- Home
- Entertainment
- రవితేజ కంటే వయస్సులో చాలా చిన్నది, మాస్ మహారాజ్ కు భార్యగా, వదినగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
రవితేజ కంటే వయస్సులో చాలా చిన్నది, మాస్ మహారాజ్ కు భార్యగా, వదినగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు ఎలాంటి పాత్రచేయాల్సి వస్తుందో చెప్పలేము. అలాంటి పరిస్థితివచ్చింది మాస్ మహారాజ్ రవితేజకు. ఆయన సరసన హీరోయిన్ గా చేసిన ఓ స్టార్ బ్యూటీ.. మాస్ మహారాజ్ కు వదినగా కూడా నటించింది. ఇంతకీ ఎవరా హీరోయిన్..?

ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే మాయా ప్రపంచం ఇక్కడ రకరాల పాత్రలు పోషించాల్సి ఉంటుంది. మన టాలీవుడ్ లో హీరో పక్కన హీరోయిన్ గా నటించి.. అదే హీరోకి చెల్లిగా చేసిన వారు ఉన్నారు.. తల్లిగా నటించినవారు కూడా ఉన్నారు. హీరోయిన్ కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. కాస్త ఫెయిడ్ అవుట్ అయితే చాలు.. ఇక వారు క్యారెక్టర్ రోల్స్ వైపు వెళ్ళిపోక తప్పదు. అయితే హీరోయిన్లుగా ఉండి కూడా కొంత మంది స్టార్స్ డిఫరెంట్ రోల్స్ వైపు వెళ్తుంటారు.
Also Read: 10 ఏళ్ల గ్యాప్ తరువాత అబ్బాస్ మళ్ళీ వచ్చేస్తున్నాడు
అనూహ్యంగా తమతో నటించిన కోస్టార్స్ కి వదినలుగా, అక్కలుగా కూడా నటించక తప్పదు రవితేజ సరసన ఓ హీరోయిన్ అంతే నటించింది. పైగా ఆయన కంటే వయస్సులో చిన్నది. మాస్ మహారాజ్ కు ప్రియురాలిగా, భార్యగా, వదినగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆమె మరెవరో కాదు శృతీ హాసన్. మాస్ హారాజ్ కంటే దాదాపు 20 ఏళ్ళు చిన్నది. ఆయనతోకలిసి హీరోయిన్ గా స్టెప్పులేసిన ఈ బ్యూటీ ఓ సినిమాలో రవితేజ్ ప్రియురాలిగా కూడా నటించింది.
Also Read:హీరోయిన్ రెజీనా కి ముద్దు పెట్టిన అనిరుధ్ ? వైరల్ అవుతున్న ఫోటో
అంతే కాదు ఈమధ్య కాలంలో రవితేజ కు వదినగా కూడా నటించింది శృతీ ఇంతకీ ఆ సినిమాలేంటంటే..? గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన బలుపు సినిమాలో ఇద్దరు జంటగా నటించారు. ఇందులో రవితేజ లవర్ గా కనిపించింది శ్రుతిహాసన్. ఆ తర్వాత వీరిద్దరు కలిసి క్రాక్ సినిమాతో మరోసారి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. ఇందులో రవితేజ భార్యగా పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించింది.
Also Read:అప్పుడు 100 రూపాయల కోసం తిప్పలు, ఇప్పుడు నిమిషానికి 50 లక్షలు వసూలు చేస్తోన్న హీరోయిన్ ఎవరు..?
ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా.. చిరంజీవిని ప్రేమించే ప్రేమికురాలిగా శృతిహాసన్ నటించింది. అయితే ఇదే సినిమాలో రవితేజ చిరంజీవి తమ్ముడిగా నటించారు. అలా శృతిహాసన్ రవితేజకు వదినగా కనిపించింది. ఈ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ ఈ విధమైన విచిత్ర పరిస్థితిని ఫేస్ చేశారు.
Also Read:మాజీ ప్రధాని మనవరాలు, స్టార్ హీరోకు రెండో భార్య, రాజవంశానికి చెందిన హీరోయిన్ ఎవరో తెలుసా?
ఇక రవితేజ్ విషయానికి వస్తే.. వరుసగా సినిమాలు ప్లాప్ అవుతుండటంతో సాలిడ్ హిట్ కోసం చూస్తున్నారు మాస్ మహారాజ్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు రవితేజ. ప్రస్తుతం తన కెరీర్ లో 75వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కానీ ఈ సినిమా షూటింగ్ లో ప్రమాదం జరగడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నాడు మాస్ మహారాజ్. త్వరలో ఈమూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.