- Home
- Entertainment
- Karthika Deepam: డాక్టర్ బాబు తీసుకెళ్లిపోయిన మోనిత.. ఏం చెయ్యలేని స్థితిలో వంటలక్క!
Karthika Deepam: డాక్టర్ బాబు తీసుకెళ్లిపోయిన మోనిత.. ఏం చెయ్యలేని స్థితిలో వంటలక్క!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 20వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... సౌందర్య కుటుంబం అమెరికాకి వచ్చేస్తారు. అక్కడ సౌందర్య హిమని భోజనం చేయమంటే, నేను చెయ్యను నానమ్మ,మనం ఇండియా వెళ్ళిపోదాము. అక్కడ శౌర్య ఒంటరిగా ఉంటుంది అని అనగా సౌందర్య,మనం ఇప్పుడే కదా వచ్చాము నాలుగు రోజులు ఉంటే అలవాటైపోతుంది అని అంటుంది. దానికి హిమ, వద్దు నానమ్మ అని అంటుంది.శౌర్యని వెతకడానికి మనుషుల్ని పంపాను దొరికిన వెంటనే ఇక్కడికి తీసుకొచ్చేద్దాము అని సౌందర్య అంటుంది.
వాళ్ళకు దొరకకపోతే, తాను తానుగానే మన దగ్గరికి రావాలనుకుని మనం అక్కడ లేమని తెలుసి బాధపడి తిరిగి వెనక్కి వెళ్ళిపోతే?. అప్పుడు ఎలాగ నానమ్మ అందుకే మనం ఇండియాలోనే ఉందాము అని అంటుంది. మనల్ని వదిలిపోవడం అమ్మ, నాన్న చేతుల్లో లేదు కానీ సౌర్యని వదిలేయడం మన చేతుల్లోనే ఉంది కదా! తిరిగి ఇండియాకి వెళ్ళిపోదాం నానమ్మ అని అంటుంది హిమ. ఆ తర్వాత సెల్లో దీప పక్క ఊరి ఆసుపత్రికి వెళ్లి కొన్ని రోజుల క్రితం కారు ప్రమాదం లో గాయపడిన వారు ఇక్కడ చేర్పించారట.
వాళ్ల గురించి కలవడానికి వచ్చాను అని డాక్టర్ని అడగగా, నిన్నే అతని భార్య తనని తీసుకువెళ్లిపోయింది అని అక్కడున్న వాళ్ళు చెప్తారు. దీప ఆశ్చర్యపోయి భార్య ఏంటి అని అనుకుని తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఒక నర్సు వచ్చి నిన్న వెళ్ళిపోయినా వారి పర్స్ ఇది,వదిలేశారు అని అంటుంది.ఆ పర్స్ కార్తీక్ ది. అప్పుడు దీప గతంలో కార్తీక్ కి పుట్టినరోజు నాడు బహుమతి ఇచ్చిన సంగతి గుర్తు తెచ్చుకుంటుంది. అంత విలువైన గిఫ్ట్ కాకపోయినా ఏదో నా స్థాయికి తగ్గట్టు చిన్న బహుమతి కొన్నాను డాక్టర్ బాబు అని దీప అంటుంది.
అప్పుడు కార్తీక్ నేను చచ్చేంత వరకు ఈ పర్స్ నాతోనే ఉంచుకుంటాను అని అంటాడు. ఆ మాటలు గుర్తు తెచ్చుకున్న దీప ఏడుచుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత సీన్లో శౌర్య వాళ్ళ పిన్ని బాబాయిలు దత్తత కార్యక్రమం జరిపించి సౌర్యని వాళ్ళ కూతురుగా దత్తకు తీసుకుంటారు. అప్పుడు వాళ్ళు సౌర్యని జ్వాలగా మార్చేస్తారు. మా కూతురికి జ్వాలా అని పేరు పెట్టుకున్నామమ్మా తను ఇప్పుడు లేదు తన జ్ఞాపకంగా నీకు అదే పేరు పెట్టుకున్నామమ్మా.నువ్వే తనలా తిరిగి వచ్చావ్ అనుకుంటున్నాము అని అంటారు.
దత్తత కార్యక్రమం పూర్తయిపోతుంది జ్వాలా వాళ్ళిద్దరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటుంది. ఆ తర్వాత సీన్లో దీప ఆ డాక్టర్ ఇంటికి వచ్చి జరిగిన విషయం అంతా చెప్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మగారు, తను ఎవరో తీసుకెళ్ళిపోతే నర్స్ తన వైఫ్ అనుకొని ఉంటారులే నువ్వేం బాధపడొద్దు అమ్మ ఆచూకీ తెలుస్తది. ఇంతవరకు వచ్చాము కదా ఎలాగైనా కనబడతాము అని చెప్పి ఈ లోగ నాకు గుత్తి వంకాయ కూర చేయు అని అంటుంది. అప్పుడు దీప నేను కూరగాయలు తెస్తాను.
అలాగే డాక్టర్ బాబు కోసం కూడా వెతకవచ్చు కదా అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో సౌందర్య, ఆనందరావు హిమ తిరిగి ఇండియా వచ్చేస్తారు. అప్పుడు హిమ నా మాటకి విలువిచ్చి ఇండియా తీసుకొచ్చినందుకు థాంక్స్ నానమ్మ.నేను డాక్టర్ చదువుతాను అలాగే శౌర్య దొరికేక తనని కలెక్టర్ని చేయాలి అని అమ్మ కోరిక ఇవి నెరవేరాలి అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో దీప రోడ్ మీద అందరినీ కార్తీక్ ఫోటో చూపించి తన గురించి తెలుసా అని అడుగుతుంది. ఆ తర్వాత సీన్లో కార్తీక్ తోపాటు శివ అనే ఒక అతను కూడా కారులో నుంచి దిగుతాడు.
ఇక్కడ ఆపేవ్ ఎందుకు అని కార్తీక్ అడగగా మేడం మిమ్మల్ని సమయానికి భోజనాలు, జ్యూస్లు తాగాలని చెప్పారు కదా. ఇప్పుడు జ్యూస్ తాగే సమయం అయింది మీరు ఎలాగైనా వెళ్లి తాగాలి. నేను ఉంటే అక్కడ మీకు మనస్సాంతి ఉండదు కనుక మీరు ఒక్కరే వెళ్లి ప్రశాంతంగా తాగండి అని అనగా మీ మేడం ఎందుకయ్యా నన్ను ప్రేమతో చంపేస్తుంది అని అంటాడు కార్తీక్. అదే సమయంలో దీప షాప్ కి వచ్చి శివ ని ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి తెలుసా అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సింది!