

అల్లు అర్జున్ మంచి మనసు, కష్టాల్లో ఉన్న సీనియర్ ఆర్టిస్ట్ ను ఆదుకున్న బన్ని..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మంచి మనసు చాటుకున్నారు. ఇండస్ట్రీలో 50 ఏళ్లకు పైగా కొనసాగిన సీనియర్ ఆర్టిస్ట్ ను ఆదుకున్నాడు. కష్టాల్లో ఉన్న ఆమెకు చేయూతనిచ్చాడు.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 04 2026, 06:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పావలా శ్యామలను ఆదుకున్న అల్లు అర్జున్..
Image Credit : Asianet News

పావలా శ్యామలను ఆదుకున్న అల్లు అర్జున్..

సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల ఎదుర్కొంటున్న అనారోగ్య, ఆర్థిక ఇబ్బందులపై స్టార్ హీరో అల్లు అర్జున్ స్పందించారు. తీవ్ర అనారోగ్యంతో పాటు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఆమె పరిస్థితిని తెలుసుకున్న ఆయన.. వెంటనే అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. పావలా శ్యామల , ఆమె కుమార్తె వైద్య ఖర్చులు, నిత్యావసరాల కోసం ప్రతి నెలా రూ.10,000 అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
దీన స్థితిలో పావల శ్యామల..
Image Credit : our own

దీన స్థితిలో పావల శ్యామల..

దాదాపు 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న శ్యామల.. వందలాది చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను అలరించింది. పావలా శ్యామల, గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. సరైన ఆదరణ లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ, తన కుమార్తెతో కలిసి సికింద్రాబాద్ కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ లో ఆశ్రయం పొందుతున్నారు. తల్లీకూతుళ్లిద్దరి ఆరోగ్యం క్షీణించి, కనీసం మందులు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొన్నట్లు తెలిసింది.

34
చలించిపోయిన అల్లు అర్జున్
Image Credit : youtube/@aha

చలించిపోయిన అల్లు అర్జున్

ఈ విషయాన్ని తెలుసుకున్న అల్లు అర్జున్ చలించిపోయి, వారికి తక్షణ సహాయం అందించడమే కాకుండా, దీర్ఘకాలిక భరోసా కల్పించే దిశగా చర్యలు తీసుకున్నారు. కేవలం ఒకసారిగా ఆర్థిక సాయం చేయడం కాకుండా, ప్రతి నెలా నిరంతరంగా డబ్బు అందేలా ఏర్పాట్లు చేశాడు. . ఈ సహాయం ద్వారా పావలా శ్యామల వైద్య చికిత్సలు, నిత్యవసర ఖర్చులు సులభంగా నిర్వహించుకునేందుకు వీలుగా..నెల నెల 10 వేలు సాయం అందించాలని తన టీమ్ ను ఆయన ఆదేశించారు.

44
పావల శ్యామల సినిమాలు
Image Credit : our own

పావల శ్యామల సినిమాలు

గతంలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా పలువురు సినీ ప్రముఖులు పావలా శ్యామలకు ఆర్థికంగా అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక పావల శ్యామల సినిమాల విషయానికి వస్తే.. గతంలో జంధ్యాల సినిమాల్లో ఆమె నటించి మెప్పించారు. కొన్ని సినిమాల్లో బ్రహ్మానందం జంటగా కూడా ఆమె నటించారు. దాదాపు రెండు తరాల నటీనటులతో ఆమె కలిసి స్క్రీన్ పంచుకున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image2
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Recommended image3
Priyanka Singh: బతుకుతానో లేదో తెలియదు, అద్ధంలో ముఖం చూసుకుంటే.. కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రియాంక సింగ్ ఎమోషనల్ కామెంట్స్
Related Stories
Recommended image1
సాయి పల్లవి 4000 కోట్ల సినిమాలోకి.. హాలీవుడ్ డైరెక్టర్ ఎంట్రీ?
Recommended image2
విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved