బాలయ్య కంటే ముందు పద్మభూషణ్ గౌరవం పొందిన తెలుగు హీరోలు ఎవరో తెలుసా..?
తెలుగు రాష్ట్రాలకు పద్మా అవార్డ్ ల విషయంలో ఎప్పుడూ అన్యాయమే జరుగుతోంది. మరీ ముఖ్యంగా సినిమా వారికి ఈ విషయంలో అమమానం తప్పడంలేదు. ఈక్రమంలో బాలయ్యకు పద్మ భూషన్ రావడంతో అంతా దిల్ ఖుష్ అవుతున్నారు. కాగా ఇంత వరకూ తెలుగు నటులలో పద్మ భూషన్ సాధించిన వారు ఎవరు..?

2025 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డ్ లలో ప్రతీసారి లాగానే ఈసారి కూడా తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ఒరిగిందేమి లేదు. 139 పద్మ అవార్డుల్లో అత్యధికంగా మహారాష్ట్ర(14) రాగా ఉత్తర ప్రదేశ్ నుంచి 10 మంది, కర్ణాటక, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ నుంచి 9 మంది చొప్పున, బిహార్, గుజరాత్ నుంచి 8 మందికి ఈ పురస్కారాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏపీకి 5, తెలంగాణ నుంచి ఇద్దరికి పద్మ అవార్డ్ లు దక్కాయి. అస్సాం, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఐదుగురు చొప్పున ఈ అవార్డులకు ఎంపికయ్యారు.
Also Read: పద్మభూషన్ పై స్పందించిన బాలకృష్ణ, వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా పద్మ అవార్డులను ప్రకటిస్తుంది సెంట్రల్ గవర్మెంట్.. వివిధ రంగాలలో సేవ చేసిన వారికి స్థాయిని బట్టి ఇవి ప్రకటిస్తుంటారు. కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ, ప్రజా జీవితాలు, ఇలాంటి రంగాలలో విశిష్ట సేవ చేసినవారికి ఈ అవార్టులను ప్రకటిస్తుంది. పద్మశ్రీ , పద్మభూషణ్, పద్మ విభూషణ్, పురస్కారాల పేరిట అవార్టులను ప్రకటిస్తుంది. వీటి తరువాత అత్యున్నతమైనది భారత రత్న.
Also Read: సినిమా వాళ్ళకు పద్మ అవార్డ్ ల పంట, బాలయ్య తో పాటు ఎవరెవరిని వరించాయంటే..?
ఇక ఆసారి సినిమా రంగం నుంచి పద్మ భూషణ్ నందమూరి నటసింహం బాలకృష్ణను వరించింది. అయితే ఇప్పటివరకు టాలీవుడ్ నటులలో చాలా తక్కువ మందికి ఈ అవార్డ్ వచ్చింది. అందులో పెద్దాయన ఎన్టీఆర్ కు 1968లో పద్మశ్రీ మాత్రమే వచ్చింది. కాని ఆయనకు భారత రత్నం అవార్డ్ ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తుంది.
Also Read: విజయ్ దేవరకొండ సినిమాలో అమితాబచ్చన్, ఏ పాత్ర చేయబోతున్నారో తెలుసా..?
ఇక పద్మ అవార్డ్ లు ఎక్కువగా పొందిన తెలుగు నటుడు అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు సినిమాకు ఎన్టీఆర్ ఒక కన్ను అయితే.. ఏఎన్నార్ మరో కన్ను. ఆయనకు 1968లో పద్మశ్రీ-, 1988లో పద్మ భూషణ్-, 2011లో పద్మ విభూషణ్ అవార్డ్ లు వరించాయి. దేశంలో అత్యున్నత రెండో అవార్డ్ వరకూ వెళ్ళారు ఏఎన్నారు.
Also Read: నాగార్జునతో అనిల్ రావిపూడి కామెడీ మూవీ, ఆ సినిమాకు రీమేక్ చేయబోతున్నారా..?
ఇక ఏఎన్నార్ తరువాత ఆ అదృష్ణం కృష్ణకు దక్కింది అని చెప్పాలి. హీరో కృష్ణకు 2009లో పద్మభూషణ్ అవార్డ్ తో సత్కరించారు. అయితే కృష్ణకు ఒక రకంగా లేట్ గా ఈ అవార్డ్ వచ్చింది. ఆ తరం నటులలో గొప్పనటులుగా పేరు తెచ్చుకున్న కైకాల సత్యనారయణ, కాంతారావు లాంటి గ్రేట్ యాక్టర్స్ కు పద్మా అవార్డ్ లు రాకపోవడం బాధాకరం.
ఇక ఆతరువాతి జనరేషన్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా భారత అత్యున్నత రెండో పురస్కారం వరకూ వెళ్ళారు. చిరంజీవికి 2006లోపద్మభూషణ్-, -2024లో పద్మ విభూషణ్ అవార్డ్ లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇక తాజాగా నందమూరి బాలకృష్ణకు-2025లో పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. ఇక టాలీవుడ్ నటులతో చాలామంది పద్మశ్రీలు అందుకున్నారు. కాని ఏది ఏమైనా.. ఇతర ఇండస్ట్రీలలో నటులతో పోలిస్తే.. తెలుగు నటులకు పద్మా అవార్డ్ లు చాలా తక్కువే అని చెప్పాలి.