విజయ్ దేవరకొండ సినిమాలో అమితాబచ్చన్, ఏ పాత్ర చేయబోతున్నారో తెలుసా..?
విజయ్ దేవరకొండ సినిమాలో అమితాబచ్చన్. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వార్త. ఇంతకీ ఇందులో నిజమెంత..? బిగ్ బాస్ ఏ పాత్రలో నటించబోతున్నారు.

Actor Vijay Deverakonda
పాపం విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమా తరువాత ఒక్కటంటే ఒక్క మంచి హిట్ లేదు. ఎంత ప్రయత్నం చేసినా..ఎన్ని ప్రయోగాలు చేసినా.. విజయ్ దేవరకొండకు సాలిడ్ హిట్ పడలేదు. కొంత లో కొంత సమంత జతగా చేసిన ఖుషి సినిమా పర్వాలేదు అనిపించినా.. అది కూడా పెద్దగా కమర్షియల్ హిట్ అవ్వలేదు అందులో కూడా సమంతకు పేరు వచ్చింది కాని.. విజయ్ దేవరకొండకు ఒరిగిందేమి లేదు. ఇక రీసెంట్ గా ఫ్యామిలీ హీరోగా ఫ్యామిలీ స్టార్ సినిమాతో వచ్చాడు విజయ్ అది కూడా తీవ్రంగా నిరాశపరిచింది.
Also Read: దేవర సీక్వెల్ కథలో భారీ మార్పులు, అల్లు అర్జున్ పుష్ప 2 ఫార్ములాను ఫాలో అవుతోన్న జూనియర్ ఎన్టీఆర్.
Family Star Review
దాంతో దిక్కు తోచనిపరిస్థితుల్లో ఉన్నాడు రౌడీ హీరో. ఒకప్పుడు ఇండస్ట్రీ అంతా విజయ్ దేవరకొండ పేరుమారుమోగిపోయింది. ఓ మూడేళ్ళు విజయ్ జపం చేశారు ఆడియన్స్ అమ్మాయిల్ అయితే పిచ్చెక్కిపోయారు. కాని ఇప్పుడు విజయ్ ఎక్కడా కనిపించడంలేదు. ఇక ఆ విషయం పక్కన పెడితే..మంచి హిట్ కోసం ఎదరు చూస్తున్న విజయ్ వరుసగా తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు.
Also Read: నాగార్జునతో అనిల్ రావిపూడి కామెడీ మూవీ, ఆ సినిమాకు రీమేక్ చేయబోతున్నారా..?
ఈక్రమంలోనే ఆయన శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ ‘రాహుల్ సంకృత్యాన్’ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇదే డైరెక్టర్ తో గతంలో టాక్సీవాల సినిమా చేశాడు విజయ్ దేవరకొండ. ఈసినిమా బాగుంది కాని కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. ఇక ప్రస్తుతం విజయ్ తో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మరో అతిథి పాత్ర ఉందని, ఆ పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో నటిస్తున్నాడని ఆ మధ్య వార్తలు వైరల్ అయ్యాయి.
Also Read: బాలకృష్ణ కెరీర్ లో భారీ కలెక్షన్స్ సాధించిన టాప్ 10 సినిమాలు
కాగా తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఆ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపిస్తున్నాడని టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. ఈమూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యింది. ఇక రెగ్యులర్ షూటింగ్ ను వచ్చే నెల రెండో వారం నుంచి స్టార్ట్ చేయాలని చూస్తున్నారట. ఈ సినిమాతో మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు విజయ్ దేవరకొండ. గెటప్ ను కంప్లీట్ గా మార్చబోతున్నాడట. అంతే కాదు సరికొత్త గెటప్ లో కనిపిస్తాడని.. ముఖ్యంగా ఈసినిమా కథ. 1850 కాలం నాటిదిగా చెపుతున్నారు.
Also Read: 40 ఏళ్ళు దాటినా పెళ్ళి చేసుకోని హీరోయిన్లు, అనుష్క నుంచి టబు వరకు.. బ్యాచిలర్ బ్యూటీస్
రాహుల్ ఇలాంటి కథలను చాలా జాత్రత్తగా హ్యాండిల్ చేస్తాడు. -ఈ మూవీలో చాలా వేరియేషన్స్ చూపించబోతున్నారట. పైగా ఆర్నాల్డ్ వోస్లూ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మరి నిజంగానే ఆయన ఈ సినిమాలో నటిస్తే కచ్చితంగా ఈ సినిమాకి ప్లస్ అవుతుంది. ఎంతైనా ‘రాహుల్ సంకృత్యాన్’ దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో, విజయ్ దేవరకొండ సినిమా పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.