కీర్తి సురేష్ షాకింగ్ లుక్, బాయ్ కట్ లో మహానటి ఫోటోలు వైరల్
సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ న్యూ లుక్ వైరల్ అవుతోంది. కీర్తి సురేష్ బాయ్ కటింగ్ హెయిర్ స్టైల్ లో కనిపించేసరికి అంతా షాక్ అవుతున్నారు. ఇంతకీ కీర్తిసురేష్ ఈ లుక్ కు కారణం ఏంటి?

కీర్తి సురేష్ AI ఫోటో
కీర్తి సురేష్ న్యూ లుక్స్ సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. బాయ్స్ హెయిర్ స్టైల్ లో ఉన్న ఈ హీరోయిన్ ను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఏదైనా కొత్త సినిమా కోసం ఇలా రెడీ అయ్యారా అని ప్రశ్నిస్తున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే ఇది AI టెక్నాలజీతో రూపొందించిన ఫోటో. ఈ టెక్నాలజీతో నటీనటుల రూపాన్ని పూర్తిగా మార్చి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో కీర్తి సురేష్ కొత్త లుక్ వైరల్ అవుతోంది.
Also Read: హీరోయిన్ల విషయంలో ప్రభాస్ కండీషన్లు, డైరెక్టర్లకు రెబల్ స్టార్ వార్నింగ్ ఏంటో తెలుసా?
కీర్తి సురేష్ న్యూ హెయిర్ స్టైల్:
ఇది AI టెక్నాలజీతో క్రియేట్ చేశారని తెలియని కొంతమంది అభిమానులు, సమ్మర్ మొదలైన వెంటనే కీర్తి సురేష్ ఇలాంటి హెయిర్ స్టైల్ కి మారిపోయారా అని కామెంట్ చేస్తున్నారు. అదే సమయంలో ఈ హెయిర్ స్టైల్ కీర్తి సురేష్ అందాన్నిఏమాత్రం తగ్గించలేకపోయిందని అంటున్నారు.
Also Read: దివ్య భారతి మరణంతో ఆగిపోయిన 10 సినిమాలు, పూర్తి చేసిన స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?
కీర్తి సురేష్ పెళ్లి:
రీసెంట్ గా పెళ్లి చేసుకుంది కీర్తి సురేష్. తన చిన్న నాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ ను పెళ్లాడింది. మ్యారీడ్ లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తుంది మహానటి. అయితే ఫోటోలు చూసిన కొందరు నెటిజన్లు మాత్రం మీ కొత్త హెయిర్ స్టైల్ గురించి మీ అత్తగారు ఏమన్నారు అని ప్రశ్నిస్తున్నారు.
Also Read: బాహుబలి సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో, ప్రభాస్ కంటే ముందు రాజమౌళి ఆఫర్ ఇచ్చింది ఎవరికి?
కీర్తి సురేష్ నెక్స్ట్ మూవీ
పెళ్లి తర్వాత ఏ సినిమాలోనూ కమిట్ అవ్వకుండా ఉన్న కీర్తి సురేష్, త్వరలో రణబీర్ కపూర్ సరసన బాలీవుడ్ సినిమాలో నటించనున్నట్లు సమాచారం. సౌత్ లో సినిమాలు తగ్గించి బాలీవుడ్ లో యాక్టీవ్ అవుతోంది మలయాళ హీరోయిన్. తెలుగులో ఇప్పటి వరకూ ఎటువంటి ప్రాజెక్ట్ కు సైన్ చేయలేదు.
అక్క వెబ్ సిరీస్:
వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది కీర్తి.. రీసెంట్ గా అక్క అనే వెబ్ సిరీస్‌లో చాలా బోల్డ్ పాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ త్వరలో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల కానుంది. కీర్తి సురేష్ తెలుగులో సినిమాలు చేయడానికి రెడీగా ఉంది. కొన్ని కథలు కూడా వింటున్నట్టు తెలుస్తోంది.
Also Read:40 కోట్లు బడ్జెట్ పెడితే 40 వేలు కూడా రాలేదు, దేశంలోనే చెత్త రికార్డ్ ఈ సినిమాదే?