- Home
- Entertainment
- Rukmini Vasanth Upcoming Movies: డ్రాగన్ బ్యూటీ చేతిలో అదిరిపోయే సినిమాలు.. రుక్మిణి వసంత్ మూవీస్ లిస్ట్
Rukmini Vasanth Upcoming Movies: డ్రాగన్ బ్యూటీ చేతిలో అదిరిపోయే సినిమాలు.. రుక్మిణి వసంత్ మూవీస్ లిస్ట్
కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఇప్పుడు ఫుల్ బిజీ. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. జూనియర్ ఎన్టీఆర్, నివిన్ పౌలీ లాంటి స్టార్ హీరోల సరసన నటిస్తూ పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకుపోతోంది.

క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతున్న రుక్మిణి వసంత్
కన్నడ ఇండస్ట్రీలో ఇప్పుడు రుక్మిణి వసంత్ పేరు మార్మోగిపోతోంది. 'సప్త సాగరదాచే ఎల్లో', 'కాంతార: చాప్టర్ 1' సినిమాలతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు కన్నడ బోర్డర్ దాటి తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీల్లోనూ వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది.
కాంతర ఛాప్టర్ 1తో రుక్మిణికి పాన్ ఇండియా క్రేజ్
రుక్మిణి వసంత్ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆమె కెరీర్‌కు 'సప్త సాగరదాచే ఎల్లో' సినిమా పెద్ద టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత 'కాంతార: చాప్టర్ 1'లో ఛాన్స్ కొట్టేసి పాన్ ఇండియా లెవల్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఇతర భాషల నుంచి కూడా ఆమెను అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.
డ్రాగన్‌తో బిజీగా ఉన్న రుక్మిణి వసంత్
రుక్మిణి వసంత్ చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్టుల్లో తెలుగు సినిమా 'డ్రాగన్' ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రుక్మిణి హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరవ్వాలని ఆమె ప్లాన్ చేస్తోంది. దీనికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.
స్టార్ హీరోతో మలయాళంలోకి ఎంట్రీ
తెలుగు తర్వాత మలయాళ ఇండస్ట్రీలోనూ రుక్మిణి వసంత్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ కొత్త సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ప్రాజెక్టుతో సౌత్‌లో మరో పెద్ద ఇండస్ట్రీలోకి ఆమె అడుగుపెడుతోంది.
తమిళంలో రుక్మిణికి రెండు సినిమాలు
తమిళ ఇండస్ట్రీలో కూడా రుక్మిణి వసంత్ పేరు గట్టిగానే వినిపిస్తోంది. కోలీవుడ్‌లో ఆమె ఏకంగా రెండు సినిమాలు చేస్తోందని టాక్ నడుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టులకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇంకా రావాల్సి ఉంది.
కన్నడలోనూ ఆఫర్లు
ఇతర భాషల్లో బిజీగా ఉన్నా రుక్మిణి వసంత్ కన్నడ ఇండస్ట్రీని మర్చిపోలేదు. సీనియర్ నటి మాలాశ్రీతో కలిసి 'మంగళ గౌరి' అనే సినిమాలో ఆమె నటిస్తోంది. ఈ సినిమాలో రుక్మిణి ఎలాంటి పాత్రలో కనిపించబోతోందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అన్ని భాషల సినిమాలతో బిజీగా రుక్మిణి
రుక్మిణి వసంత్ సినిమాల లిస్ట్ ఇక్కడితో అయిపోలేదు. ఆమె చేతిలో మరో కన్నడ సినిమా కూడా ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ త్వరలోనే బయటకు రానున్నాయి. కన్నడలో స్టార్‌డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనూ సత్తా చాటేందుకు రెడీ అయింది. వరుస ఆఫర్లు ఆమె కెరీర్ స్పీడ్‌కు నిదర్శనం.

