MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • 24 ఏళ్ళ సెంటిమెంట్ ను బ్రేక్ చేయబోతున్న చిరంజీవి, విశ్వంభర కోసం మెగాస్టార్ సాహసం చేయబోతున్నారా ?

24 ఏళ్ళ సెంటిమెంట్ ను బ్రేక్ చేయబోతున్న చిరంజీవి, విశ్వంభర కోసం మెగాస్టార్ సాహసం చేయబోతున్నారా ?

Chiranjeevi Breaking 24 Year Sentiment: మెగాస్టార్ చిరంజీవి సాహసం చేయబోతున్నారా? 24 ఏళ్ళుగా దాచిన  సెంటిమెంట్ ను బ్రేక్ చేయబోతున్నారా..? ఎన్నో ఏళ్ళ కోరికను బయటకు తీయ్యబోతున్నారా? సినిమా డేంజర్ లో పడుతుందని తెలిసినా.. స్టార్ హీరో చేయబోయే సాహసం ఏంటి? 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 06 2025, 07:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Chiranjeevi Breaking 24 Year Sentiment: ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సినిమాల విషయంలో  హీరోలు కాని, దర్శకులు కాని కలిసిరాని పనులు చేయరు. అలా చేసి వారి సినిమాలు వారే పోగోట్టుకోరు కదా? కొన్ని సెంటిమెంట్లు గట్టిగా ఫాలో అవుతుంటారు. ఉదాహరణకు మహేష్ బాబు తన సినిమా ఓపెనింగ్ కు వెళ్తే.. ఆసినిమా ప్లాప్ అవుతుందని నమ్ముతాడట.

అందుకే ఆయన తన సినిమా ఓపెనింగ్స్ కు వెళ్ళడు. అలా మెగాస్టార్ చిరంజీవికి కూడా ఓ సెంటిమెంట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ సెంటిమెంట్ ను కూడా దాదాపు 24 ఏళ్ళ తరువాత తాజాగా బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్నాడట. ఇంతకీ మెగా సెంటిమెంట్ ఏంటి..? ఆయన చేయబోయే సాహసం ఏంటి? 

Also Read: 40 కోట్లు బడ్జెట్ పెడితే 40 వేలు కూడా రాలేదు, దేశంలోనే చెత్త రికార్డ్ ఈ సినిమాదే?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

చిరంజీవి సినిమాల్లో ఆయన పాట పాడితే.. ఆసినిమా ప్లాప్ అవుతుందని నమ్ముతారని తెలుస్తోంది. గతంలో ఆయన పాట పాడిన సినిమాల ఫలితాలు తారుమారు అవవ్వడంతో, ఈ సెంటిమెంట్ ను ఫాలో అవుతూ వస్తున్నారు మెగాస్టార్. అందుకే గత 24 ఏళ్ళుగా ఆయన  సినిమాల్లో పాటలు పాడింది లేదు. గతంలో ఎప్పుడో 1997 లో మాస్టర్ సినిమా కోసం 'తమ్ముడు అరే తమ్ముడు ఈ తికమక దిగులే ప్రేమంటే' అని పాట పాడారు చిరు. కాని ఆ  సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు. యావరేజ్ టాక్ తో నడిచింది. పాట కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. 

Also Read: దివ్య భారతి మరణంతో ఆగిపోయిన 10 సినిమాలు, పూర్తి చేసిన స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

35

ఇక 2001 లో వచ్చిన మృగరాజు సినిమా కోసం కూడా మరోసారి గొంతు సవరించారు చిరంజీవి. 'అరె ఛాయ్ చటుక్కున్నా తాగరా భాయ్' అంటూ మాస్ సాంగ్ ను.. ఊరమాస్ స్టెప్పులతో అదరగొట్టారు. అయితే ఈ సాంగ్ మాత్రం హిట్ అయ్యింది. మాస్ ఆడియన్స్ లో మోత మోగించేసింది. అప్పట్లో ఈ పాట బాగా పాపులర్ అయ్యింది. కాని సినిమా సక్సెస్ కు మాత్రం ఈ సాంగ్ ఏమాత్రం ఉపమోగపడలేదు. గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన మృగరాజు డిజాస్టర్ అయ్యింది. కాన్సెప్ట్ అంత అద్భుతంగా ఉన్నా.. సినిమా మాత్రం హిట్ అవ్వలేదు. 

Also Read: కీర్తి సురేష్ షాకింగ్ లుక్, బాయ్ కట్ లో మహానటి ఫోటోలు వైరల్

45
Actor Chiranjeevi starrer Vishwambhara film update out

Actor Chiranjeevi starrer Vishwambhara film update out

ఇక అప్పటి నుంచి చిరంజీవి తన సినిమాల్లో పాటలు పాడటం మానేశారు. మధ్యలో రాజకీయాల కోసం సినిమాలకు విరామం ఇచ్చారు మెగాస్టార్. ఆతరువాత రీ ఎంట్రీ ఇచ్చి కూడా చాలా ఏళ్ళు అవుతున్నా.. మెగాస్టార్ తన సినిమాల్లో ఇంత వరకూ పాట పాడింది లేదు.

అయితే ఈసారి మాత్రం విశ్వంభర సినిమా కోసం మరోసారి పాట పాడబోతున్నారట మెగాస్టార్. 24 ఏళ్ళ తన సెంటిమెంట్ ను బ్రేక్ చేసి.. మరోసారి సాహసం చేయబోతున్నారని తెలుస్తోంది. కీరవాణి  చిరంజీవి కోసం ఓ అద్భుతమైన పాటను రెడీ చేశారట.

మరి ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. మెగా ఫ్యాన్ సర్కిల్ లో మాత్రం ఈ వార్త తెగ తిరిగేస్తోంది. అయితే గతంలో చాలామంది హీరోలు తమ సినిమాల కోసం, తమ స్నేహితుల సినిమాల కోసం పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయి. 

Also Read: పవన్ కళ్యాణ్ మిస్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు? అవి చేసుంటే పవర్ స్టార్ పాన్ ఇండియా హీరో అయ్యేవాడా?

 

55

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే చాలా కాలంగా తన సినిమాలకోసం ఒక్క పాట అయిన పాడుతుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా అంతే తన సినిమాలకోసం చాలా పాటలు పాడిన ఆయన.. తన స్నేహితుల సినిమాల కోసం కూడా పాట పాడిన సందర్బాలు ఉన్నాయి. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం లో వెంకటేష్ కూడా పాట పాడారు. అరే మామా ఏక్ పెగ్గులా అంటూ.. బాలయ్య కూడా పాటలు పాడారు. ఇలా చాలామంది స్టార్ హీరోలు తమ సినిమాల కోసం గొంతు సవరించుకున్నారు. మరి చిరంజీవి ఈసారి విశ్వంభరతో ఏం మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలి.

Also Read: బాహుబలి సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో, ప్రభాస్ కంటే ముందు రాజమౌళి ఆఫర్ ఇచ్చింది ఎవరికి?

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved