టాలీవుడ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన సొట్టబుగ్గల సుందరి తాప్సీ..ఏం చేయబోతుంది!
బాలీవుడ్‌లో బిజీ అని తాప్సీ తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రేమని ఒలకబోస్తుంది. తనకు పేరుని, గుర్తింపుని తీసుకొచ్చిన ఇండస్ట్రీని మర్చిపోలేదని చెబుతుంది. ఇకపై తెలుగు ఆడియెన్స్ ని కూడా మెస్మరైజ్ చేస్తానని చెబుతోంది. ఓ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతుందట. మరి ఆ విశేషాలేంటో చూద్దాం.
క్యూట్ అందాలతో సొట్టబుగ్గలతో తెలుగు ఆడియెన్స్ ని మంత్ర ముగ్డుల్ని చేసింది తాప్సీ. `ఝుమ్మంది నాదం` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మెప్పించడంతోపాటు అందరి దృష్టిని ఆకర్షించింది.
దీంతో వరుసగా స్టార్ హీరోలతోనూ నటించే అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్ళింది. అయితే తెలుగులో ఈ హాట్ బ్యూటీకి గ్లామరస్ పాత్రలే దక్కాయి. దీంతో అందాల విషయంలో ఏమాత్రం రాజీపడకుండా టాలీవుడ్ ఆడియెన్స్ ని కనువిందు చేసింది.
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడికి `పింక్` సినిమా పెద్ద బ్రేక్ ఇచ్చింది. దీంతో బాలీవుడ్‌లో బిజీ అయ్యింది. ఇక ఇప్పుడు తెలుగు సినిమాలు మానేసింది.
తెలుగులో తాప్సీ కనిపించి రెండేళ్లు అవుతుంది. తెలుగు సినిమాలతో ఎదిగి, తెలుగు సినిమాలు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాప్సీ స్పందించింది. తానొక నిర్ణయానికి వచ్చినట్టు చెప్పింది. ఇకపై బాలీవుడ్‌లో ఎన్ని సినిమాలు చేసినా, తెలుగులో ప్రతి ఏడాది ఒక్క సినిమా అయినా చేస్తానని చెబుతుంది.
'సౌత్ ప్రేక్షకులు నాపై ఎంతగానో ప్రేమ చూపించారు. నేను నటించిన ఎన్నో సినిమాలను వారు ఆదరించారు. ఇప్పటికీ, నేను బాలీవుడ్ సినిమాలలో నటిస్తున్నా కూడా నాపై ప్రేమ కురిపిస్తున్నారు. అందుకే వారి కోసం ఏడాదికి ఒక సౌత్ ఫిల్మ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాను. తప్పకుండా వారి కోసం ప్రతి సంవత్సరం ఓ సినిమా సౌత్‌లో చేస్తాన`ని తెలిపింది.
ప్రస్తుతం ఆమె కోలీవుడ్‌లో విజయ్ సేతుపతి సరసన ఓ చిత్రంలో చేస్తుంది. ఇక బాలీవుడ్‌లో `రష్మీ రాకెట్`, `శెభాష్ మిత్తు` వంటి చిత్రాల్లో నటిస్తుంది. ఇదిలా ఉంటే ఏడు నెలల లాక్ డౌన్ తర్వాత ఇటీవల మాల్దీవులకు చెక్కేసి తెగ ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వరుసగా బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ మాల్దీవులకు వెళ్లి సేదతీరుతున్నారు.