తెలుగు రాష్ట్రాల్లో థగ్ లైఫ్ చిత్ర పరిస్థితి దారుణంగా ఉంది. భారీ నష్టాల దిశగా ఈ చిత్రం పయనిస్తున్నట్లు తెలుస్తోంది.

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ 

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో 38 ఏళ్ళ తర్వాత తెరకెక్కిన థగ్ లైఫ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ రన్ కొనసాగిస్తోంది. ఈ చిత్రంలో త్రిష, అభిరామి, శింబు కీలక పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఏ అంశం కూడా ఆకట్టుకోలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో థగ్ లైఫ్ చిత్ర పరిస్థితి దారుణంగా ఉంది. 

బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ థగ్ లైఫ్

వీకెండ్ కలెక్షన్లు బలంగా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు భావించినప్పటికీ, ఆ అంచనాలను థగ్ లైఫ్ పూర్తిగా వమ్ము చేసింది. విడుదలైన కొన్ని రోజుల నుంచి వసూళ్లు క్రమంగా పడిపోతూ వస్తున్నాయి. ఇక వీకెండ్ ముగిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. 

ప్రస్తుతం ఫుట్‌ఫాల్స్ చాలా తక్కువగా ఉండటండిస్ట్రిబ్యూటర్ లని ఆందోళనకి గురి చేస్తోంది. భారీ రేట్లకు రైట్స్‌ను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు తీవ్ర నష్టాలు తప్పవన్నదే పరిశ్రమ అంచనా. 

నితిన్ తండ్రికి భారీ నష్టాలు ?

ఈ సినిమాకు సంబంధించి ప్రీ-రిలీజ్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో జరిగింది. ప్రముఖ నటుడు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్ర హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సుధాకర్ రెడ్డి అడ్వాన్స్ పద్దతిలో ఈ చిత్ర థియేట్రికల్ హక్కులని 18 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. మూడు రోజులు గడిచినప్పటికీ ఈ చిత్రం ఇంతవరకు 2 కోట్ల షేర్ కూడా తెలుగు రాష్ట్రాల్లో సాధించలేదు. 

దీనితో సుధాకర్ రెడ్డికి భారీ నష్టాలు వాటిల్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుధాకర్ రెడ్డి తెలుగులో కమల్ హాసన్ విక్రమ్ చిత్రాన్ని కూడా రిలీజ్ చేశారు. ఆ చిత్రానికి ఆయనకు డబుల్ ప్రాఫిట్స్ వచ్చాయి. కానీ థగ్ లైఫ్ చిత్రంతో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.