- Home
- Entertainment
- తమన్నా .. విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పిందా..? మిల్క్ బ్యూటీ పోస్ట్ లో అంత అర్ధం ఉందా..?
తమన్నా .. విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పిందా..? మిల్క్ బ్యూటీ పోస్ట్ లో అంత అర్ధం ఉందా..?
స్టార్ హీరోయిన్ తమన్నా తన ప్రియుడు విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పిందా..? వారి ప్రేమకు పుల్ స్టాప్ పెట్టిందా..? అందుకే పెళ్ళి గురించి మాట్లాడటంలేదా..? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత..?
- FB
- TW
- Linkdin
Follow Us
)
Tamannah Bhatia
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ చాలామంది తారలు ప్రేమించుకున్నారు. పెళ్ళి పీటలు కూడా ఎక్కేశారు. తమ ప్రియుళ్లను పరిచియం చేసిన చాలా కాలం తరువాత పెళ్లిళ్ళు చేసుకున్న హీరోయిన్లు బోలెడంత మంది ఉన్నారు. రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, తాప్సీ, ఇలియాన. ఇలా చాలామంది తారలు పెళ్ళిళ్లు జరిగిపోయాయి. అయితే చాలా కాలంగా నటుడు విజయ్ కుమార్ తో ప్రేమతో ఉన్న హీరోయిన్ తమన్నా మాత్రం ఇంత వరకూ పెళ్ళి ఊసు ఎత్తడం లేదు. చాలా కాలంగా వీరు ప్రేమించుకుంటున్నారు.
పెళ్లెప్పుడు అంటూ ఫ్యాన్స్ అడిగితే మాత్రం ఏదో ఒకటిచెపుతూ దాటవేస్తూ వచ్చారు. విజయ్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన MCA మూవీలో విలన్ గా నటించాడు. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తున్నాడు విజయ్ వర్మ. లస్ట్ స్టోరీస్ 2 చేస్తున్నప్పుడు వీరిద్దరికి పరిచయం ఏర్పడటంతో.. అది ప్రేమగా మారిందని టాక్. లస్ట్ స్టోరీస్ లో తమన్నా తో కలిసి ఆయన చేసిన ఘాటు రొమాన్స్ బాలీవుడ్ లోనే సంచలన టాపిక్ గా మారింది.
Vijay Varma, Tamannaah
రొమాంటిక్ సన్నివేశాలకు దూరంగా ఉండే మీరు అకస్మాత్తుగా ఇలాంటి సినిమాల్లో నటిస్తున్నారేంటి అని విలేఖరులు అడగగా, విజయ్ వర్మ నా కాబోయే భర్త, అతనితో కాబట్టే అలాంటి ఘాటు రొమాన్స్ సన్నివేశాల్లో నటించాను అంటూ కవర్ చేసుకుంది తమన్న. ఇక వీరు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అంతా ఎదురు చూస్తున్న టైమ్ లో.. తాజాగా వీరి గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. విజయ్ వర్మకు తమన్నబ్రేకప్ చెప్పిందనే వార్త వైరల్ అవుతోంది. దానికి కారణం తమన్నా పెట్టిన పోస్ట్.
Vijay Varma
రీసెంట్ గా తమన్నా పెట్టిన ఒక పోస్ట్ అందరికి షాక్ ఇస్తోంది. లవ్ బ్రేకప్ ను సూచించే విధంగా ఆమె ఈ పోస్ట్ పెట్టినట్టు అర్థం చేసుకుంటున్నారు. ఇంతకు ఆమె ఏమని చెప్పిందంటే ‘ ప్రేమని రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదు, ఎదురు వ్యక్తులకు సీక్రెట్ ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఒకరు మిమ్మల్ని అందంగా చూడాలంటె, ముందు మీ చుట్టూ ఉన్నవాళ్లను అందంగా చూడడం నేర్చుకోండి’ అంటూ ఆమె ఒక పోస్ట్ నుని తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేసింది.
దీనిని చూసి ఆమె ఫ్యాన్స్ కూడా తమన్నాకు ఎం కష్టం వచ్చి ఉంటుందో అని బాధపడుటున్నారు. అంతే కాదు ఆమె మనసుకు దగ్గరగా ఉన్నవారి గురించే ఈ పోస్ట్. కాబట్టి ఆమె తన ప్రియుడితో విడిపోయి ఉంటుందేమో అని రకరకాలుగా ఆలోచిస్తున్నారు .కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆమె మాత్రం అఫీషియల్ గా తమ బ్రేకప్ ను అనౌన్స్ చేయలేదు. ఇందులో నిజమెంతో కూడా తెలియదు. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.