- Home
- Entertainment
- Anirudh, Regina Kiss Controversy : హీరోయిన్ రెజీనా కి ముద్దు పెట్టిన అనిరుధ్ ? వైరల్ అవుతున్న ఫోటో
Anirudh, Regina Kiss Controversy : హీరోయిన్ రెజీనా కి ముద్దు పెట్టిన అనిరుధ్ ? వైరల్ అవుతున్న ఫోటో
Anirudh Kiss Controversy with Regina Cassandra: హీరోయిన్ రెజీనా కు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ముద్దు పెట్టాడా..? ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?

వివాదంలో అనిరుధ్
Anirudh Kiss Controversy with Regina Cassandra: కోలీవుడ్ తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు అనిరుధ్. ఆయన సినీ జీవితం మొదట్లో చాలా వివాదాస్పదంగా ఉండేది. ముఖ్యంగా నటి ఆండ్రియాతో ప్రేమాయణం సాగించినప్పుడు, ఇద్దరూ ముద్దు పెట్టుకున్న ఫోటోలు లీక్ అయ్యి ఇంటర్నెట్ లో దుమారం రేపాయి.
ఆ వివాదం చల్లారకముందే, నటుడు సింబుతో కలిసి బీప్ సాంగ్ కి సంగీతం అందించి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇలా వివాదాస్పద సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన, ప్రస్తుతం ఎలాంటి వివాదాల్లో చిక్కుకోకుండా హిట్ సినిమాలతో బిజీగా ఉన్నారు.
Also Read:మాజీ ప్రధాని మనవరాలు, స్టార్ హీరోకు రెండో భార్య, రాజవంశానికి చెందిన హీరోయిన్
అనిరుధ్ సినిమాలు
అనిరుధ్ ప్రస్తుతం తెలుగులో నాని, విజయ్ దేవరకొండ సినిమాలతో పాటు తమిళంలో అజిత్ విడాముయర్చి, విజయ్ జననాయకన్, రజినీకాంత్ కూలీ, కమల్ ఇండియన్ 3తో సహా అరడజను సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ లో షారుఖాన్ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు. ఇలా పాన్ ఇండియా స్థాయిలో బిజీగా ఉన్నారు.
Also Read: అప్పుడు 100 రూపాయల కోసం తిప్పలు, ఇప్పుడు నిమిషానికి 50 లక్షలు వసూలు చేస్తోన్న హీరోయిన్ ఎవరు..?
అనిరుధ్
అనిరుధ్ సినిమాలకు సంగీతం అందించడమే కాకుండా, వివిధ దేశాల్లో సంగీత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. సినిమా పూర్తయ్యాక, ఆ సినిమాని చూసి, తన ఎక్స్ ఖాతాలో రివ్యూ కూడా రాస్తుంటారు. ఆయన అంంచనా చాలావరకు సరిగ్గా ఉంటుంది. అందుకే విడాముయర్చి చూసిన తర్వాత అనిరుధ్ ఏం ట్వీట్ చేస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: నోరు జారిన పూజా హెగ్డే, తెలుగు బ్లాక్ బస్టర్ ను తమిళ సినిమా అనేసిందేంటి?
రెజినాకి ముద్దు
ఈలోగా, ఆయన సినిమా చూసిన తర్వాత పోస్ట్ చేసినట్టుగా ఒక ట్వీట్ వైరల్ అయ్యింది. ఆ ట్వీట్ కింద విడాముయర్చి నటి రెజినా కామెంట్ చేయగా, ఆమెకు ‘ముద్దు’ రిప్లై ఇచ్చారు. దీన్ని చూసిన అభిమానులు అనిరుద్ రెజినాకు ముద్దు పెట్టారని భావించి ఆ పోస్ట్ ని స్క్రీన్ షాట్ తీసి వైరల్ చేశారు. కానీ అది అనిరుధ్ పేరుతో ఉన్న ఫేక్ ఎక్స్ ఖాతా నుంచి వచ్చిన పోస్ట్. అనిరుధ్ ఇప్పటివరకు విడాముయర్చి గురించి ఏ ట్వీట్ చేయలేదు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతోంది.
Also Read:రామ్ కి అనిల్ రావిపూడి కి మధ్య ఏంటి గొడవ, మూవీ ఎలా ఆగిపోయింది.