- Home
- Entertainment
- Naga Chaitanya: నాగచైతన్య సీక్రెట్ డైట్ ప్లాన్.. రోజూ బ్రేక్ ఫాస్ట్, లంచ్ లో ఏం తింటాడో తెలుసా?
Naga Chaitanya: నాగచైతన్య సీక్రెట్ డైట్ ప్లాన్.. రోజూ బ్రేక్ ఫాస్ట్, లంచ్ లో ఏం తింటాడో తెలుసా?
Naga Chaitanya: సినిమాల విషయంలోనే కాదు.. ఫిట్ నెస్ డైట్ విషయంలో కూడా నాగచైతన్య చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆయన టోన్డ్ బాడీ సీక్రెట్ ఏంటో తెలుసా? ముఖ్యంగా డైట్ విషయంలో చైతూ తీసుకునే జాగ్రత్తలు ఏంటి?

నాగచైతన్య ఫిట్‌నెస్ సీక్రెట్ డైట్ ప్లాన్
నాగేశ్వరరావు, నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య.. స్టార్ హీరోల లిస్ట్ లో చేరడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. మంచి మంచి కథలను సెలెక్ట్ చేసుకుని.. అద్భుతమైన సినిమాలు చేస్తున్నాడు నాగచైతన్య. నటనతోనే కాకుండా, ఫిట్‌నెస్, సిక్స్ ప్యాక్ బాడీ, స్టైలిష్ లుక్స్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు చైతు. ఆయన తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేయడమే కాకుండా, ఎంతో క్రమశిక్షణతో కూడిన ఆహార నియమాలను (డైట్ ప్లాన్) పాటిస్తారు.
నాగచైతన్య రోజువారీ డైట్ ప్లాన్
గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో.. నాగచైతన్య తన రోజువారీ డైట్ ప్లాన్ గురించి వివరించాడు. ఆయన ఆహార అలవాట్ల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రోజు ఎం తింటారు, ఎంత తింటే ప్రోటీన్, ఫైబర్, వస్తుంది అనేది వివరంగా చెప్పారు. నాగచైతన్య చెప్పిన దాని ప్రకారం.. ఉదయం టిఫిన్ గా ప్రోటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్ ఉండేలా చూసుకుంటారు. ఉదయం పూట శరీరానికి అవసరమైన పోషకాలను అందించేందుకు నాగచైతన్య వెజిటేరియన్ బ్రేక్‌ఫాస్ట్‌ను తీసుకుంటాడు. చైతు బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ (Oats) ఉంటాయి. రోజంతా పనిచేయడానికి, యాక్టీవ్ గా ఉండటానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు , పీచు పదార్థాలను ఓట్స్ ద్వారా పొందుతారు.
ఏది తిన్నా లెక్క ప్రాకారమే..
కొన్ని సార్లు టిఫిన్ లో తాజా పండ్లు (Fruits) ను కూడా చేర్చుకుంటాడు చైతు.. ఇవి శరీరానికి విటమిన్లను , యాంటీఆక్సిడెంట్లు అందించడానికి ఉపయోగపడతాయి. వీటితో పాటు ప్రోటీన్ షేక్స్ (Protein Shakes) కూడా తీసుకుంటాడు. కండరాల బలానికి, బాడీ సెట్ అవ్వడానికి పొద్దున్నే ప్రోటీన్ షేక్ తాగుతారు. ఇది ఉదయం ప్లాన్... పరిస్థితులను బట్టి.. పదార్ధాలు మారతాయి కానీ.. తన లెక్కల ప్రకారం ఎంత ప్రోటీన్ తీసుకోవాలో అంతే తీసుకుంటాడు.
మధ్యాహ్న భోజనం మ్యాక్రో న్యూట్రీషియన్ డైట్
ఇక మధ్యాహ్న భోజనం విషయానికి వస్తే.. నాగ చైతన్య మ్యాక్రో న్యూట్రీషియన్ డైట్ ను ఫాలో అవుతాడు. మధ్యాహ్న భోజనంలో నాగచైతన్య Balanced Diet ను తీసుకుంటాడు. ఆయన తీసుకునే ఆహార పరిమాణం చూసుకుంటే.. 120 గ్రాముల ప్రోటీన్ (Protein) ఉంటుంది. కండరాల పుష్టికి చికెన్ బ్రెస్ట్ (Chicken Breast) లేదా చేపలు (Fish) వంటి మాంసాహారాన్ని 120 గ్రాములు మాత్రమే తీసుకుంటాడు. దీనితో పాటు శరీరానికి కావలసిన ఎనర్జీ అందించడానికి బ్రౌన్ రైస్, క్వినోవా (Quinoa) లేదా చిరుధాన్యాలు (Millets) వంటి హెల్దీ కార్బోహైడ్రేట్లను 80 గ్రాములు మాత్రమే తింటాడు. ఇక 100 గ్రాముల ఫైబర్ (Fiber)ను జీర్ణక్రియ సరిగ్గా సాగడానికి, ఆరోగ్యకరమైన జీవక్రియ కోసం కూరగాయలు, పీచు పదార్థాలను (ఫైబర్) ఈ మీల్ లో ఆడ్ చేసుకుంటాడు నాగచైతన్య.
నాగచైతన్య సినిమాల విషయానికి వస్తే..
అనారోగ్యకరమైన జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ, శరీరానికి అవసరమైన ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు ..ఫైబర్ సరైన పరిమాణంలో ఉండేలా నాగచైతన్య తన డైట్ ప్లాన్ చేసుకుంటాడు. సరైన వ్యాయామంతో పాటు క్రమశిక్షణ కలిగిన డైట్‌ను పాటించడం వల్లే ఆయన ఎప్పుడూ.. ఫిట్‌గా, ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు. యూత్ కు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇక నాగచైతన్య సినిమాల విషయానికి వస్తే.. పోయిన ఏడాది తండేల్ సినిమాతో హిట్ కొట్టిన చైతూ.. ప్రస్తుతం కార్తీక్ దండు డైరెక్షన్ లో వృష కర్మ సినిమాలో నటిస్తున్నాడు. ఈమూవీ సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేస్తామంటున్నారు. అఫీషియల్ గా మాత్రం టీమ్ ఫైనల్ చేయలేదు.

