MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Uday Kiran: చిరంజీవి అడ్డుపడుతున్నాడంటూ ఉదయ్‌ కిరణ్‌ ఆవేదన.. లవర్‌ బాయ్‌ నిజస్వరూపం బయటపెట్టిన నిర్మాత

Uday Kiran: చిరంజీవి అడ్డుపడుతున్నాడంటూ ఉదయ్‌ కిరణ్‌ ఆవేదన.. లవర్‌ బాయ్‌ నిజస్వరూపం బయటపెట్టిన నిర్మాత

ఉదయ్‌ కిరణ్‌ కెరీర్‌ చివర్లో వరుస పరాజయాలు ఫేస్‌ చేశారు. అదే సమయంలో కొన్ని సినిమాలు ఆగిపోయాయి. దీనికి కారణం చిరంజీవినే అని అంతా అనుకుంటున్నారు. కానీ అసలు నిజాలు తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 28 2026, 12:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఓవర్‌ నైట్‌ లో స్టార్‌గా ఎదిగిన ఉదయ్‌ కిరణ్‌
Image Credit : Asianet News

ఓవర్‌ నైట్‌ లో స్టార్‌గా ఎదిగిన ఉదయ్‌ కిరణ్‌

ఉదయ్‌ కిరణ్‌ వరుసగా ప్రేమ కథా చిత్రాలు చేసి ఆకట్టుకున్నాడు. వరుస విజయాలు అందుకొని స్టార్‌గా ఎదిగారు. లవ్‌ స్టోరీస్‌తో మెప్పించి లవర్‌ బాయ్‌గా పేరుతెచ్చుకున్న విషయం తెలిసిందే. ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయిన ఉదయ్‌ కిరణ్‌ ఓ దశ తర్వాత ఆ స్థాయిలో మెప్పించలేకపోయారు. ఆయన నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. వరుస పరాజయం చెందాయి. దీంతో ఉదయ్‌ కిరణ్‌ కెరీర్‌ డౌన్‌ అయ్యింది. అవకాశాలు కూడా తగ్గాయి. ఆ తర్వాత మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవినే అడ్డుపడుతున్నాడంటూ ఉదయ్‌ కిరణ్‌ ఆవేదన
Image Credit : our own

చిరంజీవినే అడ్డుపడుతున్నాడంటూ ఉదయ్‌ కిరణ్‌ ఆవేదన

అయితే అప్పట్లో చిరంజీవి వల్లే ఉదయ్‌ కిరణ్‌కి అవకాశాలు తగ్గాయని, ఆయన కూతురు సుస్మితతో ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్‌ చేయడం వల్ల చిరంజీవి కక్ష్య కట్టి ఉదయ్‌ కిరణ్‌కి అవకాశాలు రాకుండా చేశాడనే పుకారు ఉంది. అయితే ఇదే విషయాన్ని ఉదయ్‌ కిరణ్‌.. దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వద్ద వెల్లడించాడట. ఇలా చిరంజీవిగారు అడ్డుపడుతున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశాడట. అవకాశాలు రాకుండా చేస్తున్నాడని చెప్పాడట. ఆ సమయంలో తమ మధ్య జరిగిన కన్వర్జేషన్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని తమ్మారెడ్డి తాజాగా వెల్లడించారు. ఐడ్రీమ్‌కిచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్‌ విషయాలు చెప్పారు.

35
ఉదయ్‌ కిరణ్‌ నిజ స్వరూపం వెల్లడి
Image Credit : our own

ఉదయ్‌ కిరణ్‌ నిజ స్వరూపం వెల్లడి

ఇలా చిరంజీవి అడ్డుపడుతున్నాడని చెప్పి ఉదయ్‌ కిరణ్‌ ఆవేదన వ్యక్తం చేయడంతో తమ్మారెడ్డి భరద్వాజ ఆ సమయంలో ఓ సినిమా చేస్తున్నాడట. ``పోతే పోనీ` అనే సినిమా చేస్తున్నాను, అందులో నిన్ను పెట్టుకుంటాను. చిరంజీవి అడ్డుపడుతున్నాడంటున్నావ్‌ కదా, నా సినిమా చేస్తే, ఎలా ఆపుతాడో చూస్తాను` అని భరోసా ఇచ్చాడట తమ్మారెడ్డి. అయితే దానికి ఉదయ్‌ కిరణ్‌ స్పందిస్తూ, కథ మార్చాలని చెప్పాడట. ఈ కథ కాదు వేరే కథ చేద్దామన్నాడట. ఏదో పోనీలే అని ఛాన్స్ ఇద్దామనుకుంటే తనకే కండీషన్స్ పెట్టాడని తెలిపారు తమ్మారెడ్డి భరద్వాజ. `నేను ఒక సినిమా చేస్తున్నాను, ఆ సమయంలో నీకు కష్టం వచ్చిందని వచ్చావ్‌, నేను ఆఫర్‌ చేశాను, నేను తీసే సినిమాలో వేరే అబ్బాయిని తీసేసి నిన్ను పెడుతున్నాను. ఛాన్స్ ఇవ్వడమే అక్కడ ఎక్కువ. నీ కోసం కథ ఎందుకు మారుస్తాను` అని చెప్పాడు తమ్మారెడ్డి.

45
రాజమౌళి లాంటి దర్శకుడు కావాలన్న ఉదయ్‌ కిరణ్‌
Image Credit : our own

రాజమౌళి లాంటి దర్శకుడు కావాలన్న ఉదయ్‌ కిరణ్‌

తన వద్దనే కాదు మిగిలిన వారి వద్ద కూడా ఇలానే చెప్పాడట. అందుకే అవకాశాలు తగ్గి ఉంటాయని చెప్పారు తమ్మారెడ్డి. అతనికి మార్కెట్‌ ఉంటే అందరు అతని ఇంటి చుట్టూ తిరిగే వారు. లేకనే పెద్దగా రావడం లేదు. అలాంటి సమయంలో వచ్చిన ఆఫర్‌ చేసుకుంటూ వెళ్లాలి. వాటిలో ఏదో ఒకటి హిట్‌ అవుతుంది. మళ్లీ ఫామ్‌లోకి రావచ్చు. అలా చేసుకుంటూ వెళ్లాలిగానీ, అలాంటి సమయంలోనూ సెలక్టీవ్‌గా ఉంటే ఎవరు వస్తారని ప్రశ్నించారు తమ్మారెడ్డి భరద్వాజ. ఆ తర్వాత ఏదో ఒక సినిమా చేయమని చెప్పానని, అలాంటి సమయంలో రాజమౌళి లాంటి దర్శకుడు కావాలని, కేఎల్‌ నారాయణ వంటి నిర్మాతతో చేస్తానని చెప్పాడట. వాళ్లు నీతో చేయరని మొహం మీదనే చెప్పినట్టు తెలిపారు తమ్మారెడ్డి.

55
చిరంజీవి అడ్డుకున్నాడనేది పెద్ద భోగస్‌
Image Credit : youtube/@idream

చిరంజీవి అడ్డుకున్నాడనేది పెద్ద భోగస్‌

ఆ తర్వాత ల్యాంకో శ్రీధర్‌ ప్రొడక్షన్‌ లో `వియ్యాలవారి కయ్యాలు` మూవీ చేశాడు. కానీ సమయంలో చిరంజీవి ఏం అడ్డుకోలేదే. నిజంగానే చిరంజీవి చెబితే ల్యాంకో శ్రీధర్‌ ఆ సినిమా చేసేవాడు కాదు, కానీ చేశాడంటే, అలాంటిది లేదనే కదా అర్థం. కాకపోతే ఆ మూవీ పెద్దగా ఆడలేదు. ఇలా వచ్చిన ఆఫర్లు చేసుకుంటూ వెళితే రవితేజకి `ఇరుముడి` పడ్డట్టు మంచి సినిమా పడేది. మళ్లీ ఫామ్‌లోకి వచ్చేవాడు, కానీ అలా చేయలేదని ఉదయ్‌ కిరణ్‌ నిజ స్వరూపం బయటపెట్టాడు తమ్మారెడ్డి. అదే సమయంలో చిరంజీవినే ఆఫర్లు రాకుండా చేశారనేదాంట్లో నిజం లేదని, అవి కేవలం పుకారు మాత్రమే అని వెల్లడించారు. చిరంజీవి పేరు వాడితో ప్రమోషన్‌ వస్తుందని, పాపులర్‌ కావచ్చు అనే ఉద్దేశ్యంతోనే అలా చేశారని తెలిపారు. కారణాలు ఏదైనా మంచి నటుడిని తెలుగు ఆడియెన్స్ మిస్‌ అయ్యారని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఉదయ్ కిరణ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahesh Babu: మహేష్ బాబుతో సినిమా.. ఎగిరి గంతేసిన హీరోయిన్ ఎవరో తెలుసా? సూపర్ స్టార్ లక్కీ బ్యూటీ
Recommended image2
Srinidhi Shetty: తన వయసు కంటే పెద్ద పాత్రలో కేజీఎఫ్ హీరోయిన్.. ఆదర్శ కుటుంబం లో శ్రీనిధి శెట్టి పాత్ర ఏంటో తెలుసా?
Recommended image3
Naga Chaitanya: నాగచైతన్య సీక్రెట్ డైట్ ప్లాన్.. రోజూ బ్రేక్ ఫాస్ట్, లంచ్ లో ఏం తింటాడో తెలుసా?
Related Stories
Recommended image1
Rukmini Vasanth Upcoming Movies: డ్రాగన్‌ బ్యూటీ చేతిలో అదిరిపోయే సినిమాలు.. రుక్మిణి వసంత్‌ మూవీస్‌ లిస్ట్
Recommended image2
Comedian Remuneration: గంటకు లక్ష రూపాయలు, స్టార్‌ హీరోలకు సమానంగా పారితోషికం తీసుకున్న కమెడియన్‌ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved