- Home
- Entertainment
- పెళ్లి, విడాకులు, అనారోగ్యం, స్టార్ హీరోయిన్ సమంత లైఫ్ జర్నీ, పల్లవరం to పాన్ ఇండియా
పెళ్లి, విడాకులు, అనారోగ్యం, స్టార్ హీరోయిన్ సమంత లైఫ్ జర్నీ, పల్లవరం to పాన్ ఇండియా
స్టార్ హీరోయిన్ సమంత 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కెరీర్ లో స్టార్ హీరోయిన్ లగ్జరీ లైఫ్ ను చూసిన ఆమె.. పర్సనల్ లైఫ్ లో అంతకు మించి కష్టాలు అనుభవించారు. పెళ్లి, విడాకులు, అనారోగ్య, ఇలా ఆమె జీవితంలో ముఖ్యమైన అంశాలు చాలా ఉన్నాయి.

సౌత్ సినిమా ప్రపంచంలో సమంతది ఒక ప్రత్యేక స్థానం. చెన్నై పల్లవరంలో పుట్టి పెరిగిన సమంత, ఆతరువాత కాలంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగింది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్.. ఈసినిమాతోనే నాగచైతన్య ప్రేమలో పడింది. ఈమూవీతో తమిళ, తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది సమంత.
Also Read: పాకిస్తాన్ పై బూతులతో రెచ్చిపోయిన విజయ్ దేవరకొండ, ఒక్క ఛాన్స్ ఇస్తే అంతు చూస్తానంటున్న రౌడీ హీరో
సమంత
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతూ వచ్చింది సమంత. సమంత అందానికి ముగ్ధులైన సినీ ప్రేక్షకులు, ఆమెకు ఫిదా అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ తో బృందావనం, మహేష్ బాబుతో దూకుడు, ఎస్.ఎస్. రాజమౌళి ఈగ వంటి చిత్రాలతో తెలుగులో స్టార్ గా మెరిసిన సమంత.. తన మాతృపరిశ్రమ అయిన తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ స్టార్ డమ్ తెచ్చుకున్నారు.
Also Read: నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, దేవర 2 పనులు మొదలు పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ టీమ్
సమంత రూత్ ప్రభు
ఇక తమిళంలో కూడా సూర్యతో అంజాన్, విక్రమ్ తో ఎండ్రతుకుల్ల, శివకార్తికేయన్ తో సీమరాజా, ధనుష్ తో తంగమగన్ వంటి చిత్రాలలో నటించి స్టార్ డమ్ తెచ్చుకుంది సమంత. అంతేకాకుండా, త్యాగరాజన్ కుమారరాజా సూపర్ డీలక్స్ చిత్రంలో ఆమె పోషించిన ప్రయోగాత్మక పాత్ర సమంత ఇమేజ్ ను మరో మెట్టు ఎక్కించింది.
సమంత పుట్టినరోజు
తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్స్ చేసిన సమంత ఆతరువాత నాగచైతన్య తో సీక్రేట్ లవ్ కొనసాగించింది. ఏడేళ్లు ప్రేమించుకున్న వీరు 2017 లో పెళ్ళి చేసుకున్నారు. కాని నాలుగేళ్లు కాపురం చేయకుండానే 2021 లో వీరు విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటి నుంచి డిప్రెషన్ లోకి వెళ్లిన సమంత కోలుకోవడానికి టైమ్ పట్టింది. నెటిజన్ల ట్రోలింగ్ వల్ల ఇబ్బందిపడ్డ సామ్.. ఆధ్యాత్మిక మార్కం ఎంచుకున్నారు.
ఆతరువాత కొంత కాలానికి కోలుకున్నా.. మయోసైటిస్ మహమ్మారి వ్యాధి బారిన పడి మరోసారి కోలుకోలేని దెబ్బ తిన్నారు సమంత. ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆ వ్యాధిని కూడా జయించి.. సినిమాలు చేసుకుంటూ.. తన స్టార్ డమ్ ను నిలబెట్టుకున్నారు. ఇప్పటికీ అదే స్టార్ డమ్ తో టాలీవుడ్, బాలీవుడ్ లలో సినిమాలు చేస్తోంది సమంత.
Also Read: పహల్గాం ఉగ్రదాడిపై ట్వీట్, షారుఖ్ ఖాన్ పై ట్రోలింగ్
హ్యాపీ బర్త్ డే సమంత
హీరోయిన్ గా మాత్రమే కాదు హో బేబీ, యశోద, శాకుంతలం లాంటి డిఫరెంట్ సినిమాలు చేస్తూ..పుష్పలో ఐటమ్ సాంగ్ తో తన ప్రత్యేకతను చాటుకుంది సమంత. తనకెరీర్ ను ఎప్పటికప్పుడు ట్రెండ్ కు తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటుంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్ లు చేస్తుంది.
అంతే కాదు ఫ్యామిలీ మెన్ డైరెక్టర్స్ లో ఒకరైన రాజ్ నిడమూరిని ఆమె పెళ్ళాడబోతున్నట్టు రూమర్స్ వైరల్ అవుతున్నాయి. తప జీవితంలో ఎన్నో సవాళ్లను ఫేస్ చేసిన సమంత..సామాన్య మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈరోజు ఆమె తన 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: స్టార్ హీరోయిన్ పెళ్లి, రోజంతా ఏడ్చిన అల్లు అర్జున్, అంతలా ప్రేమించిన హీరోయిన్ ఎవరు?