MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Arjun Das: ఆ గంభీరమైన గొంతు వెనుక ఇంత విషాదమా? ప్రేమలో విఫలమై కుంగిపోయిన ఓజీ నటుడు

Arjun Das: ఆ గంభీరమైన గొంతు వెనుక ఇంత విషాదమా? ప్రేమలో విఫలమై కుంగిపోయిన ఓజీ నటుడు

‘ఖైదీ’, ‘మాస్టర్’ సినిమాలతో భయపెట్టే విలన్‌గా, ‘అనీతి’ సినిమాతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న అర్జున్ దాస్, ఇప్పుడు తన జీవితంలోని ఒక చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 15 2026, 05:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Arjun Das voice and acting career
Image Credit : Asianet News

Arjun Das voice and acting career

అర్జున్ దాస్ తన ప్రేమ జీవితం గురించి మాట్లాడుతూ, తనకో సీరియస్ లవ్ స్టోరీ ఉందని, అది విఫలమవ్వడంతో పూర్తిగా కుంగిపోయానని తెలిపారు. "ఆ గొంతు, రూపం ధైర్యంగా కనిపించినా, మానసికంగా నేను చాలా బలహీనంగా ఉన్న సమయం అది," అని ఆయన చెప్పారు. తమిళ సినిమాల్లో విలన్ అనగానే గుర్తొచ్చే కొద్దిమంది నటుల్లో అర్జున్ దాస్ ఒకరు. తన ప్రత్యేకమైన గొంతు, బాడీ లాంగ్వేజ్, నటనతో తక్కువ టైంలోనే అభిమానులలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 'ఖైదీ' సినిమాతో
Image Credit : Arjun Das instagram

'ఖైదీ' సినిమాతో

అర్జున్ దాస్ 2012లో 'పెరుమాన్' సినిమాతో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. మొదట్లో పెద్దగా అవకాశాలు రాకపోయినా, ఆయన ప్రయత్నాలు ఆపలేదు. 'ఖైదీ' సినిమాతో తమిళ ఇండస్ట్రీలో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ సినిమాలో కొన్ని సీన్లలోనే కనిపించినా, ఆయన గొంతు, నటన ప్రేక్షకులకు బాగా రిజిస్టర్ అయ్యాయి. ఆ సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
35
లన్ పాత్రకు అభిమానులు ఫిదా
Image Credit : Instagram

లన్ పాత్రకు అభిమానులు ఫిదా

ఆ తర్వాత వచ్చిన 'అంధకారం' సినిమా ఆయనలోని నటుడిని మరో కోణంలో చూపించింది. ఆ పాత్రకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇక 'మాస్టర్' సినిమాలో ఆయన పోషించిన విలన్ పాత్రకు అభిమానులు ఫిదా అయ్యారు. ఆ సినిమాలో ఆయన చెప్పిన 'లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్రా' డైలాగ్ తమిళనాట విపరీతంగా వైరల్ అయింది. ఆయన బరువైన గొంతు, నటన ట్రెండింగ్‌లో నిలిచాయి. ఆ డైలాగ్‌ను అభిమానులు ఇప్పటికీ వాడుతుంటారు. 

45
అమ్మాయిల కలల రాకుమారుడిగా
Image Credit : Google

అమ్మాయిల కలల రాకుమారుడిగా

'విక్రమ్' సినిమాలో కూడా అర్జున్ దాస్ నటించారు. దీంతో ఆయన కెరీర్ మరింత బలపడింది. ఇటీవల 'పోర్', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' వంటి చిత్రాల్లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విలన్‌గా భయపెట్టినా, తన లుక్స్, గొంతుతో ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడిగా మారారు. ముఖ్యంగా 'తొట్టు తొట్టు పేసుం సుల్తానా' పాటకు సోషల్ మీడియాలో ఆయనకు పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఆ పాటలో ప్రియా వారియర్‌తో కలిసి ఆయన వేసిన స్టెప్పులు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ ఓజీ చిత్రంలో అర్జున్ దాస్ కీలక పాత్రలో నటించారు.

55
అర్జున్ దాస్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ
Image Credit : Google

అర్జున్ దాస్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ

ఈ నేపథ్యంలో, ఇటీవల అర్జున్ దాస్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన ఒక పోస్ట్ అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆ పోస్ట్‌లో ప్రేమ గురించి ఆయన ఒక ఎమోషనల్ కామెంట్ పెట్టారు. "ఒకరిని చాలా గాఢంగా ప్రేమించిన తర్వాత, వాళ్ళు మన మనసును ముక్కలు చేస్తే, దాని నుంచి ఒకరు ఎలా బయటపడగలరు?" అనే భావం అందులో ఉంది. ఈ పోస్ట్ చాలా ఎమోషనల్‌గా ఉండటంతో అభిమానులు దృష్టిని ఆకర్షించింది. దీంతో "అర్జున్ దాస్ ప్రేమలో విఫలమయ్యారా?" అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Rajamouli: రాజమౌళిలో ధైర్యం నింపిన సినిమా.. చిరంజీవి సినిమాతో పూర్తిగా అప్పుల్లోకి, కానీ
Recommended image2
120 ఏళ్ళు నిద్రపోవాల్సిన వ్యక్తి మధ్యలోనే మేల్కొంటే ? ఓటీటీలో చూడాల్సిన టాప్ 5 స్పేస్ థ్రిల్లర్ మూవీస్ ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved