'ఒకవేళ తారక్ అన్న ఆస్కార్ గెలిస్తే'.. వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ కామెంట్స్
విజయ్ దేవరకొండ నటించిన లైగర్ మ్యానియా నెమ్మదిగా జోరందుకుంటోంది. పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ, అనన్య పాండే, ఛార్మి ఇలా లైగర్ టీం దేశం మొత్తం తిరుగుతూ తమ చిత్రానికి ప్రమోషన్స్ చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ నటించిన లైగర్ మ్యానియా నెమ్మదిగా జోరందుకుంటోంది. పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ, అనన్య పాండే, ఛార్మి ఇలా లైగర్ టీం దేశం మొత్తం తిరుగుతూ తమ చిత్రానికి ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే లైగర్ చిత్రంపై విపరీతమైన హైప్ నెలకొంది. విజయ్ దేవరకొండ ఎప్పటిలాగే బోల్డ్ గా మీడియాకి సమాధానాలు ఇస్తున్నాడు.
విజయ్, పూరి జగన్నాధ్ కెరీర్ లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ రిలీజ్ కాబోతోంది. ఆగష్టు 25న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ తాజాగా ఇంటర్వ్యూలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటనకి గాను ఎన్టీఆర్.. ఆస్కార్స్ కి నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ అంచనాలు మొదలయ్యాయి.
దీనిపై విజయ్ దేవరకొండ స్పందించాడు. 'ఒక వేళ తారక్ అన్న ఆస్కార్ గెలిస్తే మెంటల్ అసలు. మన దేశానికి ఆస్కార్ వస్తే ఆ హై వేరుగా ఉంటుంది. ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరూ డెడ్లీ పెర్ఫామెన్స్ ఇచ్చారు. అదే కనుక జరిగితే ఒక మ్యాజిక్ లాగా చాలా బావుంటుంది' అని విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం హాలీవుడ్ ప్రేక్షకుల్ని, సెలెబ్రిటీలని మెస్మరైజ్ చేస్తోంది. ప్రతి ఒక్కరూ ఈ చిత్రానికి ఫిదా అవుతున్నారు. బడా హాలీవుడ్ స్టార్స్, దర్శకులు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు. దీనితో ఆర్ఆర్ఆర్ చిత్రం ఏదో ఒక రూపంలో ఆస్కార్స్ నామినేట్ అవుతుందనే ఊహాగానాలు పెరిగాయి.
విజయ్ దేవరకొండ విషయానికి వస్తే.. కొన్ని వారాల క్రితం మా తాత ఎవరో తెలియదు.. తండ్రి ఎవరో తెలియదు ఆంటూ విజయ్ నెపోటిజం గురించి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్స్ గురించి కూడా విజయ్ వివరణ ఇచ్చాడు. నా గత చిత్రాలు సరిగ్గా ఆడలేదు. రెండేళ్ల తర్వాత నా సినిమా వస్తోంది. కానీ ఒక్క ట్రైలర్ రిలీజ్ చేయగానే అభిమానులు ఎంతో ప్రేమ చూపించారు. ఆ టైంలో ఎమోషనల్ గా అలా మాట్లాడాను అని విజయ్ దేవరకొండ అన్నారు.
RRR Movie
లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. లైగర్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ చిత్రంలో 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' పోలికలు ఉన్నాయని కామెంట్స్ వినిపించాయి. కానీ లైగర్ యూనిక్ గా ఉంటుందని.. క్లైమాక్స్ ఇండియన్ సినిమాలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఉంటుందని పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ తెలిపారు.