పాన్ ఇండియా మూవీస్ ఒక చెత్త కల్చర్, సంచలన వ్యాఖ్యలు చేసిన ధనుష్ అన్న సెల్వరాఘవన్,
పాన్ ఇండియా సినిమాల పై పంచలన వ్యాఖ్యలు చేశారు స్టార్ హీరో ధనుష్ అన్న, సీనియర్ దర్శకుడు సెల్వరాఘవన్. ఓ ఇంటర్వ్యూలో ఆయన అన్న మాటలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ సెల్వ ఏమన్నారంటే?

పాన్ ఇండియా సినిమాల గురించి సెల్వరాఘవన్ చేదు నిజాలు
7జీ బృందావన్ కాలనీ సినమిాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు స్టార్ డైరక్టర్ సెల్వ రాఘవన్. స్టార్ హీరో ధనుకు ఈయన స్వయానా అన్న అవుతారు. తమిళంలో 7g రెయిన్‌బో కాలనీ, మయక్కం ఎన్నా, పుదుపేట్టై, ఆయిరత్తిల్ ఒరువన్ లాంటి సినిమాలు తీశారు సెల్వరాఘవన్. ప్రస్తుతం డైరెక్షన్ నుంచి యాక్టింగ్ వైపుకు వెళ్లిన సెల్వ.. అక్కడ కూడా దుమ్ము రేపుతున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పాన్ ఇండియా సినిమాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: దివ్య భారతి మరణంతో ఆగిపోయిన 10 సినిమాలు, పూర్తి చేసిన స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?
సెల్వరాఘవన్
పాన్ ఇండియా ఒక చెత్త కల్చర్
ఆయన మాట్లాడుతూ: పాన్ ఇండియా సినిమాల వల్ల సినిమా ఎంతో వెనక్కి పోయిందన్నారు. “పాన్ ఇండియా అనేది ఒక చెత్త కల్చర్ ఇప్పుడు వచ్చింది. దీని వల్ల ఇప్పుడు సినిమాల్లో అన్నీ కమర్షియల్ అయిపోయాయి. ఒక పాట ఉండాలి, బాగా డాన్స్ చేయాలి, ఫుల్లుగా ఫైటింగ్స్ ఉండాలి అంటే సినిమా క్వాలిటీ ఏమవుతుంది. ఒక మంచి సినిమా ఎప్పుడు చూశామో ఒకసారి ఆలోచించండి. అన్నీ అయిపోయాయి. అన్నీ గుచ్చి గుచ్చి చింపేస్తున్నారు. ఇప్పుడు మంచి సినిమా తీయడానికి ఇక్కడ ఎవరూ ముందుకు రావడంలేదు అన్నారు.
మంచి కథలతో సినమాలు వచ్చి ఎన్ని రోజులైంది. ఇప్పుడు సినిమా ఆడితే చాలు, డబ్బులు వస్తే చాలు అని అనుకుంటున్నారు. అది కూడా తప్పేం కాదు. అందరూ డబ్బుల కోసమే సినిమా తీస్తాం. కానీ డబ్బుకోసమే సినిమాలు అనే పరిస్థితి వచ్చేసింది. రియల్ సినిమా రావడం కష్టంగా ఉంది. వెయ్యిలో ఒక సినిమా అలా వస్తుంది. దాన్ని కూడా జనాలు ఆదిరంచే పరిస్థితి లేదన్నారు.
Also Read: 24 ఏళ్ళ సెంటిమెంట్ ను బ్రేక్ చేయబోతున్న చిరంజీవి, విశ్వంభర కోసం మెగాస్టార్ సాహసం చేయబోతున్నారా ?
డైరెక్టర్ సెల్వరాఘవన్
5వ రోజే 1000 కోట్ల పోస్టర్
సెల్వ మాట్లాడుతూ ఇలా అన్నారు.. నాకేమో ఇది కరోనా తర్వాత వచ్చిన మార్పులా అనిపిస్తుంది. ఇప్పుడు అందరూ వెయ్యి కోట్లు కావాలని సినిమా తీస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన 5వ రోజు వెయ్యి కోట్లు అని పోస్టర్ వేయాలి అని అనుకుంటున్నారు. అది నిజంగా వసూలు చేసిందా లేదా అనేది లేదు. చాలామంది హీరోని సంతోషపెట్టడానికే చేస్తున్నారు. వాళ్ళని సంతోషపెడితే నెక్స్ట్ సినిమా ఇస్తాడు.
మంచి సినిమా చచ్చిపోయింది. ఇకపై ఒక మంచి సినిమా, భారతీరాజా లాంటి డైరెక్టర్లు రాలేరు. ఎందుకంటే ఇక్కడ ఒక సినిమా తీస్తే బతకలేరు. ఇప్పుడు 99 శాతం సినిమాలు అలానే తీస్తున్నారు. కరోనా టైంలో జనాలు 2 ఏళ్లు ఇంట్లోనే ఉండి వాళ్ళకి బ్రెయిన్ ఏమో అయిపోయింది. ఇది నేను జోక్ కోసం చెప్పడం లేదు అన్నారు.
పాన్ ఇండియా సినిమాల గురించి సెల్వరాఘవన్
టేస్ట్ చచ్చిపోయింది
పాన్ ఇండియా సినిమాల మీద నాకు నమ్మకం లేదు. ఒక సినిమా తమిళ్‌లో క్లిక్ అవ్వాలి, తెలుగులో క్లిక్ అవ్వాలి, మలయాళంలో క్లిక్ అవ్వాలి అని అనుకుంటే ఇలాంటి సినిమాలే వస్తాయి. కమర్షియల్‌గా తీస్తే అందరూ చూసేస్తారు అని నమ్మి పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు. అన్ని పాన్ ఇండియా సినిమాల్లో 4 పాటలు ఉంటాయి. కాని అందులో సినిమా అసలు రుచి దొరకదు అన్నారు.
పాన్ ఇండియా సినిమాల్లో వెయిట్ ఉన్నట్టు అనిపించదు. ఈ పాన్ ఇండియా మోజుతో హిందీలో, బాలీవుడ్ సినిమాలనే మర్చిపోయారు. అక్కడే మన సౌత్ ఇండియన్ సినిమాలు చూడాలని అనుకుంటున్నారు. అక్కడ ఇప్పుడు టాప్‌లో ఉన్న వాళ్లంతా ఇక్కడి నుంచి వెళ్లిన వాళ్లే. పాన్ ఇండియా సినిమాల వల్ల టేస్ట్ చచ్చిపోయింది” అని బాధతో చెప్పారు సెల్వరాఘవన్. ప్రస్తుతం ఆయన వాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ మాటలకు ఇండస్ట్రీ నుంచి ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.
Also Read: బాహుబలి సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో, ప్రభాస్ కంటే ముందు రాజమౌళి ఆఫర్ ఇచ్చింది ఎవరికి?
Also Read: కీర్తి సురేష్ షాకింగ్ లుక్, బాయ్ కట్ లో మహానటి ఫోటోలు వైరల్
Also Read: 40 కోట్లు బడ్జెట్ పెడితే 40 వేలు కూడా రాలేదు, దేశంలోనే చెత్త రికార్డ్ ఈ సినిమాదే?