MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Comedian Remuneration: గంటకు లక్ష రూపాయలు, స్టార్‌ హీరోలకు సమానంగా పారితోషికం తీసుకున్న కమెడియన్‌ ఎవరో తెలుసా?

Comedian Remuneration: గంటకు లక్ష రూపాయలు, స్టార్‌ హీరోలకు సమానంగా పారితోషికం తీసుకున్న కమెడియన్‌ ఎవరో తెలుసా?

Comedian Remuneration: సాధారణంగా కమెడియన్లకి పెద్దగా పారితోషికాలు ఉండవు. కానీ ఒక్కరికి మాత్రం గంటకు లక్ష రూపాయలు పారితోషికం తీసుకునేవారట. అలా ఆయన ఐదు వందల కోట్లు సంపాదించారట.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 27 2026, 01:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కమెడియన్లకి ఫుల్‌ డిమాండ్
Image Credit : stockPhoto

కమెడియన్లకి ఫుల్‌ డిమాండ్

తెలుగు సినిమాల్లో కమేడియన్‌కి ప్రత్యేక స్థానం ఉంటుంది. వాళ్లు లేనిదే సినిమా లేదని చెప్పొచ్చు. అదే సమయంలో అంతే బాగా నవ్వులు పూయిస్తారు. అయితే కమెడియన్లకి ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. ఎంత మంది కొత్త హాస్యనటులు వచ్చినా బాగా చేయగలిగాలివారికి డిమాండ్‌ కచ్చితంగా ఉంటుంది. అయితే ఒక స్టార్‌ కమెడియన్‌ మాత్రం తనకు ఉన్న డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని ఏకంగా గంటకు లక్ష పారితోషికం తీసుకునేవారట. మరి ఆ కమెడియన్‌ ఎవరు? అంత పారితోషికం తీసుకోవడానికి కారణం ఏంటనేది చూస్తే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
గంటకు లక్ష పారితోషికం తీసుకున్న కమెడియన్‌ బ్రహ్మానందం
Image Credit : youtube/@youwemedia

గంటకు లక్ష పారితోషికం తీసుకున్న కమెడియన్‌ బ్రహ్మానందం

తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకున్న కమెడియన్‌ బ్రహ్మానందం. అత్యధిక పారితోషికం తీసుకునే కమెడియన్‌ ఆయనే అని తెలుసు. కానీ గంటకు లక్ష రూపాయలు తీసుకోవడమే ఆశ్చర్యపరుస్తోంది. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినిమాని శాసించారు బ్రహ్మీ. ఆయన లేకపోతే సినిమా లేదనేలా సాగింది. ఆయన డేట్స్ కోసం స్టార్‌ హీరోలు కూడా వెయిట్‌ చేయాల్సిన పరిస్థితి ఉండేదట. అంత బిజీగా ఉండేవారట. ఉదయం ఒక సినిమా, మధ్యాహ్నం మరో మూవీ, సాయంత్రం ఇంకో సినిమా షూటింగ్ లో పాల్గొనేవారట.

34
స్టార్‌ హీరోల స్థాయిలో రెమ్యూనరేషన్‌ తీసుకున్న బ్రహ్మానందం
Image Credit : Asianet News

స్టార్‌ హీరోల స్థాయిలో రెమ్యూనరేషన్‌ తీసుకున్న బ్రహ్మానందం

తనకు ఆ స్థాయిలో డిమాండ్‌ ఉండేదని, అందుకే ఆ స్థాయిలో పారితోషికం తీసుకునేవారని, సీనియర్‌ జర్నలిస్ట్, రైటర్‌ ఒకరు వెల్లడించారు. అప్పట్లో గంటకు లక్ష రూపాయలు అంటే రోజుకి పది గంటలు పనిచేస్తే, పది లక్షలు. ఒక్క మూవీ పది, ఇరవై రోజులు షూటింగ్‌ జరిగితే ఆ సినిమా నుంచి సుమారు ఇరవై ముప్పై లక్షలు సంపాదించేశారు. అలా నెలకు రెండు మూడు సినిమాలు కంప్లీట్‌ చేసేవారు. ఈ లెక్కన బ్రహ్మీకి రెండు మూడు నెలల్లో కోటికిపైగానే పారితోషికం వచ్చేది. అదే హీరో ఒక్క మూవీ కోసం మూడు నాలుగు నెలలు కేటాయించాల్సి వచ్చేది. కానీ వాళ్లకి వచ్చేది కూడా కోటి లోపే. అంటే బ్రహ్మానందం.. స్టార్‌ హీరోలకు సమానంగా పారితోషికం తీసుకున్నారని చెప్పొచ్చు.

44
ఆ స్థాయి పారితోషికం తీసుకోవడం వెనుక బలమైన కారణం
Image Credit : Asianet News

ఆ స్థాయి పారితోషికం తీసుకోవడం వెనుక బలమైన కారణం

దీంతో అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకునే కమెడియన్‌గా బ్రహ్మానందం రికార్డు సృష్టించారు. దీని వల్ల ఆయన భారీగానే ఆస్తులు సంపాదించారు. బ్రహ్మీ ఆస్తులు రూ.500కోట్లకుపైగానే ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే బ్రహ్మానందం పారితోషికం పెంచడానికి మరో కారణం ఉందట. అ సమయంలో కొత్తగా చాలా మంది దర్శకులు వచ్చేవారట. వారికి అనుభవం ఉండేది కాదు, దీంతో డేట్స్ వేస్ట్ చేసేవారట. దాన్ని కంట్రోల్‌ చేయడం కోసం బ్రహ్మానందం వంటి సీనియర్‌ నటులు పారితోషికం పెంచేవారట. అలా అయినా పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో సినిమాలు చేస్తారనేది వారి ఉద్దేశ్యం. అయినా కొందరు డిలే చేసేవారని, దీంతో బ్రహ్మానందానికి ఎక్కువ పారితోషికం ఇచ్చుకోవాల్సి వచ్చేదని చెప్పారు. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు ఇండస్ట్రీని ఏలిన ఆయన ఇప్పుడు డౌన్‌ అయ్యారు. పెద్దగా ఆఫర్లు లేవు. అడపాదడపా సినిమాల్లో మెరుస్తున్నారు. కొత్త కమెడియన్లు దూసుకొచ్చిన నేపథ్యంలో బ్రహ్మానందం ప్రభావం తగ్గిపోయిందని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rukmini Vasanth Upcoming Movies: డ్రాగన్‌ బ్యూటీ చేతిలో అదిరిపోయే సినిమాలు.. రుక్మిణి వసంత్‌ మూవీస్‌ లిస్ట్
Recommended image2
Ktr Review on Paradise: నాని ప్యారడైజ్‌ మూవీపై కేటీఆర్‌ రివ్యూ.. కానీ అసలు విషయం చెప్పలేదేంటి?
Recommended image3
Aditya 369 Review: బాలకృష్ణకు గెస్ట్ రోల్ ఇద్దామనుకున్నారు.. అరవ హీరోతో చేయాల్సిన సినిమా.. ఆదిత్య 369 మూవీ రివ్యూ
Related Stories
Recommended image1
Same Concept Movies: ఒకే కాన్సెప్ట్ తో అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌, నాని సినిమాలు.. నేచురల్‌ స్టార్‌ రికార్డు సృష్టిస్తాడా?
Recommended image2
Ktr Review on Paradise: నాని ప్యారడైజ్‌ మూవీపై కేటీఆర్‌ రివ్యూ.. కానీ అసలు విషయం చెప్పలేదేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved