- Home
- Entertainment
- Bigg Boss 10: హౌజ్‌లో వేస్ట్ వర్షిణి.. రామకృష్ణకి అన్యాయం చేసిన కంటెస్టెంట్లు.. కన్నీళ్లు
Bigg Boss 10: హౌజ్‌లో వేస్ట్ వర్షిణి.. రామకృష్ణకి అన్యాయం చేసిన కంటెస్టెంట్లు.. కన్నీళ్లు
బిగ్ బాస్ తెలుగు 10.. ఈ వారం శనివారం ఎపిసోడ్లో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. హౌజ్‌లో వర్షిణి జీరో అని తేల్చేశారు. కానీ ఆమెకే బంపర్ ఆఫర్ ఇచ్చారు. రామకృష్ణ బలయ్యాడు.

నరేష్ కొత్త కెప్టెన్
బిగ్ బాస్ తెలుగు 10 పదోవారం చివరకు చేరుకుంది. శనివారం ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున వచ్చారు. అంతకు ముందు కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఇందులో నరేష్ కెప్టెన్ అయ్యాడు. అమన్, సుధీర్ వంటి వారికి ఓట్లు పడలేదు. నరేష్‌కి ఎక్కువ మంది ఓటింగ్ వేశారు. దీంతో టాప్‌లో ఉన్నాడు. కెప్టెన్ అయ్యాడు. దీంతో తన సంతోషం వ్యక్తం చేశాడు నరేష్. తనదైన స్టయిల్లో నవ్వులు పూయించాడు.
బాధపెట్టింది ఎవరంటే?
ఇక ఆ తర్వాత నాగార్జున ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్లతో మాట్లాడారు. ఇందులో ఎవరు తమని హర్ట్ చేశారు? సారీ చెప్పాలి అనిపించింది ఎవరు అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో వర్షిణి.. త్రిగుణ్ అన్నమాటలు తనని బాధించాయని, షేక్ చేసిందని, చాలా బాధపడినట్టు తెలిపింది. దీనికి త్రిగుణ్ కూడా సారీ చెప్పారు. శ్వేత.. రామ్ ప్రసాద్ కెప్టెన్సీ టాస్క్ లో హ్యాండిచ్చాడని చెప్పింది. తప్పుగా చెప్పాడని చెప్పింది. కానీ వీడియో చూపించగా, శ్వేతదే తప్పు ఉంది.
వర్షిణి గేమ్ జీరో
ఇలా శివ.. ముఖేష్ హర్ట్ చేశాడని, నరేష్.. త్రిగున్ హర్ట్ చేశాడని, అమన్ త్రిగున్ హర్ట్ చేశాడని, సుధీర్ ముఖేష్ హర్ట్ చేశాడని చెప్పారు. అనంతరం ఎవరు ఆటలో జీరో అనే టెస్ట్ పెట్టాడు నాగార్జున. ఇందులో వర్షిణి జీరో అని వంశీ, శ్వేత, నరేష్ తెలిపారు.
సుధీర్ ఆటలో జీరో అని అమన్, ముఖేష్, దేబ్జానీ చెప్పింది. త్రిగుణ్ జీరో అని రామకృష్ణ, శివ చెప్పారు. శివ జీరో అని వర్షిణి, త్రిగుణ్.. రామకృష్ణ జీరో అని సుధీర్ తెలిపారు. ఇందులో వర్షిణికి, సుధీర్‌కి సమానంగా ఓట్లు పడ్డాయి. ఇద్దరిలో దేబ్జానీ ఓట్ ద్వారా సుధీర్ సేఫ్ అయ్యాడు. వర్షిణికి ఫనీష్‌మెంట్ పడింది. దీని కారణంగా ఆమె ఈ సీజన్లో ఎప్పటికీ కెప్టెన్ కాలేదు.
రామకృష్ణకి అన్యాయం
అనంతరం ఈ వారంలో రామకృష్ణ, వర్షిణి ఫ్యామిలీ మెంబర్స్ రాలేదు. ఈ నేపథ్యంలో మరో ఛాన్స్ ఇచ్చారు. అయితే ట్విస్ట్ ఇస్తూ, కంటెస్టెంట్ల ఓట్ల ద్వారా ఎక్కువ ఓట్లు వచ్చిన వారికే ఫ్యామిలీ మెంబర్స్ ని హౌజ్‌లోకి అనుమతిస్తారు. ఇందులో చాలా వరకు వర్షిణికే ఓట్లు పడ్డాయి. దీంతో రామకృష్ణ కన్నీళ్లు పెట్టుకున్నాడు. వాళ్ల అమ్మ కూడా ఏడవడం అందరిని కలిచివేసింది. అయినా దూరం నుంచే మాట్లాడుకున్నారు.
మొత్తంగా ఇందులో రామకృష్ణకి అన్యాయం జరిగింది. ఇక వర్షిణి తల్లి హౌజ్‌లోకి వచ్చింది. దీంతో వర్షిణి ఆనందానికి అవదుల్లేవ్. ఆమె ముఖేష్ తన ఫేవరేట్ అని చెప్పడం విశేషం. త్రిగుణ్ ఆటకి మైండ్ బ్లోయింగ్ అని చెప్పింది. అందరు కొట్టుకోండి, మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి అని చెప్పింది. అందరు ఫ్యామిలీ అని పేర్కొంది. అదే సమయంలో ముఖేష్.. వర్షిణి చేయిని వదలకు అని తెలిపింది. ఆమెకి సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపింది. మొత్తంగా శనివారం ఎపిసోడ్ రసవత్తరంగా సాగిందని చెప్పొచ్చు.













