MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ మిస్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు? అవి చేసుంటే పవర్ స్టార్ పాన్ ఇండియా హీరో అయ్యేవాడా?

పవన్ కళ్యాణ్ మిస్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు? అవి చేసుంటే పవర్ స్టార్ పాన్ ఇండియా హీరో అయ్యేవాడా?

ఫిల్మ్ ఇండస్ట్రీలో  చాలా మంది హీరోలు కొన్ని సినిమాలు రిజెక్ట్ చేస్తుంటారు. కథలు నచ్చక, రకరకాల కారణాలతో దర్శకులకు నో చెపుతుంటారు. అలానే పవన్ కళ్యాణ్ కూడా కొన్ని కథలు వదిలేశారు, అయితే ఆయన రిజెక్ట్ చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. ఆ మూవీస్ లో నటించిన హీరోలను స్టార్స్ ను చేశాయి. ఇంతకీ ఆ సినిమాలేంటి? పవర్ స్టార్ రిజెక్ట్  చేసిన కథలేంటి.? 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 05 2025, 07:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఫిల్మ్ ఇండస్ట్రీ సముద్రంలాంటిది అందులో ఎన్నో విషయాలు దాగి ఉంటాయి. అవి సమయం వచ్చినప్పుడు మాత్రమే బయటకు వస్తుంటాయి. అవి నిజాలు కావచ్చు, రూమర్లు కావచ్చు, గాసిప్స్ కావచ్చు, ఏవైనా సరే బయటకు వచ్చే టైమ్ రావాలి అంతే. అలాంటి వాటిలో హీరోలు మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమాల ఎపిసోడ్ కూడా ఒకటి.  

Also Read: 3 నెలల్లో 60 ఫ్లాప్ సినిమాలు, 4 హిట్లు మాత్రమే, కోలీవుడ్ పరిస్థితి ఎందుకు ఇలా మారిపోయింది ?

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఏదో ఒక టైమ్ లో, కథలు నచ్చక సినిమాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు చాలా ఉంటాయి. అయితే ఆ వదిలేసిన కథలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే.. అయ్యో అనిపిస్తుంది.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో కూడా బోలెడు బ్లాక్ బస్టర్స్ ను వదిలేశాడట. కథలు నచ్చక రిజెక్ట్ చేసిన ఆ సినిమాలు కొందరు హీరోలను స్టార్ సెలబ్రిటీలుగా మార్చేశాయి. 

పవన్ కళ్యాణ్  కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా  బద్రి. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కేరేర్ కు బూస్ట్ ఇచ్చింది. ఈసినిమాతో పనవ్ కు డిఫరెంట్ ఇమేజ్ కూడా వచ్చింది. యూత్ లో ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది.

Also Read: బాహుబలి సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో, ప్రభాస్ కంటే ముందు రాజమౌళి ఆఫర్ ఇచ్చింది ఎవరికి?

36

అయితే ఆ తరువాత కూడా పవన్ స్టార్ కు అదిరిపోయే  నాలుగు అద్భుతమైన కథలు చెప్పాడట పూరీ జగన్నాథ్. మాస్ మహారాజ్ రవితేజను ఇండస్ట్రీలో నిలబెట్టిన సినిమాలు ఇట్లు శ్రాణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి.  ఈ మూడు సినిమా కథలను ముందుగా పవన్ కే వినిపించాడట పూరి. పవన్ నో అనడంతో రవితేజ వరుసగా ఈసినిమాలు చేసి ఇండస్ట్రీలో నిలబడ్డాడు. 

46
Mahesh Babu

Mahesh Babu

అంతే కాదు మరో గోల్డెన్ ఆఫర్ ను కూడా పవర్ స్టార్ మిస్ చేసుకున్నాడని తెలుస్తోంది. అదేంటంటే.. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పోకిరి సినిమా కూడా పవన్ కళ్యాన్ కోసం రాసుకున్నాడట పూరి జగన్నాధ్.  ఈ కథ కూడా ఆయనకు నచ్చకపోవడంతో.. ఈ కథలో కొన్ని మార్పులు చేసి, మహేష్ బాబు కోసం రెడీ చేశాడు దర్శకుడు. ఇక ఈసినిమా తరువాత మహేష్ బాబు రేంజ్ మొత్తం మారిపోయింది. పోకిరి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అప్పట్లో టాలీవుడ్ లో హైయోస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే సినిమా పవన్ చేసుంటే అప్పుడు ఆ రికార్డ్స్ అన్నీ ఆయన సొంతం అయ్యేవి అనుకున్నారు ఫ్యాన్స్. 
 

56

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబోలో తెరక్కిన సినిమా అతడు. ఈ సినిమా కథను కూడా మొదట పవన్ దగ్గరకే వెళ్ళింది. త్రివిక్రమ్ తో మొదటి నుంచి పవన్ కు మంచి అనుబంధం ఉంది. అతడు సినిమా  కథను పవన్ కు వినిపించినప్పుడు ఆయన అది వింటూ నిద్రపోయాడట. దాంతో  నచ్చలేదేమో అనుకుని త్రివిక్రమ్  మహేష్ బాబుతో అతడు సినిమాను  తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా సెన్సెషనల్  అయ్యింది. 

66

పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో మరో బ్లాక్ బస్టర్ మూవీ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈసినిమాలో మహేష్ బాబు పాత్ర కోసం ముందుగా పవన్ కళ్యాణ్ ను అనుకున్నాడట దర్శకుడు. కాని ఈ కథ తనకు సూట్ అవుతందో లేదో అని అనుమానంతో పవన్ ఈసినిమాను వద్దనుకున్నాడు. కాని ఈమూవీ ఎంత  హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇక ఇవి మాత్రమే కాకుండా గోలీమార్, మిరపకాయ్, లాంటి మరెన్నో సినిమాలను పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చసినట్టు తెలుస్తోంది. ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. ఈసినిమాలన్నీ పవన్ కళ్యాణ్ చేసి ఉంటే ఆయనే ఇండస్ట్రీలో నెంబర్ 1 గా ఉండేవారు, పాన్ ఇండియ స్టార్ అయ్యేవాడు అని అంటున్నారు ప్యాన్స్. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
మహేష్ బాబు ఘట్టమనేని

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved