విజయ్ అరబిక్ కుత్తు సరికొత్త రికార్డ్, యూట్యూబ్‌లో దుమ్ము రేపిన వీడియో సాంగ్
Vijay Arabic Kuthu Song Sensation : నెల్సన్ దిలీప్ డైరెక్షన్ లో విజయ్ దళపతి నటించిన సినిమా బీస్ట్. ఈసినిమా పెద్ద హిట్ అవ్వకపోయినా.. ఈమూవీలో పాటలు మాత్రం దుమ్మురేపాయి. ఈక్రమంలో ఈసినిమాలో అరబిక్ కుత్తు సాంగ్ యూట్యూబ్ రికార్డ్స్ ను బ్లాస్ట్ చేస్తోంది. ఇంతకీ ఈసాంగ్ సాధించిన ఘనతేంటి.

Vijay Arabic Kuthu Song Sensation: విజయ్ దళపతి హీరోగా 2022లో వచ్చిన మూవీ బీస్ట్. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అభిమానులు ఎంతో ఎదురుచూశారు. కాని ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేసింది సినిమా. థియేటర్లలో అంతగా ఆడలేదు. కానీ సాంగ్స్ మాత్రం అందరినీ బాగా ఆకట్టుకున్నాయి. స్పెషల్‌గా ‘అరబిక్ కుత్తు’ సాంగ్ రిలీజ్ అయ్యాక ఓ రేంజ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ‘అరబిక్ కుత్తు’ సాంగ్ యూట్యూబ్‌లో 700 మిలియన్ వ్యూస్‌కి పైగా తెచ్చుకుని దుమ్ము రేపింది. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
Also Read: నిర్మాతలను భయపెడుతున్న బులిరాజు, రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్

అరబిక్ కుత్తు సాంగ్ రికార్డ్
ముందుగా, సౌత్ ఇండియాలో ఫాస్టెస్ట్‌గా 100 మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న సాంగ్‌గా అరబిక్ కుత్తు రికార్డు క్రియేట్ చేసింది. ఈ రికార్డును 15 రోజుల్లోనే కొట్టింది. ధనుష్ నటించిన మారి 2 మూవీలోని 'రౌడీ బేబీ' సాంగ్ రికార్డును అరబిక్ కుత్తు బ్రేక్ చేసింది. రౌడీ బేబీ 18 రోజుల్లో 100 మిలియన్ రీచ్ అయింది. విజయ్ మాస్టర్ మూవీలోని 'వాతి కమింగ్' సాంగ్ మూడో ప్లేస్‌లో ఉంది.
Also Read: నా కొడుకుతో సినిమా చేయి ప్లీజ్ అంటూ, రాజమౌళిని బ్రతిమలాడిన సీనియర్ హీరో ఎవరో తెలుసా?

అరబిక్ కుత్తు సాంగ్
శివ కార్తికేయన్ అరబిక్ కుత్తు సాంగ్‌ను రాశారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. అనిరుధ్ రవిచందర్, జోనితా గాంధీ కలిసి అరబిక్ కుత్తు సాంగ్‌ను పాడారు. డాక్టర్ మూవీ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన మూవీ బీస్ట్. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. విజయ్ కెరీర్‌లో ఇది 65వ సినిమా. మలయాళ నటులైన షైన్ టామ్ చాకో, అపర్ణా దాస్ ఇంపార్టెంట్ రోల్స్‌లో నటించారు.
Also Read: 21,000 కోట్ల ఆస్తికి వారసురాలు, పాన్ ఇండియా హీరోకి భార్య ఎవరో తెలుసా?

బీస్ట్ మూవీ
బీస్ట్ మూవీ ఫ్లాప్ అయినా, ఆ మూవీలోని సాంగ్ 3 ఏళ్లు అయినా ఫ్యాన్స్ మధ్య క్రేజ్ తగ్గకుండా ఉంది. దీనికి మెయిన్ రీజన్, ఆ సాంగ్ పిల్లలను బాగా ఆకట్టుకుంది. బీస్ట్ మూవీ కోసం అరబిక్ కుత్తు సాంగ్ రాసిన శివ కార్తికేయన్, ఆ సాంగ్ కోసం తీసుకున్న శాలరీని చనిపోయిన లిరిసిస్ట్ ముత్తుకుమార్ ఫ్యామిలీకి ఇచ్చారు. ఆయన చేసిన పనికి ప్రశంసలు కురిశాయి.
Also Read: సావిత్రి పై బిగ్ బాస్ గీతూ రాయ్ సంచలన వ్యాఖ్యలు, మండిపడుతున్న మహానటి ఫ్యాన్స్

