- Home
- Entertainment
- Tollywood Heroes New look: ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ తో పాటు గుర్తుపట్టకుండా మారిపోయిన స్టార్స్ ఎవరు..?
Tollywood Heroes New look: ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ తో పాటు గుర్తుపట్టకుండా మారిపోయిన స్టార్స్ ఎవరు..?
మన తెలుగు హీరోలు సినిమా కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు. ఎంత రిస్క్ చేయడానికైనా వెనక్కి తగ్గరు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకోసం ఎంతో కష్టపడుతున్నారు తెలుగు హీరోలు. అందుకే ఫ్యాన్స్ కు బోర్ కొట్టకుండా డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్నారు. ప్రభాస్ నుంచి మహేష్ వరకు గెటప్స్ చేంజ్ చేసిన స్టార్స్ ఎవరు..?
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఆడియన్స్ కు ... ఫ్యాన్స్ కు బోర్ కొట్టకుండా డిఫరెంట్ క్యారెక్టర్లు ట్రై చేస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరోలు. అందులో భాగంగా... తమ లుక్స్ ను కూడా ఛేంజ్ చేసుకుంటూ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్,ఎన్టీఆర్ లాంటి స్టార్స్ ప్రస్తుతం చేస్తున్న పని అదే. ఇంతకీ ఎవరెవరు ఏ ఏ గెటప్స్ లో కనిపిస్తున్నారంటే..?
Also Read: ఎన్టీఆర్,పవన్, వెంకటేష్, బాలయ్య అయిపోయారు రామ్ చరణ్ మొదలెట్టాడు, RC16 కోసం చరణ్ ప్రయోగం.
లుక్స్ మార్చిన వారిలో ముందుగా మహేశ్ బాబు గురించే చెప్పుకోవాలి. మహేష్ బాబు ఇప్పటి వరకూ చాలా సినిమాలు చేశారు... చాలా పాత్రలే వేశారు. కాని రాజమౌళి సినిమాలో మాత్రం చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు. ఆయన ఇప్పటి వరకూ ఎన్ని సినిమాలు చేసినా రాజమౌళి సినిమాలో మాత్రం కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు.
రాజమౌళి ఏ హీరోనైనా ఎన్ని సినిమాలు చేసినా.. తన సినిమాలో మాత్రం కొత్తగా చూపిస్తుంటాడు. ఈసారిమహేష్ ను కూడా అలాగే చూపించబోతున్నాడట. ఇప్పటికే రెండు మూడులక్ టెస్ట్ ల తరువాత సూపర్ స్టార్ ఫైనల్ లుక్ రెడీ అయ్యింది. అది మీరు చూసే ఉంటారు కదా..? మహేష్ హాలీవుడ్ హీరోలా ఎలా మారిపోయాడో..?
Also Read: చిరంజీవి ఉదయం లేవగానే ఎవరి ఫోటో చూస్తారో తెలుసా..? మెగాస్టార్ రూమ్ లో ఉండే ఫోటో ఎవరిది..?
Prabhas, The Raja Saab, maruthi
ఇక ప్రభాస్ గురించి మాట్లాడుకుందాం... ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా అందరికి తెలిసిందే. రాజాసాబ్. ఈసినిమా నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు టీమ్. అసలు అందులో ఉన్నది మన ప్రభాస్ ఏనా.. అని అందరికి అనుమానం వచ్చేలా ఉన్నాడు. మారుతి సినిమా హార్రర్ థ్రిల్లర్ కావడం అందులో యంగ్ ప్రభాస్ తో పాటు ఆయన తాత పాత్ర పోషిస్తున్నాడు. అలాగే స్పిరిట్ లో పోలీస్ ఆఫీసర్ గా, హను రాఘవపూడి సినిమాలో ఆర్మీ మ్యాన్ గా కనిపించబోతున్నాడు. ఇలా సినిమా ఆసినిమాకు కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు ప్రభాస్.
Also Read: రవితేజ నుంచి వరుణ్ తేజ్ వరకూ.. ఒక్క హిట్టు కోసం ఎదురుచూస్తున్న తెలుగు హీరోలు..?
ఇక బన్నీ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేశాలు వేయడంలో ఆయన తరువాతే ఎవరైనా.. పుష్ప రెండు సినిమాల్లో అల్లు అర్జున్ డిఫరెంట్ గెటప్స్ తో పాటు.. ఆయన లుక్స్ చూస్తూనే ఉన్నారు జనాలు. ఇక ఈమధ్యే కాస్త గ్యాప్ ఇచ్చి.. నార్మల్ గెటప్ లోకివచ్చాడు.
ఇక ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కోసం మరో గెటప్ లో కనిపించబోతున్నాడట అల్లు అర్జున్. ఈసినిమాలో కార్తికేయుడి పాత్రలో బన్నీ కనిపిస్తారట. త్రివిక్రమ్ – అల్లుఅర్జున్ కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీకి సంబంధించి అల్లు అర్జున్ క్యారెక్టర్ పై చర్చ జరుగుతోంది.
Also Read: తమన్నా .. విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పిందా..? మిల్క్ బ్యూటీ పోస్ట్ లో అంత అర్ధం ఉందా..?
ఇక ఎన్టీఆర్ సంగతి చూసుకుంటే.. దేవరలో మనోడి పాత్ర, గెటప్ అందరికి తెలిసిందే. నల్ల బట్టల్లో అద్భుతంగా కనిపించాడు యంగ్ టైగర్. ఇక ఈసారి మాత్రం ఎన్టీఆర్ యాక్షన్ అవతార్ ని ఎలివేట్ చేసేలా గట్టిగా ప్లాన్ చేశారు ప్రశాంత్ నీల్. దేవరలో కనిపించినదానికంటే కూడా అంతకు మించి ఎన్టీఆర్ ని పవర్ ఫుల్ రోల్ లో చూపించబోతున్నారు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న డ్రాగన్ లో మాఫియా డాన్ గా ఎన్టీఆర్ కనిపిస్తారని టాక్ మరి ఆయన లుక్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి మరి.
ఇక రంగస్థలం సినిమానుంచి రామ్ చరణ్ తీరే మారిపోయింది. పాత్ర కోసం ప్రాణం పెట్టేస్తున్నాడు చరణ్. ప్రస్తుతం బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న సినిమాలో చరణ్ క్యారెక్టర్ గురించి కూడా చర్చ జరగుతోంది. రంగస్థలం, గేమ్ ఛేంజర్, ట్రిపుల్ ఆర్, మగధీర.. ఇలా చాలా సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించిన చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు సినిమాలో ఏం క్యారెక్టర్ చేస్తున్నాడో అంటూ వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. అయితే రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రా రస్టిక్ లుక్ లో ఉన్న స్పోర్ట్స్ మ్యాన్ లా కనిపించబోతున్నారని తెలుస్తోంది.