- Home
- Entertainment
- NTR-Anil Ravipudi: పవన్‌కి షాక్.. ఎన్టీఆర్‌తో అనిల్ రావిపూడి సినిమా.. మైండ్ బ్లోయింగ్ లైనప్
NTR-Anil Ravipudi: పవన్‌కి షాక్.. ఎన్టీఆర్‌తో అనిల్ రావిపూడి సినిమా.. మైండ్ బ్లోయింగ్ లైనప్
ఎన్టీఆర్ బ్యాక్ టూ బ్యాక్ కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటిస్తూ షాకిస్తున్నారు. అభిమానులను అలరిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించి అభిమానులను సర్ప్రైజ్ చేశారు.

అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ మూవీ
ఎన్టీఆర్ ఇప్పుడు వరుసగా సినిమాలను ప్రకటిస్తున్నారు. ఆయన ఇటీవలే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాని ప్రకటించారు. ఇప్పుడు కొత్త సినిమా ప్రకటన వచ్చింది. అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నారు. తాజాగా శనివారం దీన్ని ప్రకటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది.
ఎన్టీఆర్, అనిల్ రావిపూడి ఫన్ రైడ్ కి సిద్ధంగా ఉండండి అని చెబుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి ఏర్పడింది. అదే సమయంలో వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఎన్టీఆర్ ఎనర్జీ, కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి మార్క్ ఫన్ తోడైతే సినిమా అదిరిపోతుందని చెప్పొచ్చు.
పవన్ కళ్యాణ్‌కి షాక్..
ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా `జనవరి 12న విడుదల` అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇది ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఆ తర్వాత బాలయ్యతో సినిమా ఉంటుందనే ప్రచారం జరిగింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్‌తోనూ సినిమా ఉండబోతుందనే టాక్ వినిపించింది. దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు టాక్.
ఇటీవల ప్రెస్ మీట్లో కూడా దిల్ రాజు ఈ విషయాన్ని వెల్లడించారు. చర్చలు జరుగుతున్నాయని, ఎవరితో, ఎప్పుడు ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. తాజాగా శనివారం ఆయన పవన్ కళ్యాణ్‌ని కలిశారు. ఈ క్రమంలో ఇప్పట్లో ఆ ప్రాజెక్ట్ ఉండబోదని తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఎన్టీఆర్‌తో సినిమా ప్రకటన వచ్చినట్టు సమాచారం.
ఎన్టీఆర్ భారీ లైనప్
ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో మూవీ ఎప్పుడు ఉంటుందనేది ఆసక్తికరంగా, సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం ఎన్టీఆర్ `డ్రాగన్` చిత్రంలో నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుంది.
ఆ తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా చేయబోతున్నారు. `ది గాడ్ ఆఫ్ వార్` పుస్తకం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. కార్తికేయుడి కథని తెరకెక్కించబోతున్నారు. ఇది వచ్చే సమ్మర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాతనే అనిల్ రావిపూడి మూవీ ఉండనుందని సమాచారం.
దీంతోపాటు ఎన్టీఆర్ మరో మూవీకి కమిట్ అయినట్టు సమాచారం. తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో సినిమా చేయబోతున్నట్టు సమాచారం. నాగవంశీ ఆ మధ్య ఈ విషయాన్ని వెల్లడించారు. అది అనిల్ రావిపూడి మూవీ తర్వాత ఉంటుందా? లేక ముందే ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.
మొత్తంగా ఎన్టీఆర్ చేతిలో ఇప్పుడు భారీ లైనప్ ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు చేస్తున్న `డ్రాగన్`, నెక్ట్స్ త్రివిక్రమ్ తో సినిమా, అలాగే అనిల్ రావిపూడితో మూవీ, అన్నీ కుదిరితే నెల్సన్ దిలీప్ కుమార్‌తో ప్రాజెక్ట్ ఉండబోతుందని సమాచారం. అన్నట్టు నెల్సన్ ఇటీవల `జైలర్ 2`తో కోలీవుడ్‌లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆయన ఇప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్ హీరోలుగా ఓ మూవీని రూపొందిస్తున్నారు.
This one's going to be a laugh riot… @AnilRavipudi
#NTRxAnilRavipudi
@NANDAMURIKALYAN @NTRArtsOfficial https://t.co/jUMssuUrtU
— Jr NTR (@tarak9999) November 14, 2026













