రవితేజ నుంచి వరుణ్ తేజ్ వరకూ.. ఒక్క హిట్టు కోసం ఎదురుచూస్తున్న తెలుగు హీరోలు..?
ఒక్క హిట్టు.. ఒక్కటేఒక్క హిట్టు బాబోయ్ అంటున్నారు తెలుగు స్టార్ హీరోలు. వరుసగా ప్లాప్ లు పలుకరిస్తుండటంతో.. ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ లిస్ట్ లో కుర్ర హీరోలే ఎక్కువ ఉండటం విచిత్రం. వరుణ్ తేజ్ నుంచి విజయ్ దేవరకోండ వరకూ హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలు ఎవరు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఒక్క హిట్టు.. ఒక్కటేఒక్క హిట్టు బాబోయ్ అంటున్నారు తెలుగు స్టార్ హీరోలు. వరుసగా ప్లాప్ లు పలుకరిస్తుండటంతో.. ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ లిస్ట్ లో కుర్ర హీరోలే ఎక్కువ ఉండటం విచిత్రం. వరుణ్ తేజ్ నుంచి విజయ్ దేవరకోండ వరకూ హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలు ఎవరు.
Also Read: చిరంజీవి ఉదయం లేవగానే ఎవరి ఫోటో చూస్తారో తెలుసా..? మెగాస్టార్ రూమ్ లో ఉండే ఫోటో ఎవరిది..?
Actor Vijay Devarakonda
విజయ్ దేవరకొండ..
పాపం విజయ్ దేవరకొండ... స్టార్ డమ్ వచ్చినట్టే వచ్చింది. అలా వచ్చిందో లేదో ఇలా ప్లాప్ లు స్టార్ట్ అయ్యాయి. కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గరనుంచి పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం. ఇలా బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలతో హ్యాట్రిక్ కొట్టాడు విజయ్ దేవరకోండ. ఈ మూడు సినిమాలతో పిచ్చి పిచ్చిగా క్రేజ్ వచ్చింది విజయ్ కి. అయితే ట్విస్ట్ ఏంటంటే.. ఈ మూడు సినిమాలు తప్ప మిగిలిన సినిమాలన్నీప్లాప్ అవుతూ వస్తున్నాయి. 2018 దగ్గరనుంచి పట్టుమని ఒక్క హిట్ పడలేదు విజయ్ దేవరకొండకు. లైగర్ లాంటి సినిమాలు పెద్ద దెబ్బకొట్టాయి. సాలిడ్ కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు రౌడీ హీరో.
Also Read: శ్రేయా ఘోషల్ వాయిస్ అంత స్వీట్ గా ఉండటానికి ఏం జాగ్రత్తలు తీసుకుంటుందో తెలుసా..?
Varun Tej, Matka, Allu Arjun
వరుణ్ తేజ్ ..
చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూసిన వారిలో మెగా హీరో వరణ్ తేజ్ ముందున్నారు. ఈ హీరో ఈమధ్య కాలంలో ఎక్కువగా డిజాస్టర్లు ఫేస్తూ వస్తున్నారు. అసలు నిజానికి చెప్పుకోవాలి అంటే.. 2019 లో వచ్చిన గద్దలకొండ గణేశ్ సినిమా తరువాత వరుణ్ కు మంచి సినిమా పడనేలేదు. ప్రతీ సినిమా ప్లాప్ అయ్యింది. ఈరకంగా చూసుకుంటే వరుణ్ తేజ్ సాలిడ్ హిట్ చూసి దాదాపు 6 ఏళ్లు అవుతోంది.
ఈ మధ్యలో వచ్చిన గని, గాంఢీవధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ , రీసెంట్ డిజాస్టర్ మట్కా. ఇలా వరుసగా సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇక లాభం లేదని తన జానర్ మార్చి హార్రర్ కామెడీ మూవీ కొరియన్ కనకరాజు తో రాబోతున్నాడు.ఈ సినిమా అయినా వర్కౌట్ అవుతందో లేదో చూడాలి.
Also Read: తమన్నా .. విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పిందా..? మిల్క్ బ్యూటీ పోస్ట్ లో అంత అర్ధం ఉందా..?
నాగచైతన్య - అఖిల్..
ఇక అక్కినేని అన్నాదమ్ములలది కూడా ఇదే పరిస్థితి. నాగచైతన్య కూడా ఏదో యావరేజ్ టాక్ తో నడింపించేస్తున్నాడు కానీ ..ఇప్పటి వరకూ కెరీర్ లో బ్లాక్ బస్టర్ కొట్టిన సందర్భం లేదు. మజిలీ తర్వాత అన్నీ ఫ్లాపులే పడ్డాయి. మధ్యలో లవ్ స్టోరీతో మంచి హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు తండేల్ తో అద్భుతం చేయాలని చూస్తున్నాడు.
చైతూ తమ్ముడు అఖిల్ పరిస్థితి అయితే మరీ ధారుణం. హీరోగా తన ఇమేజ్ ను ఏమాత్రం నిలబెట్టుకోలేకపోయాడుఅఖిల్. కెరీర్ స్టార్టింగ్ నుంచి మంచి హిట్ ఒక్కటీ పడలేదు. ఏజెండ్ లాంటి ప్రయోగాత్మక సినిమాలు కూడా దెబ్బకొట్టాయి. ప్రస్తుతం ఏదో చేస్తున్నాడు కాని. దాని గురించి ఇన్ ఫర్మేషన్ మాత్రం లేదు.
Ram Pothineni
రామ్..
ఇస్మార్ట్ శంకర్ తరువాత ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టలేదు హీరో రామ్. ఫ్లాప్ వెంట ఫ్లాప్ .. ఫ్లాప్ లతో సావాసం చేశాడు రామ్. ఎన్ని ప్రయోగాలు చేసినా.. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. హిట్ పడలేదు రామ్ పోతినేనికి. దాదాపు నాలుగేళ్ల నుంచి సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు రామ్. రెడ్ , వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ ..ఇలా వరసగా సినిమాలన్నీ ఫ్లాపే. మరి ఈసారి రామ్… సాగర్ గా అయినా మెప్పిస్తాడో లేదో చూడాలి.
నితిన్..
నితిన్ పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. 2020 లో వచ్చిన భీష్మ సినిమా తరువాత ఒక్క సినిమా అయినా సాలిడ్ గా సాధించింది లేదు. అప్పటి నుంచి వరుసగా చెక్, రంగ్ దే, మ్యాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ లను తీసుకువచ్చాడు. కాని ఏ సినిమా హిట్ అవ్వలేదు. దాంతో మరోసారి రాబిన్ హుడ్ , తమ్ముడు సినిమాలతో రాబోతున్నాడు. మరి ఇప్పుడైనా ప్లాప్ లకు బ్రేక్ లు వేస్తాడా లేదా చూడాలి.
రవితేజ..
ఇక సీనియర్ హీరోలలో హిట్ కోసం ఎదురుచూస్తున్న వారిలో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఉన్నారు. ఆయన కెరీర్ లో వరుసగా హిట్లు అయితే.. వరుసగా ప్లాప్ లు వస్తుంటాయి. ఈమధ్య వరుసగా హిట్ సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు హిట్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. లాస్ట్ 5 ఏళ్లలో 10 సినిమాలు చేస్తే .. క్రాక్, ధమాకా ఈ రెండు సినిమాలే హిట్టయ్యాయి. రవితేజ..ఈ సంవత్సరం మే లో రిలీజ్ అవుతున్న మాస్ జాతర తో అయినా హిట్ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నారు.
గోపీచంద్..
ఇక సీనియర్ హీరోలలో ఒక్కటంటే ఒక్క హిట్ లేకుండా ఇబ్బందులుపడుతున్న హీరో గోపీచంద్. దాదాపు 10 ఏళ్లనుంచి సరైన సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు గోపీచంద్ . రిలీజైనసినిమాలన్నీ బిలో యావరేజ్ టాక్ తో కంటిన్యూ అవుతున్నాయి. ఈ హీరో సాలిడ్ సక్సెస్ చూసి చాలా కాలం అయ్యింది. ఈసారైనా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు గోపీచంద్.