- Home
- Entertainment
- బ్రహ్మముడి కావ్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? కొత్తగా వచ్చి భారీగా వసూలు చేస్తున్న బుల్లితెర తార.
బ్రహ్మముడి కావ్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? కొత్తగా వచ్చి భారీగా వసూలు చేస్తున్న బుల్లితెర తార.
Brahmamudi Fame Kavya Remuneration: ప్రస్తుతం వెండితెర స్టార్స్ కంటే బుల్లితెర తారలకే డిమాండ్ ఎక్కువగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఎక్కువగా సీరియల్స్ వైపు టర్న్ అవుతుండటంతో.. వాళ్లకు లక్షల్లో ఫ్యాన్స్ పోగవుతున్నారు. మరీ ముఖ్యంగా కార్తీక దీపం వటలక్క, డాక్టర్ బాబు, బ్రహ్మముడి కావ్య, రాజ్ ఇలా టెలివిజన్ పాత్రలంటే క్రేజ్ బాగా పెరుగుతుంది జనాల్లో . ఇక డిమాండ్ పెరుగుతుండటంతో.. వారు రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేస్తున్నారు . ఈమధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన బ్రమ్మముడి కావ్య రోజుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
Brahmamudi
Brahmamudi Fame Kavya Remuneration: ఈమధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్ తో పాటు అందులో పాత్రలను ఓన్ చేసేసుకున్నారు ఫ్యామిలీ ఆడియన్స్. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ టాప్ సీరియల్ భారీ టీఆర్పీతో దూసుకుపోతోంది. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది.
మరీ ముఖ్యంగా ఈ సీరియల్ లో మెయిన్ క్యారెక్టర్స్ అయిన కావ్య, రాజ్ లకు పిచ్చి పిచ్చిగా ఫ్యాన్స్ పెరిగిపోయారు. మరీ ముఖ్యంగా కావ్య పాత్రకు ఆడియన్స్ బాగా అడిక్ట్ అయిపోయారు. ఆమె నటనతో పాటు చాలాకీతనం ఆడియన్స్ కు బాగా నచ్చింది. చాలా తక్కువ టైమ్ అందరికి ఫ్యావరెట్ గా మారింది కావ్య. తెలుగులో ఆమె ఫస్ట్ సీరియల్ ఇదే.
Also Read: 47 ఏళ్ల విజయ్ సేతుపతి తో 53 ఏళ్ళ హీరోయిన్ జంటగా సినిమా? ఎవరా నటి?
Deepika Rangaraju
ఆమధ్య బిగ్ బాస్ సీజన్ 8 లో కూడా ఆమె గెస్ట్ గా వెళ్ళి సందడి చేసింది. ఇక తాజాగా నేచురల్ స్టార్ నానితో కలిసి ఓ యాడ్ లో కూడా మెరిసింది. ఇలా చిన్నగా ఒక్కో మెట్టు ఎక్కుతూ.. తన ఇమేజ్ ను పెంచుకుంటుంది కావ్య. తమిళనాడుకు చెందిన ఈ నటి అసలు పేరు దీపికా రంగరాజు.
ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తరువాత ఆమెకు నటన మీద ఇంట్రెస్ట్ తో, రకరకాల ప్రయత్నాలు చేసింది. కెరీర్ బిగినింగ్ లో న్యూస్ రీడర్ గా పనిచేసిన దీపికా.. ఆతరువాత తమిళంలో చిన్నగా సీరియల్స్ లో కి ఎంట్రీ ఇచ్చింది.
తమిళంలో కొన్ని సీరియల్స్ చేసిన తరువాత తెలుగులో బ్రహ్మముడి సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది. వచ్చీరావడంతోనే ఆమెకు స్టార్ డమ్ వచ్చింది.
Also Read: RRR కంటే ముందు రామ్ చరణ్ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
Brahmamudi
ఇక కావ్య అలియాస్ దీపికా రంగరాజు రోజుకు 30 వేల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటుందట. సీరియల్ షూటింగ్ ఉన్నన్నిరోజులు లెక్క చూసుకుంటే నెలకు 7 లక్షలకు పైనే ఆమె సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవి కాకుండా ఎప్పటికప్పుడు స్టార్ మాలో ప్రోగ్రామ్స్ కు వస్తూ.. అప్పుడప్పుడు రియాలిటీ షోస్ లోనూ కనిపిస్తూ ప్రస్తుతం టెలివిజన్ ఇండస్ట్రీని ఏలుతోంది.. ఇక తమిళంలో 'ఆరాడీ' అనే సినిమాతో నటించిన కావ్య తెలుగు సినిమాల్లోనూ అవకాశాలకోసం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read: 400 సినిమాలు, 3 పెళ్లిళ్లు, 6 గురు పిల్లలు, 100 కోట్ల ఆస్తి ఉన్న స్టార్ నటుడు ఎవరో తెలుసా?