పద్మభూషన్ పై స్పందించిన బాలకృష్ణ, వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు
రిపబ్లిక్ డే సందర్బంగా పద్మా అవార్డ్ లు ప్రకటించింది క్రేంద్రప్రభుత్వం. అందులో సినీపరిశ్రమకు చెందిన కొందరు ఉండగా.. బాలయ్య బాబును పద్మ భూషన్ వరించింది. ఈక్రమంలో ఆయన ఈ అవార్డ్ పై స్పందించారు.

పద్మ భూషన్ రావడంపై స్పందించారు నటసింహం బాలయ్యబాబు. ఈసందర్భంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ఆయన ఈ విధంగా స్పందిచారు. నాకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా, ఈ అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. నా ఈ సుధీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు, కుటుంబ సభ్యులకు మరియు యావత్ చలనచిత్ర రంగానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
Also Read: సినిమా వాళ్ళకు పద్మ అవార్డ్ ల పంట, బాలయ్య తో పాటు ఎవరెవరిని వరించాయంటే..?
నా తండ్రిగారైన స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుండి ఆయన వారసుడిగా నేటి వరకు నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న నా అభిమానులకు, నాపై తమ విశేష ఆధారాభిమానాలు కురిపిస్తున్న అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉండగలనని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నాతోటి పద్మ అవార్డు గ్రహీతలందరికీ కూడా నా అభినందనలు అందిస్తున్నాను. అప్పుడు... ఇప్పుడు... ఎల్లప్పుడూ... సదా మీ నందమూరి బాలకృష్ణ అని ముగించారు.
Also Read: నాగార్జునతో అనిల్ రావిపూడి కామెడీ మూవీ
తెలుగు రాష్ట్రాల నుంచి స్టార్ హీరో బాలకృష్ణ ను పద్మ భూషన్ అవార్డ్ వరించింది. సినిమా రంగంలో దాదాపు 50 ఏళ్ళుగా ఆయన చేస్తున్న సేవకు గానే బాలయ్య ను పద్మభూషన్ తో సత్కరించబోతున్నారు. తాతమ్మ కల సినిమాతో బాలనటుడిగా అడుగు పెట్టి.. హీరోగా కెరీర్ ను కంటీన్యూ చేస్తూ.. దాదాపు 100 కు పైగా సినిమాల్లో నటించారు. తనకంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించారు బాలయ్య.. పొలిటికల్ గా కూడా యాక్టీవ్ గా ఉన్నాడు.
Also Read: 40 ఏళ్ళు దాటినా పెళ్ళి చేసుకోని హీరోయిన్లు, అనుష్క నుంచి టబు వరకు.. బ్యాచిలర్ బ్యూటీస్
మూడు సార్లు ఎమ్మెల్యేగా వరుసగా గెలిచిన ఆయన.. అటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సమాజ సేవ కూడా చేస్తున్నాడు. ఇక బాలయ్య తో పాటుగా తమిళ స్టార్ హీరో అజిత్, మలయాళ తార, ఒకప్పటిస్టార్ హీరోయిన్ శోభన, కన్నడ నటుడు అనంత్ నాగ్, బాలీవుడ్ స్టార్ శేఖర్ కపూర్ లను పద్మ భూషన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇక బాలీవుడ్ స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ లాంటి కొద్దిమంది సినిమా స్టార్స్ కు పద్మశ్రీ లభించింది.
Also Read: బాలకృష్ణ కెరీర్ లో భారీ కలెక్షన్స్ సాధించిన టాప్ 10 సినిమాలు