నాగార్జునతో అనిల్ రావిపూడి కామెడీ మూవీ, ఆ సినిమాకు రీమేక్ చేయబోతున్నారా..?
సీనియర్ హీరోలందరితో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇక త్వరలో నాగార్జునతో కూడా సినిమా చేస్తాడట.

టాలీవుడ్ సీనియర్ హీరోలందరితో సినిమాలు చేస్తున్నాడు యంగ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పటికే వెంకటేష్, బాలయ్యలకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన ఈ దర్శకుడు త్వరలో మెగాస్టార్ చిరంజీవితో కూడా సినిమా చేయబోతున్నాడు. ఈసినిమా త్వరలో స్టార్ట్ కాబోతున్నట్టు సమాచారం. అయితే రీసెంట్ గా ఆయన వెంకటేష్ తోముచ్చటగా మూడో సినిమా చేశాడు.
Also Read: బాలకృష్ణ కెరీర్ లో భారీ కలెక్షన్స్ సాధించిన టాప్ 10 సినిమాలు
#Venkatesh Daggubati, #Anil Ravipudi, #VenkyAnil3, #Dil raju
సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ సంక్రాంతి కానుకగా వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయ్యింది. 200 కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక చిరంజీవితో సినిమా రెండు మూడు వారాల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈక్రమంలో టాలీవుడ్ సీనియర్ హీరోలలో ముగ్గరితో అనిల్ సినిమా చేశాడు.. ఇక కింగ్ నాగార్జునతో మాత్రం ఆయన సినిమా చేయలేదు.
Also Read: చిరంజీవిని ఏదో అన్నాడని.. కుట్లు పడేలా కొట్టిన అల్లు అరవింద్, బావ అంటే ఎందుకంత ప్రేమ.
మరి నాగ్ తో సినిమా చేస్తారా అని అనిల్ ను ప్రశ్నించారు మిడియా ప్రతినిథులు. అనిల్ మాట్లాడుతూ.. నాగ్ సర్ తో కూడా సినిమా చేయాలి. దానికి కాస్త టైమ్ పడుతుంది. నాగార్జున గారితో హలో బ్రదర్ లాంటి కామెడీ ఎంటర్టైనర్ ను చేయాలని ఉంది. దాని కి తగ్గట్టు లైన్ కూడా నా దగ్గర ఉందని ఆయన అన్నారట. అంతే కాదు చిరంజీవితో సినిమా తరువాత అనిల్ రావిపూడి నెక్ట్స్ నాగార్జునతోనే సినిమా చేయబోతున్నట్టు సమాచారం.
Also Read: 40 ఏళ్ళు దాటినా పెళ్ళి చేసుకోని హీరోయిన్లు, అనుష్క నుంచి టబు వరకు.. బ్యాచిలర్ బ్యూటీస్
ఇక హలో బ్రదర్ లాంటి సినిమా కాదు హలో బ్రదర్ నే రీమేక్ చేయబోతున్నాడంటున్నారు నెటిజన్లు. ఒక వేళ అనిల్ రావిపూడి హలో బ్రదర్ కు సీక్వెల్ సినిమా చేస్తే అది ఓరేంజ్ లో హిట్ అవ్వడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఇక అంతకు ముందు చిరంజీవితో అనిల్ ఎలాంటి సినిమా చేస్తారా అని అంతా ఎదురు చూస్తున్నారు.