MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Mahesh Babu: మహేష్ బాబుతో సినిమా.. ఎగిరి గంతేసిన హీరోయిన్ ఎవరో తెలుసా? సూపర్ స్టార్ లక్కీ బ్యూటీ

Mahesh Babu: మహేష్ బాబుతో సినిమా.. ఎగిరి గంతేసిన హీరోయిన్ ఎవరో తెలుసా? సూపర్ స్టార్ లక్కీ బ్యూటీ

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకి జంటగా అవకాశం వస్తే ఏ హీరోయిన్ కాదంటుంది. సూపర్ స్టార్ తో జోడీ కట్టడానికి బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఎదురు చూస్తుంటారు? అటువంటి అవకాశమే వచ్చింది ఓ నటికి.. విషయం తెలియగానే ఎగిరి గంతేసిందట కూడా. ఎవరా హీరోయిన్?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 28 2026, 12:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ప్లాప్స్ నుంచి బయటపడ్డ మహేష్ బాబు..
Image Credit : Instagram

ప్లాప్స్ నుంచి బయటపడ్డ మహేష్ బాబు..

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన పొలిటికల్ యాక్షన్ డ్రామా 'భరత్ అనే నేను. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ బాబు నటన అభిమానులను, ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. భరత్ అనే నేను సినిమా ముందు వరకూ వరుసగా ప్లాప్ సినిమాలు చూసిన సూపర్ స్టార్ ఈ మూవీ తరువాత నుంచి వరుసగా హిట్లు కొడుతూనే ఉన్నాడు . భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా నటించిన కియారా అద్వానీ అమాయకత్వం, అందం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలో కియారాను తీసుకోడానికి వెనుక ఓ కారణం ఉందన్నారు దర్శకుడు కొరటాల.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
స్టార్ హీరోయిన్ కాకుండా కొత్త ముఖం ఎందుకు?
Image Credit : Asianet News

స్టార్ హీరోయిన్ కాకుండా కొత్త ముఖం ఎందుకు?

ఈ సినిమాకు మహేష్ బాబు జోడీగా కియారా అద్వానీని ఎలా ఎంపిక చేశారనే విషయాలపై దర్శకుడు కొరటాల శివ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాలో హీరో ముఖ్యమంత్రి (సీఎం) హోదాలో ఉంటాడని, అలాంటి శక్తివంతమైన పాత్ర పక్కన ఇప్పటికే గుర్తింపు పొందిన స్టార్ హీరోయిన్‌ను పెడితే ఆ సీన్ అంతగా అతకదని కొరటాల శివ భావించారు. "ఒక ముఖ్యమంత్రి అత్యంత సాధారణమైన, మధ్యతరగతికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అనే ఫీలింగ్ ప్రేక్షకులకు రావాలి. దానికి స్టార్‌డమ్ లేని, అంతగా పరిచయం లేని కొత్త ముఖం అయితేనే పర్ఫెక్ట్‌గా ఉంటుందని మేము ముందుగానే నిర్ణయించుకున్నాం" అని కొరటాల అన్నారు.

34
ఎగిరి గంతేసిన హీరోయిన్
Image Credit : kiara advani /instagram

ఎగిరి గంతేసిన హీరోయిన్

మహేష్ బాబు సరసన ఫ్రెష్ ఫేస్ కోసం వెతుకుతున్న సమయంలో దర్శకుడికి హిందీ చిత్రం 'ఎం.ఎస్. ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ' గుర్తొచ్చింది. ఈ సినిమాలో ధోనీ భార్య సాక్షి పాత్రలో కనిపించిన కియారా అద్వానీ గుర్తుకు రాగానే.. ఆడిషన్స్ కోసం అప్రోచ్ అయ్యారు. కియారా రూపం ఎంతో హోమ్‌లీగా, గ్లామరస్‌గా ఉండటమే కాకుండా ఆమె అద్భుతమైన నటి కూడా కావడంతో వెంటనే సంప్రదించారు.

ఈ సినిమా కథ చెప్పడానికి టీమ్ ఆమె దగ్గరకు వెళ్లినప్పుడు, కేవలం అర్ధగంటలోనే కథ విన్న కియారా అద్వానీ ఎంతో ఉత్సాహపడిపోయారట. సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన నటించే అవకాశం, అందులోనూ అంతటి బలమైన కథ దక్కడంతో ఎలాంటి ఆలోచన లేకుండా వెంటనే ఓకే చెప్పేశారని కొరటాల శివ తెలిపారు. ఆ వెంటనే ఫోటోషూట్ నిర్వహించగా, మహేష్ పక్కన కియారా అద్వానీ జోడీ పర్ఫెక్ట్‌గా సరిపోయిందని నిర్ణయించుకున్నారు.

44
సినిమాలో నిలిచిపోయే సన్నివేశాలు
Image Credit : Asianet News

సినిమాలో నిలిచిపోయే సన్నివేశాలు

భరత్ అనే నేను సినిమాలో హీరో మాట్లాడే ఫోన్ కాల్స్, వారి రిలేషన్‌షిప్ గురించి ప్రెస్ మీట్‌లో మహేష్ బాబు చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ ఐదేళ్లయినా గుర్తుండిపోయేలా ఉంటాయని దర్శకుడు కొరటాల అన్నారు. ఏది ఏమైనా, సరైన పాత్రకు సరైన నటిని ఎంచుకోవడం వల్లే 'భరత్ అనే నేను' సినిమా ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఫీలింగ్‌ను అందించి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని కొరటాల అన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Srinidhi Shetty: తన వయసు కంటే పెద్ద పాత్రలో కేజీఎఫ్ హీరోయిన్.. ఆదర్శ కుటుంబం లో శ్రీనిధి శెట్టి పాత్ర ఏంటో తెలుసా?
Recommended image2
Naga Chaitanya: నాగచైతన్య సీక్రెట్ డైట్ ప్లాన్.. రోజూ బ్రేక్ ఫాస్ట్, లంచ్ లో ఏం తింటాడో తెలుసా?
Recommended image3
9th క్లాస్ ఫెయిల్ అయిన హీరోయిన్ కు ఇంగ్లీష్ నేర్పించి వెంకటేష్, నాగార్జున, ఎవరా హీరోయిన్?
Related Stories
Recommended image1
Aditya 369 Review: బాలకృష్ణకు గెస్ట్ రోల్ ఇద్దామనుకున్నారు.. అరవ హీరోతో చేయాల్సిన సినిమా.. ఆదిత్య 369 మూవీ రివ్యూ
Recommended image2
Thriller Movies: ఒళ్లు గగుర్పొడిచే 5 థ్రిల్లర్ సినిమాలు.. క్లైమాక్స్ వరకు సస్పెన్స్ గ్యారెంటీ, ఎక్కడ చూడాలంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved