- Home
- Entertainment
- 5 నిమిషాల పాటకు 5 కోట్లు రెమ్యునరేషన్ వసూలు చేసిన హీరోయిన్? ఎవరా స్టార్ బ్యూటీ, ఏంటా సాంగ్ ?
5 నిమిషాల పాటకు 5 కోట్లు రెమ్యునరేషన్ వసూలు చేసిన హీరోయిన్? ఎవరా స్టార్ బ్యూటీ, ఏంటా సాంగ్ ?
ఈమధ్య హీరోయిన్లు ఎక్కువగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ డిమాండ్ ఇంకాస్త పెరిగింది. తాజాగా ఓ హీరోయిన్ నిమిషానికి కోటి రూపాయలు వసూలు చేసిందట. ఇంతకీ ఎవరా బ్యూటీ..? ఏ సినిమా కోసం అంత అడిగింది.

ఆ హీరోయిన్ ఎవరో కాదు తమన్నా భాటియా. ఒకవైపు నటనలో అదరగొడుతున్నా తమన్నాతో ఐటమ్ డ్యాన్స్ చేయించడానికి చాలా మంది దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. తమన్నా ఐటమ్ సాంగ్స్ చేసిన సినిమాలు సూపర్ హిట్ అవుతుండటంతో ఆమెకు డిమాండ్ భారీగా పెరిగింది. తమన్నా సాంగ్ లక్ గా ఫీల్ అవుతున్నారు మేకర్స్.
Also Read: చిరంజీవి గాఢంగా ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎందుకు పెళ్లి చేసుకోలేదు, నిజమెంత?
రైడ్ 2 మూవీ
ఆమె ఇంతకు ముందు ఐటమ్ డ్యాన్స్ చేసిన జైలర్, స్త్రీ 2 సినిమాల పాటలే కాదు, సినిమా కూడా సూపర్ హిట్ అయింది. దీంతో పాటు అజయ్ దేవగన్, రితేష్ దేశ్‌ముఖ్ నటించిన 'రైడ్ 2' సినిమాలో 'నషా' సాంగ్ కూడా రిలీజ్ అయ్యింది. . 'ఆజ్ కి రాత్' తరహాలో రూపొందించిన ఈ పాటలో తమన్నా తన నృత్యంతో అభిమానులను మైమరపింపజేసింది.
Also Read: 47 ఏళ్ల విజయ్ సేతుపతి తో 53 ఏళ్ళ హీరోయిన్ జంటగా సినిమా? ఎవరా నటి?
నషా సాంగ్:
ముఖ్యంగా తమన్నా డాన్స్ మూమెంట్స్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఈ పాటను రీల్స్ చేసి వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. . 'జైలర్' సినిమాలోని కావాలా పాట మాదిరిగానే ఈపాట కూడా ఆడియన్స్ లోకి దూసుకుపోతుందని నమ్మకంతో ఉన్నారు మూవీ టీమ్. ఇక ఈ పాటకు తమన్నా తీసుకున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది.
Also Read: 400 సినిమాలు, 3 పెళ్లిళ్లు, 6 గురు పిల్లలు, 100 కోట్ల ఆస్తి ఉన్న స్టార్ నటుడు ఎవరో తెలుసా?
తమన్నా శాలరీ:
తమన్నా 5 నిమిషాల పాటకి 5 కోట్ల పారితోషికం తీసుకుందట. అంటే నిమిషానికి కోటి వసూలు చేసింది తమన్నా. గతంలో జైలర్ సినిమాలో డ్యాన్స్ చేయడానికి రూ.3 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న తమన్నా... ఆ సాంగ్ కంటే ఎక్కువ మొత్తం తీసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. సాంగ్స్ హిట్ అవుతుండటంతో తమన్నా రెమ్యునరేషన్ కూడా పెంచుతున్నట్టు తెలుస్తోంది.
Also Read: RRR కంటే ముందు రామ్ చరణ్ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
Also Read: బ్రహ్మముడి కావ్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? కొత్తగా వచ్చి భారీగా వసూలు చేస్తున్న బుల్లితెర తార.