- Home
- Entertainment
- మాజీ ప్రధాని మనవరాలు, స్టార్ హీరోకు రెండో భార్య, రాజవంశానికి చెందిన హీరోయిన్ ఎవరో తెలుసా?
మాజీ ప్రధాని మనవరాలు, స్టార్ హీరోకు రెండో భార్య, రాజవంశానికి చెందిన హీరోయిన్ ఎవరో తెలుసా?
రాజవంశానికి చెందిన ఈ హీరోయిన్.. మాజీ ప్రధాని మనవరాలు. అంతే కాదు స్టార్ హీరో కు రెండో భార్య, మరో హీరోకు మాజీ భార్య. వినడానికి వచిత్రంగా ఉంది కదా..? ఇంతకీ ఎవారా హీరోయిన్..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎందరోహీరోయిన్లు వచ్చారు వెళ్ళారు..వస్తూనే ఉన్నారు. ఇండస్ట్రీలోనే చివరి వరకూ నటించిన వారు కూడా ఉన్నారు. హీరోలలో రకరకాల బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారు ఉన్నట్టే.. హీరోయిన్లలో కూడా రకరకాల బ్యాక్ గ్రౌండ్లు ఉన్నవారు ఉంటారు. ఉన్నారు కూడా. అందులో రాజవంశానికి చెందిన హీరోయిన్లు కూడా ఉన్నారు. ఇక మనం ఇప్పుడు చెప్పుకోబోయే హీరోయిన్ రాజవంశానికి చెందినవారే.
Also Read: 4 నెలల్లో 3 హిట్లు, 850 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన లక్కీ హీరోయిన్
ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో కాదు అదితి రావు హైదరీ. తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమల్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. కాస్త లేట్ గాఇండస్ట్రీకి వచ్చింది. అయితే ఈమెకు రెండు భారీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఆమె తాత (తండ్రి తండ్రి )అక్బర్ హైదరీ. అప్పట్లో హైదరాబాద్ ప్రధానమంత్రిగా పనిచేశారు. అలాగే మరో తాత రామేశ్వరరావు (తల్లి తండ్రి) తెలంగాణలోని వనపర్తి సంస్థానాధీశులు.
Also Read: తాళి ఎక్కడ? పెళ్ళైన రెండు నెలలకే షాకింగ్ లుక్ లో కీర్తి సురేష్, నెటిజన్లు ఏమంటున్నారంటే..?
అంతే కాదు అదితి రావు హైదరీ మొదట బాలీవుడ్ హీరో, నిర్మాత అయిన సత్యదేవ్ మిశ్రాను పెళ్ళాడింది. నాలుగేళ్లు నిండకుండానే వీరు విడాకులు తీసుకున్నారు. ఆతరువాత ఆమె తన తన కెరీర్ పై దృష్టి పెట్టింది. మోడలింగ్ తో పాటు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా నాలుగు భాషల్లో మంచి పేరు తెచ్చుకుంది అదితి.
Also Read:భర్త భగ్నానితో కలిసి రెచ్చిపోయిన రకుల్ ప్రీత్ సింగ్
అంతే కాదు ఇండస్ట్రీలో కొనసాగుతున్న క్రమంలోనే మరో సారి మరో హీరోతో లవ్ లో పడింది అదితి తెలుగులో మహాసముద్రం సినిమా టైమ్ లో హీరో సిద్ధార్ద్ తో ప్రేమలో పడింది. వీరిద్దరు రెండు మూడేళ్ళు చెట్టా పట్టాలేసుకుని తెగ తిరిగారు. ఇక రీసెంట్ గా వీరు ఫారెన్ లో పెళ్ళి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు అదితికి దగ్గరి బంధువు. అదితీ రెండేళ్ల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఇద్దరూ విడిపోయారు. దీంతో తన తల్లితో కలిసి ఢిల్లీకి వచ్చేసింది. 2006లో సినీ రంగంలోకి అడుగుపెట్టింది.