Intinti Gruhalakshmi: మళ్లీ ఇంటికి చేరుకున్న గృహలక్ష్మి.. నందు,లాస్యని ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పిన తులసి?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు జనవరి 13వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో తులసి ఎదగాలి అన్నది నా ఆశ కాని అందుకోసం మా వాళ్ళ సంతోషాన్ని బలి పెట్టలేను కదా అని అంటుంది. ఇంట్లో గొడవలు భరించలేక పారిపోయి వచ్చారు కదా అనగా పారిపోయి రాలేదు. నా వల్ల గొడవలు జరగకూడదని వచ్చేసాను అంటుంది తులసి. స్వేచ్ఛ కోసం వచ్చాను నాకు అండగా నిలబడ్డ మీరు మాట పడకూడదని వచ్చాను అంటుంది. నేను అనుకున్నది ఒకటి ప్రస్తుతం ఆ ఇంట్లో జరుగుతున్నది మరొకటి ఇంట్లో ప్రతి ఒక్కరు లాస్య వల్ల బాధపడుతున్నారు కానీ నేను ఫీల్ అవుతానని బయటకు చెప్పడం లేదు అంటుంది తులసి. నిజం తెలిసి అలాగే ఉండమంటారా దూరంగా ఉండి కూడా నేను వాళ్లకి చేసేది ఏమీ లేదు మౌనంగా ఉండడం తప్ప అని అంటుంది.
నిజంగా మంచి నిర్ణయం తీసుకున్నారు మీ మనసులో భయం ఉందేమో అని చెక్ చేయడానికి అలా మాట్లాడాను కానీ మీరు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ గా తులసి గారు అని అంటాడు సామ్రాట్. మీరు ఆ ఇంట్లో లేకపోవడం లాస్యకు అడ్వాంటేజ్ అయింది ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా తిండి లేకుండా చేస్తుంది అని అంటాడు సామ్రాట్. మీరు ఆ ఇంట్లో ఉండాల్సిందే కానీ మీ మంచితనం లాస్యని ఏమీ అనకుండా అడ్డుకుంటుంది. కానీ మీరు దాన్ని పక్కన పెడితేనే అనుకున్నది సాధించగలరు అని అంటాడు సామ్రాట్. అప్పుడు తులసికి మరింత ధైర్యం చెబుతూ ఉంటాడు సామ్రాట్. ఆల్ ది బెస్ట్ అని చెబుతాడు సామ్రాట్. అప్పుడు సామ్రాట్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు.
మరొకవైపు నందు సేట్ ని ఇంటి దగ్గరికి పిలుచుకొని రావడంతో అందరూ అక్కడికి వస్తారు. ఎవరు ఇతను అని పరంధామయ్య అడగడంతో మన శ్రేయోభిలాషి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు ఇస్తాడు అని అంటుంది లాస్య. ఇప్పుడు ఎందుకు వచ్చాడు అని అనసూయ అడగడంతో నా బిజినెస్ కు డబ్బులు ఇవ్వడానికి ఈ ఇళ్ళు తాకట్టు పెట్టడానికి అని అంటారు నందు లాస్య. ఇప్పుడు నందు లాస్య లోపలికి వెళ్లి పేపర్లు తీసుకునిరా అనగా నందు అనే చేతిలో ఉన్న పేపర్లు ఇస్తుంది. అప్పుడు అతను మీ పేరు మీదే ఉంది కదా మీ సంతకం పెట్టండి అనడంతో కాదు అని అక్కడికి వస్తుంది తులసి.
దాంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు. తులసి అక్కడికి వచ్చి ఇల్లు నా పేరు మీద ఉంది అని అంటుంది. వీళ్ళ మాటలు నమ్మి డబ్బులు ఇస్తే మీరు నిండా మునిగిపోతారు అనగా లాస్య ఆవిడ మాటలు నమ్మకండి అని అంటుంది. ఇళ్ళు ఇంతక ముందు ఉంది కానీ లాస్య పేరు మీదకి రాసి పేపర్ల మీద సంతకం చేసింది అని అంటాడు నందు. అది చాలు అని సేట్ అనడంతో ఇన్నేళ్ల వ్యాపార అనుభవం ఉండి వాళ్ళ బుట్టలో ఎలా పడుతున్నారు అర్థం కావడం లేదు, ఇల్లు నేను లాస్య పేరు మీద రాసిన మాట నిజమే కానీ ఆ పేపర్స్ ఇంతవరకు రిజిస్ట్రేషన్ కాలేదు అని అంటుంది తులసి. అప్పుడు నందు లాస్య ఇద్దరు షాక్ అవ్వగా కుటుంబ సభ్యులందరూ సంతోష పడుతూ ఉంటారు.
అప్పుడు సేట్ అవును కాలేదు ఏంటి నందు సాబ్ ఇది ఇంత మోసమా అని అంటాడు. రిజిస్ట్రేషన్ కానీ డాక్యుమెంట్స్ నా దగ్గర పెట్టి డబ్బులు తీసుకోవాలని చెప్పిన మోసం చేస్తారా ఇంకొకసారి నా దగ్గరికి రావద్దు అని ముఖం మీద పేపర్ విసిరేసి వెళ్లిపోతాడు. అప్పుడు నందు, లాస్య కోపంతో రగిలిపోతూ ఉంటారు. లాస్య నందుని రెచ్చగొడుతూ తులసి మీదకు ఉసుగొలుపుతూ ఉంటుంది. ఇదంతా మీ అందరికి తెలుసు కదా నాన్న ఎవరు నాకు చెప్పలేదు అనడంతో ఇది నీకు నాకు మధ్య సంబంధించినది ఇంట్లో వాళ్ల జోలికి వెళ్లొద్దు అంటుంది తులసి. నాటకాలు కంపెనీ నాది కాదు మీ ఆవిడది అని అనడంతో లాస్య షాక్ అవుతుంది. నువ్వు బిజినెస్ పెడితే నాకేంటి ఎదిగితే నాకేంటి ఎదగక పోతే నాకేంటి నాకు వచ్చే లాభం ఏమీ లేదు.
నేను తాపత్రయపడేదంతా నా ఫ్యామిలీ కోసం అని తులసి అనగా మాత్రమే కాదు నాకు కూడా ఫ్యామిలీ అనడంతో నీ ఫ్యామిలీ అయితే నువ్వు ఆ జిత్తుల మరి బెనర్జీ తో చేతులు కలిపే వారు కాదు ఇల్లు తాకట్టు పెట్టాలి అనుకునేవారు కాదు అంటుంది. కచ్చితంగా బెనర్జీ చేతిలో మీరు ఓడిపోతారు నా కుటుంబం రోడ్డున పడుతుంది. అందుకే ముందు జాగ్రత్తతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటుంది. ఇల్లు రాసి ఇచ్చినట్టు రాసిచ్చి ఇప్పుడు లాక్కున్నావు అనడంతో ఆ రోజు నేను ఇల్లు రాసిచ్చింది అత్తయ్యకు నీ భార్యకు కాదు నీ భార్య మోసం చేసి రాయించుకుంది అని అంటుంది. ఆ విషయం తెలిసినప్పుడు నీ భార్యని మోసగత్తే అని చిందులు వేశారు అవి మీకు గుర్తు రాలేదా అని అనడంతో నందు తలదించుకుంటాడు.
అప్పుడు మీరు మా వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం లేదు శాశ్వతంగా మా వాళ్ళని చూసుకోవడానికి ఈ ఇంటికి వచ్చేసాను అనడంతో నందు లాస్య షాక్ అవుతారు. అప్పుడు ఇంట్లో వారందరూ సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు లాస్య ఏం మాట్లాడాలో తెలియక మధ్యలో సామ్రాట్ ని ఇన్వాల్వ్ చేస్తూ వారి బంధం గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు అందరూ ఒక్కటై మాట్లాడడంతో లాస్య టెన్షన్ పడుతూ ఉంటుంది. అందరూ కలిసి తులసిని లోపలికి పిలుచుకొని వెళ్తుండగా సిగ్గు లేకుండా నువ్వు లోపలికి వస్తానంటే మేము రానివ్వము మేము ఒప్పుకోము అనడంతో అప్పుడు వెంటనే తులసి ఒప్పుకోవడానికి ఒప్పుకోకపోవడానికి అసలు మీరెవరు ఈ ఇల్లు నాది అని అంటూ నందు లాస్య షాక్ అవుతారు. వీళ్ళందరూ నా వాళ్లు నేను ఇక్కడే ఉండాలని కోరుకునే వాళ్ళు అని అంటుంది.
మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే ఇల్లు విడిచి వెళ్ళిపోవచ్చు అని అంటుంది తులసి. మీరు వెళ్తానన్నా వద్దు అనే వాళ్ళు ఆపే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు అని నందు కి లాస్యకి బుద్ధి చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది తులసి. ఆ తర్వాత నందు ఇంట్లోంచి వెళ్లిపోవడానికి లగేజ్ సర్దుకుంటూ ఉంటాడు. అప్పుడు లాస్య అక్కడికి వచ్చి ఒక్కసారి ఆలోచించు నందు ఇప్పుడు ఆవేశంగా బయటకు వెళ్తే రోడ్డున పడతాము ఇప్పుడు నీకు నాకు ఇద్దరికీ సంపాదనలేదు ఇక్కడే ఉంటే ఎలాగో అలా గడిచిపోతుంది అని అందుకు నచ్చదు. మరొకవైపు సామ్రాట్ ఆలోచించుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి వాళ్ళ బాబాయ్ వస్తాడు. అప్పుడు ఎదురుగా వచ్చి కూర్చున్న పట్టించుకోకపోయేసరికి ఫోన్ చేయగా తులసి గారు అనగా తులసి గారు కాదు నేను ముసలోడిని అనగా ఏంటి బాబాయ్ ఇది అనడంతో మరి ఎదురుగా వచ్చి నిలుచున్న పట్టించుకోకపోతే మరి ఏం చేయాలి అని అంటాడు.. అప్పుడు వారిద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.